عَن أَبِي أُمَامَةَ قَالَ: حَدَّثَنِي عَمْرُو بْنُ عَبَسَةَ رضي الله عنه أَنَّهُ سَمِعَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«أَقْرَبُ مَا يَكُونُ الرَّبُّ مِنَ العَبْدِ فِي جَوْفِ اللَّيْلِ الآخِرِ، فَإِنْ اسْتَطَعْتَ أَنْ تَكُونَ مِمَّنْ يَذْكُرُ اللَّهَ فِي تِلْكَ السَّاعَةِ فَكُنْ».

[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي] - [سنن الترمذي: 3579]
المزيــد ...

అబూ ఉమామహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నాకు ఈ విషయాన్ని అమ్ర్ ఇబ్న్ అబసహ్ రదియల్లాహు అన్హు తెలియజేసారు; ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా విన్నారు:
“ప్రభువు (అల్లాహ్) తన దాసునికి అతి చేరువలో ఉండే సమయం ఏది అంటే అది రాత్రిలోని చివరి భాగము. ఆ ఘడియలో (రాత్రి చివరి భాగములో) అల్లాహ్ ను స్మరించే వారిలో ఒకరు కాగలిగే సామర్థ్యము మీలో ఉంటే అలా చేయండి.”

[ప్రామాణికమైన హదీథు] - [అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అన్నసాయీ నమోదు చేసినారు:] - [సునన్ అత్తిర్మిదీ - 3579]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: " సర్వశక్తిమంతుడు అయిన అల్లాహ్ రాత్రి చివరి మూడవ భాగంలో, తన దాసునికి అత్యంత చేరువగా ఉంటాడు; కనుక ఓ విశ్వాసి! మీరు నిద్ర నుండి లేవడంలో విజయం సాధిస్తే, ఈ సమయంలో అల్లాహ్‌ను ఆరాధించే, ప్రార్థించే, ధ్యానించే మరియు అల్లాహ్ ఎదుట పశ్చాత్తాపపడే వారిలో మీరు కూడా చేరగలిగితే, అలా తప్పక చేయండి, ఎందుకంటే ఇది శ్రద్ధతో ఒడిసి పట్టుకోవలసిన అద్భుత అవకాశం.

من فوائد الحديث

  1. ఈ హదీథులో రాత్రి చివరి భాగములో అల్లాహ్’ను ఆరాధించమనే హితబోధ ఉన్నది.
  2. ఇందులో ఘనత కలిగిన కొన్ని ప్రత్యేక సమయాలు ఉన్నాయని, ఆ సమయాలలో సలాహ్ (నమాజు) ఆచరించుట, అల్లాహ్’ను స్మరించుట, ఆయనను వేడుకొనుట చేయవలెనని తెలుస్తున్నది.
  3. 'మీర్క్' అనే ఆయన ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటలలో వ్యత్యాసం ఉన్నది: దానిని అర్థం చేసుకోవాలి. ఈ హదీథులో “ప్రభువైన అల్లాహ్ తన దాసునికి అతి చేరువలో ఉంటాడు...” అనే మాటలకు; మరొక హదీథులో “సజ్దాహ్ స్థితిలో దాసుడు తన ప్రభువుకు అతి చేరువలో ఉంటాడు” అని అనే మాటలకు అర్థం ఏమిటంటే – రాత్రి చివరి మూడవ భాగములో అల్లాహ్ తన దాసునికి అతి చేరువలో ఉంటాడు అని, దాసుడు తన ప్రభువుకు అతి చేరువలో ఉండే స్థితి ఏమిటంటే అతడు సలాహ్ (నమాజు)లో సజ్దాహ్ చేస్తున్న స్థితి.
అనువాదాలను వీక్షించండి
భాష: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇంకా (50)
ఇంకా