హదీసుల జాబితా

“మీలో ఎవరైనా ఒకవేళ నిద్ర నుంచి లేచినట్లయితే అతడు నీటితో ముక్కును మూడు సార్లు శుభ్రపరుచుకోవాలి, ఎందుకంటే షైతాను అతని ముక్కుపుటాలపై రాత్రి గడుపుతాడు కనుక.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒక వ్యక్తి ఉదూ చేసి, ఒక గోరు పరిమాణంలో ఉన్న ఒక చిన్న భాగాన్ని తన పాదంలో కడగకుండా వదిలివేసాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని చూసి ఇలా అన్నారు: “వెళ్ళు, వెళ్ళి నీ ఉదూను సక్రమంగా ఆచరించు". అతడు మళ్ళీ ఉదూ చేసి సలాహ్ ఆచరించినాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నానం చేసినా, లేక ‘గుస్ల్’ చేసినా ఒక ‘సా’ నుండి ఐదు ‘ముద్’ ల నీళ్ళతో చేసేవారు. ఉదూ కేవలం ఒక ‘ముద్’ నీళ్ళతో చేసేవారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒక ముస్లిం మంచిగా ఉదూ చేసుకుని, ఆ తరువాత నిలబడి రెండు రకాతుల నమాజును తన హృదయమును మరియు ముఖమును రెండింటినీ ‘ఖిబ్లహ్’ వైపునకు త్రిప్పుకుని ఆచరిస్తే, అతని కొరకు స్వర్గము ‘వాజిబ్’ చేయబడుతుంది (అతని కొరకు స్వర్గము తప్పనిసరి చేయబడుతుంది)
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరైనా ఉదూ చేసి, తరువాత (పాదములకు) “ఖుఫ్”లను (“ఖుఫ్ఫైన్” – పలుచని తోలుతో చేయబడిన మేజోళ్ళు) తొడుగుకున్నట్లయితే, వాటిని తొడిగి ఉన్న స్థితిలోనే అతడు నమాజు ఆచరించవచ్చును, “జనాబత్” స్థితికి (సంభోగానంతర అశుద్ధ స్థితికి) లోనైతే తప్ప వాటిని కాళ్ళనుండి తీయకుండా వాటి పైన తడి చేతులతో ‘మసహ్’ చేయవచ్చును (తడమవచ్చు).”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైనా మరొక వ్యక్తిపై “ఫుసూఖ్” (దుష్టత్వము) నింద మోపితే (అంటే ఆ వ్యక్తి “ఫాసిఖ్” (దుష్టుడు) అని నింద మోపితే), లేక అతనిపై “కుఫ్ర్” (సత్యతిరస్కారపు) నింద మోపితే (అంటే అతడు ‘కాఫిర్’ (సత్యతిరస్కారి) అని నింద మోపితే) – ఒకవేళ నింద మోపబడిన ఆ సహచరుడు వాస్తవానికి అటువంటి వాడు కాకపోతే – అది ఆ నింద మోపిన వాని వైపునకే తిరిగి వస్తుంది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా, అరేబియా ద్వీపకల్పంలో “ముసల్లూన్” (నమాజులను తప్పనిసరిగా ఆచరిస్తూ ఉండేవారు) తనను ఆరాధిస్తారనే ఆశను సాతాను కోల్పోయాడు, కానీ వారి మధ్య విభేదాల బీజాలను నాటగలనని అతడు ఆశిస్తున్నాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
నరకపు వాసులలో నేను చూడని రెండు రకాలు ఉన్నారు, వారిని నేను ఎన్నడూ చూడలేదు. ఆవు తోకలవంటి కొరడాలు కలిగిన జాతి, వాటితో వారు ప్రజలను కొడుతున్నారు; తాము స్వయంగా చెడు వైపునకు మొగ్గు చూపుతూ, చెడు వైపునకు ఆహ్వానిస్తూ దుస్తులు ధరించి కూడా నగ్నంగా కనిపించే స్త్రీలు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒక పురుషుడు మరో పురుషుని ‘ఔరహ్’ ను చూడరాదు. మరియు ఒక స్త్రీ మరో స్త్రీ ‘ఔరహ్’ ను చూడరాదు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“కుక్క మరియు చిత్రపటం ఉన్న ఇంటిలోనికి దైవదూతలు ప్రవేశించరు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“తమ వెంట కుక్కను తీసుకు వెళుతున్న ప్రయాణీకుల సమూహాన్ని, మరియు (తమ జంతువుల మెడలో) గంట కలిగిన ఉన్న ప్రయాణీకుల సమూహాన్ని దైవదూతలు అనుసరించరు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మిథ్యా దైవాల పేరున (విగ్రహాల పేరున) గానీ, లేక మీ తాతలు, తండ్రుల పేరున గానీ ప్రమాణం చేయకండి (ఒట్టు పెట్టుకోకండి).”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే “అమానహ్” (నమ్మకం, విశ్వాసం మొదలైన విషయాల) పై ప్రమాణం చేస్తారో, అతడు మాలోని వాడు కాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఓ స్త్రీలారా! మీరు ఎక్కువగా దానధర్మాలు చేయండి, ఎందుకంటే నరకాగ్నివాసులలో ఎక్కువమంది స్త్రీలే ఉండడాన్ని నేను చూసాను”. దానికి వారు “అలా ఎందుకు ఓ రసూలుల్లాహ్?” అని ప్రశ్నించినారు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీరు తరుచూ శాపనార్థాలు పెడతారు, మీ భర్తలపట్ల మీరు కృతజ్ఞులుగా ఉండరు; వివేకములో మరియు ధర్మములో మీకంటే ఎక్కువ కొరత కలిగిన వారిని నేను చూడలేదు, మరియు అత్యంత జాగ్రత్తగా ఉండే వివేకవంతుడైన పురుషుడుని సైతం మీలో కొందరు తప్పుదారి పట్టించగలరు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఋతుస్రావం నుండి (బహిష్ఠు స్థితి నుండి) గుసుల్ చేసి పరిశుద్ధత పొందిన తరువాత (కూడా) విడుదల అవుతూ ఉండే పసుపు రంగు ద్రవాన్ని అపరిశుద్ధమైనదిగా (మలినంగా) లెక్క చేసే వారము కాదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“బహిష్ఠు స్థితి సాధారణంగా ఎంత కాలం కొనసాగుతుందో అన్ని రోజులు వేచి ఉండు. తరువాత గుసుల్ చేయి”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“యుక్తవయస్కుడైన ప్రతి ముస్లిం పురుషునిపై శుక్రవారం నాడు గుసుల్ చేయుట (తల స్నానం చేయుట) విధి; అలాగే మిస్వాక్ తో (పలుదోము పుల్లతో) పళ్ళు శుబ్రపరుచుకొనుట మరియు అందుబాటులో ఉన్నట్లయితే అత్తరు పూసుకొనుట కూడా.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఈ రెండు పాదరక్షలతో వెళ్ళు. ఈ తోట చుట్టూ ఉన్న గోడ వెనుక నీవు ఎవరిని కలిసినా, అతడు “అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు” అని తన హృదయంలో పూర్తి నిశ్చయతతో సాక్ష్యమిచ్చి నట్లైతే, అతనికి స్వర్గ ప్రవేశాన్ని గురించిన శుభవార్తనివ్వు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ముస్లిం ఎవరంటే – ఎవరి నాలుక నుండి మరియు చేతి నుండి తోటి ముస్లిములు సురక్షితంగా ఉంటారో; మరియు ‘ముహాజిరు’ (అల్లాహ్ మార్గములో మరో ప్రదేశానికి వలస వెళ్ళిన వ్యక్తి) ఎవరంటే – ఎవరైతే అల్లాహ్ నిషేధించిన వాటిని వదలివేస్తాడో.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఖుర్ఆన్ పారాయణంలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి, దైవదూతలలో గొప్పవారైన, ఉన్నతులైన మరియు విధేయులైన లేఖరుల సాంగత్యములో ఉంటాడు; మరియు ఎవరైతే ఖుర్ఆన్ ను తడబడుతూ, పారాయణం అతనికి కష్టంగా అనిపించినా ఖుర్ఆన్ పారాయణం చేసే వ్యక్తికి రెండు ప్రతిఫలాలు లభిస్తాయి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఏ స్త్రీ తన భర్తతో, లేదా ఒక ‘మహ్రం’ తో తప్ప రెండు రోజుల సుదూర ప్రయాణంలో (ఒంటరిగా) ప్రయాణించరాదు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మూడు సమయాలలో రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మమ్ములను నమాజు ఆచరించడం నుండి, మరియు మాలో చనిపోయిన వారిని ఖననం చేయడం నుండి నిషేధించేవారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే అజాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) విన్న తరువాత ఈ పలుకులు “అల్లాహుమ్మ, రబ్బహాదిహిద్ద’వతిత్తామ్మహ్, వస్సలాతిల్ ఖాఇమహ్, ఆతి ముహమ్మదన్ అల్’వసీలత, వల్ ఫజీలత, వబ్’అథ్’హు మఖామన్ మహ్’మూదన్ అల్లదీ వ అద్’తహు” (ఓ అల్లాహ్! ఈ పరిపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడబోయే ఈ నిత్య నమాజు పిలుపునకు ఓ ప్రభువా! దయచేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు (తీర్పు దినమున) స్వర్గంలో ఆయనకు తప్ప మరెవరికీ లభించని అత్యున్నత స్థానమును మరియు ఆధిక్యతను ప్రసాదించు, మరియు (తీర్పు దినమున) నీవు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు వాగ్దానం చేసిన స్వర్గంలో శ్రేష్ఠమైన మరియు మరియు అత్యున్నతమైన స్థానానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను పంపు) అని పలుకుతాడో తీర్పు దినమున అతనికి నా మధ్యవర్తిత్వం ఖచ్చితంగా లభిస్తుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరూ మీ భుజాలపై ఏ ఆచ్ఛాదనా లేకుండా ఒకే వస్త్రములో సలాహ్ (నమాజు) ఆచరించకండి”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నమాజులో ఉన్నపుడు ప్రజలు (కొంతమంది) ఆకాశం వైపు చూస్తున్నారు, ఏమైంది వారికి?” ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన మాట కఠినంగా మారింది మరియు ఆయన ఇలా అన్నారు, "వారు దానిని (నమాజు సమయంలో ఆకాశం వైపు చూడటం) ఆపాలి; లేకపోతే వారి కంటి చూపు పోతుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
