عَنْ أَبِي سَعِيدٍ الخُدْرِيِّ رضي الله عنه أَنَّهُ سَمِعَ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«إِذَا رَأَى أَحَدُكُمُ الرُّؤْيَا يُحِبُّهَا فَإِنَّهَا مِنَ اللَّهِ، فَلْيَحْمَدِ اللَّهَ عَلَيْهَا وَلْيُحَدِّثْ بِهَا، وَإِذَا رَأَى غَيْرَ ذَلِكَ مِمَّا يَكْرَهُ، فَإِنَّمَا هِيَ مِنَ الشَّيْطَانِ، فَلْيَسْتَعِذْ مِنْ شَرِّهَا، وَلاَ يَذْكُرْهَا لِأَحَدٍ، فَإِنَّهَا لَنْ تَضُرَّهُ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 7045]
المزيــد ...
అబీ సయీద్ అల్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా విన్నారు:
“మీలో ఎవరైనా (నిద్రలో) ఏదైనా కల చూసినట్లయితే, మరియు ఒకవేళ అది మీకు ఇష్టమైన కల అయినట్లయితే, అది అల్లాహ్ తరఫు నుంచి (అని భావించాలి); అందుకు మీరు అల్లాహ్’కు కృతఙ్ఞతలు తెలుపుకోవాలి, ఆయన ఘనతను కొనియాడాలి మరియు ఇతరులకు తెలియజేయాలి. మరి ఒకవేళ మీకు వచ్చిన కలను మీరు ఇష్టపడనట్లయితే, అది షైతాను తరఫు నుంచి (అని భావించాలి), అందుకు మీరు అల్లాహ్ యొక్క శరణు వేడుకోవాలి, మరియు దానిని ఇతరులకు తెలియజేయకూడదు. ఎందుకంటే అది మీకు ఎలాంటి హానీ కలుగజేయదు.”
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 7045]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: కలలో ఏదైనా మంచి విషయాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే విషయాన్ని చూసినట్లయితే అది అల్లాహ్ తరఫు నుండి అవుతుంది. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు – అందుకు బదులుగా మీరు అల్లాహ్ యొక్క ఘనతను కీర్తించండి, ఆయనకు కృతఙ్ఞతలు తెలియజేయండి, మరియు దానిని ఇతరులకు తెలియజేయండి. ఒకవేళ కలలో ఏదైనా చెడు విషయాన్ని అంటే బాధకు, విచారానికి గురిచేసే విషయాన్ని చూసినట్లయితే, అది షైతాను తరఫు నుండి అవుతుంది. అందుకు మనం అల్లాహ్ యొక్క శరణు వేడుకోవాలి, మరియు దాని గురించి ఇతరులకు తెలియజేయరాదు, ఎందుకంటే అది మనకు ఎటువంటి హాని కలుగజేయదు; అల్లాహ్ ఇందులో పేర్కొనబడిన విషయాన్ని, అటువంటి చెడు కల నుండి అల్లాహ్ యొక్క రక్షణ మరియు ఆయన శరణు వేడుకోవడానికి ఒక కారణంగా చేసినాడు.