عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«بَيْنَمَا رَجُلٌ يَمْشِي بِطَرِيقٍ وَجَدَ غُصْنَ شَوْكٍ عَلَى الطَّرِيقِ فَأَخَّرَهُ، فَشَكَرَ اللَّهُ لَهُ فَغَفَرَ لَهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1914]
المزيــد ...
అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
“ఒక వ్యక్తి కాలిబాట మీద నడుస్తుండగా, దారిలో అతనికి ఒక ముళ్ళ కొమ్మ కనిపించింది, అతడు దానిని తీసి ప్రక్కన పడవేసాడు. అల్లాహ్ అతణ్ణి కృతజ్ఞతతో ప్రశంసించి అతణ్ణి క్షమించాడు.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 1914]
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు, ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళుతుండగా, దారిపై పడి ఉన్న ఒక ముళ్ళ చెట్టు కొమ్మను చూసాడు. దాని వల్ల ముస్లిములకు హాని కలుగుతున్నది. అతడు దానిని దారి పైనుండి తొలగించి ప్రక్కన పడవేసినాడు. అల్లాహ్ అతణ్ణి కృతఙ్ఞలతో ప్రశంసించి అతడిని క్షమించినాడు.