(నమాజులో) మీరు సజ్దహ్ చేసినపుడు రెండు అరచేతులను నేలకు ఆనించి, రెండు మోచేతులు (నేలపై ఆనకుండా) పైకి ఉండేలా సజ్దహ్ చేయండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నమాజు ఆచరించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ముగించుట కొరకు సలాం చెప్పినపుడు తన కుడి వైపునకు “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” (అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు అనుగ్రము మీపై కురియుగాక) అని, మరియు తన ఎడమ వైపునకు “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్” (అల్లాహ్ యొక్క శాంతి మరియు కరుణ మీపై కురియుగాక) అని పలికినారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే (ప్రతిరోజూ విధిగా ఆచరించ వలసిన) ప్రతి నమాజు తరువాత ముప్ఫై మూడు సార్లు “సుబ్’హానల్లాహ్” అని, ముప్ఫై మూడు సార్లు “అల్’హందులిల్లాహ్” అని, ముప్ఫై మూడు సార్లు “అల్లాహు అక్బర్” అని ఉచ్ఛరిస్తాడో, అవి మొత్తం తొంభైతొమ్మిది అవుతాయి”; ఆయన ఇంకా ఇలా అన్నారు: “వాటిని “లాఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లాషరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హమ్దు, వహువ అలాకుల్లి షైఇన్ ఖదీర్” అని ఉచ్ఛరించి మొత్తం వందగా పూర్తి చేస్తాడో, అతని పాపాలన్నీ క్షమించివేయబడతాయి, అవి సముద్రపు నురగ అంత అధికంగా ఉన్నా సరే.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“విధిగా ఆచరించవలసిన ప్రతి సలాహ్ తరువాత ఎవరైతే “ఆయతుల్ కుర్సీ” పఠిస్తాడో, మరణం తప్ప, అతడిని స్వర్గములో ప్రవేశించడం నుండి ఏమీ నిషేధించదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నా సహాబాలను అవమానించకండి (వారి పట్ల అవమానకరంగా మాట్లాడకండి), మీలో ఎవరైనా ఉహుద్ కొండంత బంగారాన్ని ఖర్చు చేసినా, అది వారిలో (సహాబాలలో) ఒకరు ఖర్చు చేసిన ‘ముద్’ లేక కనీసం ‘ముద్’లో సగం అంత దానికి కూడా సమానం కాదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“బద్ర్ (యుధ్ధం) మరియు హుదైబియహ్ (ఒప్పందము) లలో ఎవరైతే పాల్గొన్నాడో అతడు ఎన్నడూ నరకాగ్ని లోనికి ప్రవేశించడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అబూబక్ర్ మరియు ఉమర్ (రదియల్లాహు అన్హుమా) లను గురించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వీరిద్దరూ స్వర్గములో పెద్దవారికందరికీ నాయకులు - మొదటి తరం నుండి మొదలుకుని చివరితరం వరకూ, అయితే అల్లాహ్ యొక్క ప్రవక్తలు మరియు సందేశహరులకు తప్ప.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్ హసన్ మరియు అల్ హుసేన్ (రదియల్లాహు అన్హుమా) ఇద్దరూ స్వర్గములో యువకుల నాయకులు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
నిశ్చయంగా, మీలో ఒకరు మరణించినప్పుడు, అతనికి ఉదయం మరియు సాయంత్రం అతని స్థానం చూపబడుతుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రాత్రింబవళ్ళు ఎక్కడెక్కడి వరకు చేరుకుంటాయో అక్కడి వరకు నిశ్చయంగా ఈ విషయం (ఇస్లాం) చేరుకుంటుంది. అది పల్లె గానీ లేదా పట్టణం గానీ లేదా ఎడారి గానీ, అల్లాహ్ ఏ ఒక్క ఇంటినీ విడిచి పెట్టకుండా ఈ ధర్మాన్ని (ఇస్లాంను) ప్రవేశింపజేస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరైనా తన నమాజు లో (తన నమాజులో ఉండగా) సందేహములో పడిపోతే, తను ఎన్ని (రకాతులు) ఆచరించినాడు? మూడా, నాలుగా అతనికి తెలియకపోతే – అతడు తన సందేహాన్ని (ప్రక్కకు) విసిరేసి, ఖచ్చితంగా ఎన్ని రకాతులు పూర్తి అయినాయని విశ్వసిస్తున్నాడో, దానిపై తన నమాజు ను ఆధారం చేసుకుని పూర్తి చేయాలి; తరువాత సలాం చెప్పే ముందు (సలాంతో నమాజు పూర్తి చేసే ముందు) రెండు సజ్దాలు చేయాలి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుహ్ర్ సలాహ్ కు ముందు నాలుగు (రకాతులు), మరియు ఫజ్ర్ సలాహ్’కు ముందు రెండు రకాతులు నమాజు ఆచరించడాన్ని ఎన్నడూ విడిచి పెట్టలేదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే జుహ్ర్ నమాజుకు ముందు నాలుగు రకాతులు, మరియు జుహ్ర్ నమాజు తరువాత నాలుగు రకాతులు నిరంతరం ఆచరిస్తాడో, అల్లాహ్ అతడిపై నరకాన్ని నిషేధించినాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఫజ్ర్ యొక్క రెండు రకాతుల (సున్నతు) నమాజులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, (మొదటి రకాతులో) “ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్” సూరహ్’ను, (రెండవ రకాతులో) “ఖుల్ హువల్లాహు అహద్” సూరహ్’ను పఠించేవారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఒక వ్యక్తి ఒంటరిగా ఆచరించే నమాజు కంటే సామూహికంగా చేసే నమాజు (జమాఅత్ తో ఆచరించే నమాజు) యొక్క ప్రతిఫలం ఇరవై ఐదు రెట్లు గొప్పది. రాత్రి సమయపు దేవదూతలు మరియు పగటి సమయపు దేవదూతలు ఫజ్ర్ నమాజు సమయంలో సమావేశమవుతారు.'
