عن عُمر بن أبي سلمة رضي الله عنه قال:
كُنْتُ غُلَامًا فِي حَجْرِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، وَكَانَتْ يَدِي تَطِيشُ فِي الصَّحْفَةِ، فَقَالَ لِي رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «يَا غُلَامُ، سَمِّ اللهَ، وَكُلْ بِيَمِينِكَ، وَكُلْ مِمَّا يَلِيكَ» فَمَا زَالَتْ تِلْكَ طِعْمَتِي بَعْدُ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5376]
المزيــد ...
ఉమర్ ఇబ్న్ అబీ సలమహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం:
“నేను నా బాల్యములో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పెంపకములో ఉంటిని. (భోజన సమయాన) నా చేయి భోజనపళ్ళెం అంతటా తిరుగుతూ ఉండేది. దాంతో రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో ఇలా అన్నారు “ఓ బాలుడా! (తినుటకు ముందు) అల్లాహ్ పేరును స్మరించు, కుడి చేతితో తిను, మరియు నీకు దగ్గరగా (ఎదురుగా) ఉన్నదాని నుండి తిను.” అప్పటి నుండి నేను ఆ విధంగానే తింటున్నాను.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 5376]
ఉమర్ బిన్ అబీ సలమహ్ రజియల్లాహు అన్హుమా, ప్రవక్త భార్యలలో ఒకరైన ఉమ్మె సలమహ్ రజియల్లాహు అన్హా యొక్క కుమారుడు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పెంపకము మరియు సంరక్షణలో పెరిగినారు. ఆయన ఇలా వివరిస్తున్నారు: భోజన సమయాన ఆయన చేయి భోజన పళ్ళెంలో అటు పక్కకు, ఇటు పక్కకు కదులుతూ ఉండేది అక్కడి నుండి పళ్ళెంలోని పదార్థాలను తీసుకోవడానికి. అది చూసి ప్రవక్త ఆయనకు మూడు భోజన మర్యాదలు బోధించినారు:
మొదటిది: భోజనం తినుట ప్రారంభించడానికి ముందు ‘బిస్మిల్లాహ్’ పఠించుట.
రెండవది: కుడి చేతితో తినుట.
మూడవది: భోజన పళ్ళెంలో తన వైపున అంటే తన ఎదురుగా, తనకు దగ్గరగా ఉన్న దానిలో నుండి తినుట.