عربي ఇంగ్లీషు ఉర్దూ
(నమాజుకు సంబంధించి) పురుషుల కొరకు ఉత్తమమైన పంక్తులు మొదటి పంక్తులు; మరియు అధమమైనవి చివరి పంక్తులు; అలాగే స్త్రీల కొరకు ఉత్తమమైన పంక్తులు చివరి పంక్తులు, మరియు అధమమైనవి మొదటి పంక్తులు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి నమాజులో పంక్తి వెనుక ఒంటరిగా నిలబడి నమాజు ఆచరించడాన్ని చూసినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని ఆ నమాజు మరలా చేయమని ఆదేశించినారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఈ రెండు సలాహ్’లు (నమాజులు) కపటవిశ్వాసులపై భారమైనవి. ఈ రెండింటిలో ఏమి (దాగి) ఉన్నదో మీకు తెలిస్తే, మీ మోకాళ్ళపై ప్రాకుతూ రావల్సి వచ్చినా మీరు వాటి కొరకు (మస్జిదుకు) వస్తారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“తన వలీ (సంరక్షకుల) అనుమతి లేకుండా వివాహం చేసుకున్న స్త్రీ వివాహం చెల్లదు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాటలను మూడుసార్లు పలికినారు. ఇంకా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఒకవేళ భర్త ఆమెతో సంబోగములో పాల్గొని ఉంటే, అతడు ఆమె నుండి ఏదైతే పొందినాడో, అందుకు గానూ ఆమెకు వరకట్నం లభిస్తుంది. వారి మధ్య ఏదైనా వివాదం తలెత్తితే, సుల్తాన్ (అధికారంలో ఉన్న వ్యక్తి, ఆ ఇద్దరిలో) సంరక్షకుడు ఎవరూ లేని వ్యక్తికి సంరక్షకుడు అవుతాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“శాపగ్రస్తుడు ఎవరంటే, ఎవరైతే తన భార్యతో ఆమె ఆసనము ద్వారా (మలద్వారము) సంభోగము చేసేవాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“పురుషునితో గానీ, లేక స్త్రీతో గానీ మలద్వారము ద్వారా సంభోగములో పాల్గొనే వాని వైపునకు అల్లాహ్ (తీర్పు దినమున) కన్నెత్తి కూడా చూడడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగాను: “ఓ రసూలుల్లాహ్! మాలో ఎవరి భార్యకైనా అతనిపై (ఆమె భర్తపై) ఉన్న హక్కు ఏమిటీ?” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నువ్వు తిన్నపుడు ఆమెకు కూడా తినిపించు; ఆమెకు కూడా దుస్తులు ధరింపజేయి - నీవు దుస్తులు ధరించినపుడు, లేదా నీవు డబ్బు సంపాదించినపుడు; ఆమె ముఖం పై ఎపుడూ కొట్టకు; ఆమెను ఎన్నడూ అవమానించకు; ఆమెను ఇంటిలో తప్ప ఇంకెక్కడా ఆమెను నీ నుండి వేరు చేయకు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
తల వెంట్రుకలకు సవరాన్ని జోడించి, వెంట్రుకలను పొడిగించే స్త్రీని మరియు సవరం కొరకు అడిగే స్త్రీని, పచ్చబొట్లు వేసే స్త్రీని మరియు పహ్చబొట్టు వేయమని అడిగే స్త్రీని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శపించారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైనా ఇద్దరు భార్యలు కలిగి ఉండి, వారిలో ఒక భార్య వైపునకు ఎక్కువగా ఆకర్షితులై ఉంటే (అన్నింటా ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే) పునరుత్థాన దినమున అతడు శరీరం ఒక వైపునకు వంగి ఉన్న స్థితిలో వస్తాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా అల్లాహ్ నా సమాజాన్ని (ఉమ్మత్’ను) వారి మనస్సులలోనికి వచ్చే (పరిపరి విధాల) ఆలోచనల కొరకు వారిని క్షమించాడు – వారు ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టనంత వరకు, లేక వాటిని బయటకు ఉచ్చరించనంత వరకు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ముగ్గురి పైనుండి (మూడు రకాల వ్యక్తులపైనుండి) కలము లేపివేయబడినది (వారిని గురించి ఏమీ నమోదు చేయదు); వారు: నిద్రిస్తున్న వ్యక్తి అతడు నిద్రనుంచి మేల్కొనేంత వరకు; యుక్త వయస్సుకు చేరని బాలుడు/బాలిక అతడు యుక్తవయస్సుకు చేరేంతవరకు, మరియు మతిస్థిమితము కోల్పోయిన పిచ్చివాడు, అతడు తిరిగి మతిస్థిమితం పొందేంతవరకు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మత్తు కలిగించే ప్రతి పదార్థమూ మద్యమే అనబడుతుంది, కనుక మత్తు కలిగించే ప్రతిదీ హరామే (నిషేధించబడినదే). ఎవరైతే ప్రాపంచిక జీవితంలో మద్యము త్రాగుతూ ఉంటాడో, పశ్చాత్తాపము చెందకుండా, దానికి అలవాటు పడి ఉన్న స్థితిలోనే మరణిస్తాడో, అతడు పరలోక జీవితములో దానిని (స్వర్గపానీయాలను) త్రాగలేడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీ సంపదలతో, మీ ఆత్మలతో (అంటే మీ ప్రాణాలు పణంగా పెట్టి), మరియు మీ నాలుకలతో బహుదైవారాధకులతో పోరాడండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! చిన్న పాపము, పెద్ద పాపము అనే భేదం లేకుండా నేను చేయని పాపపు పని లేదు (మరి నేను క్షమించబడతానా?); దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ తప్ప మరొక నిజ ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు” అని నీవు సాక్ష్యం పలుకలేదా?”
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎందుకంటే అతడు ఎన్నడూ “ఓ నా ప్రభూ! తీర్పు దినమున నా పాపములను మన్నించు” అని వేడుకోలేదు” అన్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
మీ ప్రభువు ఏమని అన్నాడో తెలుసా?” దానికి వారు “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునికే తెలుసును” అని జవాబిచ్చారు. దానికి ఆయన “అల్లాహ్ ఇలా అన్నాడు “నా దాసులలో కొంతమంది నన్ను విశ్వసిస్తూ (విశ్వాసులుగా) ఈనాటి ఉదయంలోనికి ప్రవేశించినారు, మరియు మరికొందరు అవిశ్వాసులుగా ప్రవేశించినారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
(ఓ ప్రవక్తా !) అప్పుడప్పుడు మా హృదయలలో ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే, వాటి గురించి మేము (బహిరంగంగా) మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేము”. దానికి ఆయన “నిజంగా మీకు అలా అనిపిస్తూ ఉంటుందా?” అని అడిగారు. దానికి వారు “అవును” అని సమాధానమిచ్చారు. అపుడు ఆయన “అది నిర్మలమైన విశ్వాసము (నిర్మలమైన విశ్వాసానికి నిదర్శనం)” అన్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
అల్’హందులిల్లాహ్ (స్తోత్రములన్నీ అల్లాహ్ కొరకే) ఆయన, వాడి (షైతాను యొక్క) కుతంత్రాన్ని (మనిషిలో) ఆలోచనలు రేకెత్తించడంగా (మాత్రమే) మార్చివేసాడు (పరిమితం చేసాడు)” అన్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరి దగ్గరికైనా షైతాను వచ్చి “ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు, ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు” అని ప్రశ్నిస్తాడు. చివరికి “మరి నీ ప్రభువును (అల్లాహ్’ను) ఎవరు సృష్టించినాడు” అంటాడు. మీలో ఎవరైనా ఈ పరిస్థితిని ఎదుర్కొంటే, అల్లాహ్ యొక్క రక్షణ అర్థించాలి మరియు దాని నుండి దూరం కావాలి”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఆచరణలు ఆరు రకాలు, మరియు మనుషులు నాలుగు రకాలు. (ఆచరణలలో) రెండు విధిగా జరిగేవి, సరికి సరి పరిమాణములో ప్రతిఫలం లభించేవి (రెండు), ఒక మంచి పనికి పది పుణ్యాలు రాయబడేది, ఒక మంచి పనికి ఏడు వందల రెట్లు పుణ్యాలు రాయబడేది
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒక మంచి పనికి (సత్కార్యమునకు) సంబంధించి విశ్వాసికి అల్లాహ్ ఎప్పుడూ అన్యాయం చేయడు. ఆ మంచి పని కొరకు ఆయన అతడికి (విశ్వాసికి) ఈ ప్రపంచములో ప్రసాదిస్తాడు, మరియు పరలోకములోనూ దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
నీవు నీ పూర్వపు మంచిపనులతో సహా ఇస్లాంను స్వీకరించినావు” అన్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్లాహ్, (దాసుడు) తన ఆదేశాలను తీసుకొనుటను, వాటిపై ఆచరించుటను ఏవిధంగానైతే ఇష్టపడతాడో, తాను అనుమతించిన విషయాలను (సౌలభ్యాలను, రాయితీలను) తీసుకొనుటను, వాటిపై ఆచరించుటను కూడా అదే విధంగా ఇష్టపడతాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“కపట విశ్వాసి ఉపమానము రెండు గుంపుల మధ్య తిరుగుతూ ఉండే ఆడ గొర్రె ఉపమానము వంటిది. అది ఒకసారి ఈ గుంపు లోనికి వెళితే, ఒకసారి ఆ గుంపు లోనికి వెళుతుంది”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా ధరిస్తూ ఉన్న అంగి (చొక్కా, పైవస్త్రం) కొంతకాలానికి క్షీణించినట్లు, మీలో ఎవరి హృదయాలలోనైనా విశ్వాసమూ క్షీణిస్తుంది. కనుక మీ హృదయాలలో విశ్వాసాన్ని నవీకరించమని అల్లాహ్ ను వేడుకొనండి”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రళయదినపు సంకేతాలలో – ఙ్ఞానము (భూమి నుండి) లేపు కోబడుతుంది, అఙ్ఞానము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, వ్యభిచారము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, సారా త్రాగుట సర్వసాధారణం అవుతుంది, పురుషులు సంఖ్యలో తగ్గిపోతారు, అదే స్త్రీలు (సంఖ్యలో) పెరిగి పోతారు; ఎంతగా అంటే యాభై మంది స్త్రీలకు (వారి మంచి చెడులు చూడడానికి) ఒక పురుషుడు మాత్రమే ఉంటాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అంతిమ ఘడియ అప్పటివరకూ స్థాపించబడదు – (ఏదైనా) సమాధి ప్రక్క నుండి వెళుతున్న వ్యక్తి (సమాధిని చూసి) “అతని స్థానములో నేను ఉంటే ఎంత బాగుండును!” అని పలికే వరకు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీరు యూదులతో యుద్ధం చేయనంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు. తన వెనుక దాగి ఉన్న యూదుని గురించి ఒక శిల “ఓ ముస్లిమా! ఓ యూదుడు నా వెనుక దాగి ఉన్నాడు. వాడిని సంహరించు” అని పలికేటంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరి చేతిలోనైతే నా ప్రాణమున్నదో, ఆయన సాక్షిగా – త్వరలో మరియం కుమారుడు (ఈసా అలైహిస్సలాం) ఒక ధర్మబద్ధుడైన న్యాయమూర్తిగా మీ మధ్యకు (భువి నుండి) దిగివస్తాడు. అతడు శిలువను విరిచేస్తాడు; పందిని చంపుతాడు; మరియు జిజియాను ఎత్తివేస్తాడు; అప్పుడు సంపద ఎంత పుష్కలంగా ఉంటుందంటే, ఎవరూ దానిని స్వీకరించరు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“సూర్యుడు పడమర నుండి ఉదయించనంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు. సూర్యుడు పడమర నుండి ఉదయించి నపుడు ప్రజలు దానిని చూస్తారు. అపుడు ప్రజలందరూ (అల్లాహ్ ను) విశ్వసిస్తారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“సమయము కుంచించుకు పోయే వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్లాహ్ భూమిని ఒడిసి పట్టుకుంటాడు; ఆకాశాలను చుట్టచుట్టి (దానిని కూడా) తన కుడి చేతిలో పెట్టుకుంటాడు. అప్పుడు ఆయన ఇలా అంటాడు “నేనే రారాజును, భూమిపై (రాజరికం చేసిన) రాజులు ఏరీ, ఎక్కడున్నారు?”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నా నీటి తొట్టి (ఎంత పెద్దది అంటే) దాని రెండు అంచుల మధ్య దూరం ఒక నెల ప్రయాణమంత ఉంటుంది. దాని నీరు పాల కన్నా తెల్లనైనవి; దాని సువాసన కస్తూరీ గంధము కన్న మధురమైనది
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నేను నీటి కొలనుపై ఉంటాను, ఆ విధంగా మీలో ఎవరు నా వద్దకు వస్తారో చూస్తాను. కానీ కొంతమంది ప్రజలు నావద్దకు రాకుండా దూరంగా నిలిపి వేయబడతారు. నేను “ఓ ప్రభూ! వారు నా వాళ్ళు, నా సమాజం (ఉమ్మత్) వాళ్ళు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ముహమ్మద్ యొక్క ప్రాణం ఎవరి చేతిలోనైతె ఉన్నదో ఆయన సాక్షిగా; మబ్బులు లేని నల్లని ఆకాశంలోని నక్షత్రాలకన్నా, అందులోని గ్రహాల కన్నా, ఆ కప్పులు మిక్కిలి అధిక సంఖ్యలో ఉంటాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“(తీర్పు దినమున) మృత్యువు నల్లని తల, తెల్లని శరీరం కలిగిన ఒక గొర్రెపోతు రూపంలో తీసుకు రాబడుతుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీ ఈ (ప్రపంచపు) అగ్ని, నరకాగ్ని యొక్క డెభ్భై భాగాలలో ఒకటి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“సత్యసంధుడూ, అత్యంత విశ్వసనీయుడూ అయిన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాతో ఇలా అన్నారు “మీలో ప్రతి ఒక్కరి సృష్టి అతడి తల్లి గర్భములో నలభై దినములు, నలభై రాత్రులు (అతడి శరీరానికి కావలసిన వాటిని) సమీకరించడం ద్వారా జరుగుతుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రతి విషయమూ (అల్లాహ్) ఆదేశానుసారం జరుగుతుంది; చివరికి శక్తి (కలిగి ఉండుట), అశక్తత, లేక (అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ బహుశా ఇలా అన్నారు) అశక్తత మరియు శక్తి (కలిగి ఉండుట) కూడా”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా ‘ఫలానా భూమిపై (ఫలానా ప్రదేశములో) చనిపోతాడు” అని విధివ్రాతలో లిఖించి ఉంటే, అతడు అక్కడికి వెళ్ళడానికి ఏదైనా కారణాన్ని అతని కొరకు పొందుపరుస్తాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నా గురించి అసత్యాలు పలుకుతాడో, అతడు తన నివాస స్థానాన్ని నరకాగ్నిలో ఏర్పాటు చేసుకోవాలి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
, నేను నా తెగ వారి ప్రతినిధిగా ఇక్కడికి పంపబడినాను. నా తెగ బనూ సాద్ ఇబ్న్ బక్ర్ వారి సోదరుణ్ణి” అన్నాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో విషయాన్ని చెబుతూ చివరన “అది (ఈ ప్రపంచము నుండి) ఙ్ఞానము అంతరించి పోయినపుడు జరుగుతుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
గ్రంథ ప్రజలను (వారు చెబుతున్నదానిని) విశ్వసించకండి, అలాగని వారిని (వారు చెబుతున్న దానిని) తోసిపుచ్చకండి. మీరు ఇలా పలకండి (“మేము అల్లాహ్ ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన దానిని విశ్వసిస్తాము”)
عربي ఇంగ్లీషు ఉర్దూ
“పండితులు, విద్వాంసుల ముందు ప్రదర్శించే (ప్రదర్షనా) బుద్ధితోనో, లేక అఙ్ఞానులు, మూర్ఖులతో వాదించడానికో (వారిలో పైచేయి అనివిపించు కోవడానికో) ఙ్ఞాన సముపార్జన చేయకండి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రాచమార్గానికి (సిరాతల్ ముస్తఖీమ్’నకు) సంబంధించి అల్లాహ్ ఒక ఉపమానాన్ని ఇలా ఇచ్చినాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నలభై సంవత్సరాల వయసులో ఉన్నపుడు వారిపై వహీ (అల్లాహ్ యొక్క సందేశము) అవతరణ జరిగింది
عربي ఇంగ్లీషు ఉర్దూ
‘బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం’ (అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో) అనే ఆయతు అవతరించనంత వరకు సూరాలు (దివ్య ఖుర్’ఆన్ లోని అధ్యాయాలు) ఎక్కడ అంతమవుతాయనే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎరుగరు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరైనా తాను తన కుటుంబము వద్దకు తిరిగి వచ్చినపుడు ఎదురుగా పెద్ద పెద్ద, బాగా బలిసిన మరియు గర్భముతో ఉన్న మూడు ఆడ ఒంటెలను చూడడానికి ఇష్టపడతారా?
عربي ఇంగ్లీషు ఉర్దూ
“(పాపంచిక జీవితములో) తన మనసును ఖుర్’ఆన్ పఠనములో లగ్నము చేసుకున్న వానితో (తీర్పు దినమున) ఇలా అనడం జరుగుతుంది “ఏవిధంగానైతే నీవు ప్రాపంచిక జీవితములో ఖుర్’ఆన్ ను హృద్యంగా పఠించే వానివో అలా పఠిస్తూ (స్వర్గములో ఉన్నత స్థానములను) అధిరోహిస్తూ ఉండు. ఎక్కడైతే నీవు ఆఖరి ఆయతును పఠిస్తావో అదే నీ గమ్యస్థానము అవుతుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఖుర్’ఆన్ ను బహిరంగంగా పఠించే వాడు, బహిరంగంగా సదఖా (దాన ధర్మములు) చేసినటువంటి వాడు, ఖుర్’ఆన్ ను ఒంటరిగా (ఏకాంతములో) పఠించేవాడు, రహస్యముగా సదఖా చేసినటువంటి వాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
తాము ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి పది ఆయతులను వినే వారమని, వాటిలోని ఙ్ఞానమును పూర్తిగా నేర్చుకోనంత వరకు, మరియు (నేర్చుకున్న ఙ్ఞానాన్ని) నిజ జీవితములో అన్వయించుకోనంత వరకు మరొక పది ఆయతులకు వెళ్ళేవారము కాదు
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఓ అబుల్ ముంజిర్! నీ దగ్గర ఉన్న అల్లాహ్ యొక్క దివ్య గ్రంథములో ఏ ఆయతు అన్నింటి కంటే అత్యంత గొప్పది మరియు ఘనమైనదో నీకు తెలుసా?” అని ప్రశ్నించినారు. అపుడు నేను “అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం” (సూరహ్ అల్ బఖరహ్ 2:255) (అల్లాహ్‌! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు) అని జవాబిచ్చాను. దానికి ఆయన నా గుండెలపై తట్టి “అల్లాహ్ ఙ్ఞానాన్ని నీ కొరకు ఆహ్లాదకరమైనదిగా చేయుగాక ఓ అబుల్ ముందిర్!” అన్నారు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రతి రాత్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రకు ఉపక్రమించినపుడు తన రెండు అరచేతులను దగ్గరకు చేర్చి, వాటిలో ఊది, అల్ ఇఖ్లాస్, అల్ ఫలఖ్, అన్’నాస్ సూరాలను (ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలఖ్, మరియు ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్ సూరాలను)
عربي ఇంగ్లీషు ఉర్దూ
“యూదులు అల్లాహ్ ఆగ్రహానికి గురియైన వారు; మరియు క్రైస్తవులు మార్గభ్రష్ఠులైన వారు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
కనుక అస్పష్టమైన (ముతషాబిహాత్‌) ఆయతులను అనుసరించే వారిని గనుక నీవు చూసినట్లయితే, అటువంటి వారికి అల్లాహ్ ఒక పేరునిచ్చినాడు (హృదయాలలో వక్రత ఉన్నవారు అని). వారి పట్ల జాగ్రత్తగా ఉండు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైనా పాపపు పనికి పాల్బడితే, అతడు లేచి నిలబడి, తనను తాను పరిశుద్ధ పరుచుకుని, నమాజును ఆచరించి, అల్లాహ్ యొక్క క్షమాభిక్షను అర్థించినట్లయితే, అల్లాహ్ అతడిని తప్పక క్షమిస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
నీవు వారిని శిక్షించుట, మరియు వారు నీతో అబధ్ధాలాడుట, నిన్ను మోసగించుట, నీకు అవిధేయులగుట – ఇవన్నీ తూచబడతాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
అతడిని ఈ భూమి మీద కాళ్ళపై నడిచేలా చేయగలిగిన శక్తిమంతుడు (అయిన అల్లాహ్), తీర్పు దినమున అతడిని ముఖముపై నడిచేలా చేయలేడా?
عربي ఇంగ్లీషు ఉర్దూ
(ఓ చిన్నాన్నా!) ‘అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు’ అనండి (చాలు). తీర్పు దినమున దాని ద్వారా నేను మీ కొరకు సాక్ష్యము పలుకుతాను
عربي ఇంగ్లీషు ఉర్దూ
నిశ్చయంగా నీవు ఏమి చెబుతున్నావో అదీ, మరియు దేని వైపునకు ఆహ్వానిస్తున్నావో ఆ విషయమూ ఉత్తమమైనవి. మరి నిశ్చయంగా మేము చేసిన దానికి పరిహారము ఏమైనా ఉన్నదని నీవు మాకు తెలుప గలవా?
عربي ఇంగ్లీషు ఉర్దూ
అతని వద్దకు వెళ్ళు, వెళ్ళి ‘నీవు నరకవాసులలోని వాడవు కావు, నీవు స్వర్గవాసులలోని వాడవు” అని అతనికి చెప్పు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఓ ప్రజలారా! నిశ్చయంగా అల్లాహ్ మీ నుండి జాహిలియహ్ కాలపు (ఇస్లాంకు పూర్వం ఉన్న అఙ్ఞాన కాలపు) అహంకారాన్ని మరియు వారి పూర్వీకుల గురించి వారి ప్రగల్భాలను తొలగించాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
(ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు!)
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నా ఉమ్మత్ యొక్క చివరి కాలములో (ఉమ్మత్’లోని) కొందరు మీరు గానీ, మీ తాతముత్తాతలు గానీ ఎన్నడూ వినని హదీథులను మీకు చెబుతారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, మరియు వారి పట్ల జాగ్రత్త వహించండి
عربي ఇంగ్లీషు ఉర్దూ
రాసిపెట్టుకుంటూ ఉండు (ఓ అబ్దుల్లాహ్)! ఎవరి చేతిలోనైతే నా ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా దీని నుండి (ఈ నోటినుండి) సత్యము తప్ప మరేమీ బయటకు రాదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రతి సలాహ్’ కొరకు (నమాజు కొరకు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేసేవారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు శరీరభాగాలను ఒక్కొక్కసారే కడిగినారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు తన శరీరభాగాలను రెండు-రెండు సార్లు కడిగినారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరైనా కడుపులో అసౌకర్యంగా ఉన్న కారణంగా వాయువు విడుదల అయ్యిందేమోననే సందేహానికి గురైతే, అతడు మస్జిదును వదిలి వెళ్ళరాదు – (గాలి విడుదలైన) శబ్దం వింటే లేదా ఆ దుర్వాసన గమనిస్తే తప్ప.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రతి ఏడు దినములలో (కనీసం) ఒక దినమున (వారానికొకసారి) తల మరియు శరీరమును (శుభ్రముగా) కడుగుతూ (తల) స్నానము చేయుట ప్రతి ముస్లిము పై విధి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నేను ఇస్లాం స్వీకరించే సంకల్పముతో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చాను. అపుడు వారు “రేగు ఆకులు వేసిన నీటితో స్నానం చేసి రమ్మని” నన్ను ఆదేశించినారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ముఅజ్జిన్ అజాన్ పలుకుతున్నపుడు మీరు విన్నట్లయితే, అతను పలుకునట్లుగానే మీరూ పలకండి, తరువాత నాపై శాంతి మరియు శుభాలకొరకు ప్రార్థించండి (దరూద్ పఠించండి)
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎవరైతే అల్లాహ్ కొరకు ఒక మస్జిదును నిర్మిస్తాడో, అల్లాహ్ అతని కొరకు స్వర్గములో దానిని పోలిన ఒక గృహాన్ని నిర్మిస్తాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నా ఈ మస్జిదులో ఆచరించే ఒక నమాజు, (మక్కాలోని) ఒక్క మస్జిదె హరం లో తప్ప, మరెక్కడైనా ఆచరించే నమాజు కంటే పుణ్యఫలం (అజ్ర్) లో వేయి రెట్లు ఉత్తమమైనది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే, అతడు కూర్చునే ముందు రెండు రకాతుల నమాజు (తహియ్యతుల్ మస్జిద్ నమాజు) ఆచరించాలి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము); అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మ! ఇన్నీ అస్అలుక మిన్ ఫద్’లిక” (ఓ అల్లాహ్! నేను నీ శుభాలలో నుండి నా కొరకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను).”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఓ బిలాల్! ‘అఖామత్’ పలుకు (నమాజు ప్రారంభించుటకు ముందు ‘నమాజు ప్రారంభమవుతున్నది’ అని తెలియజేస్తూ పలుకబడే పదాలు), తద్వారా మా అందరికీ సాంత్వన కలుగజేయి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఓ ప్రజలారా! కేవలం నేను నమాజును ఏ విధంగా ఆచరినానో మీరు చూడాలని, ఆ విధంగా మీరు అనుసరించాలని, నమాజును ఏ విధంగా ఆచరించాలో మీరు నేర్చుకోవాలని మాత్రమే ఇలా చేసినాను” అన్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీరు నమాజు ఆచరించునపుడు మీ వరుసలను సవ్యంగా ఉండేలా చూసుకోవాలి. మీలో ఒకరు నాయకత్వం వహించి (ఇమామత్ వహించి) మిగతా వారికి నమాజు చదివించాలి. అతడు “అల్లాహు అక్బర్” అని తక్బీర్ పలికితేనే మీరు కూడా ‘తక్బీర్’ పలుకండి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరి చేతిలోనైతే నా ప్రాణమున్నదో ఆయన సాక్షిగా – రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజుకు మీ అందరిలో నిశ్చయంగా నేను అత్యంత దగ్గరిగా ఉన్నాను. ఈ ప్రపంచం నుండి వెడలిపోయేటంత వరకు ఆయన నమాజు ఈ విధంగానే ఉండినది”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రజలలో అతి చెడ్డగా దొంగతనం చేసేవాడు ఎవరంటే, ఎవరైతే తన సలాహ్ ను దొంగిలిస్తాడో. అక్కడున్న వారు ప్రశ్నించారు “సలాహ్ ను ఎలా దొంగిలిస్తాడు?” దానికి ఆయన ఇలా అన్నారు “అతడు తన రుకూను సంపూర్ణంగా ఆచరించడు, మరియు తన సజ్దాహ్’లను ను సంపూర్ణంగా ఆచరించడు (త్వరత్వరగా చేస్తాడు)”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం రుకూ నుండి తన నడుమును పైకి లేపునపుడు ఇలా పలికినారు “సమి’అల్లాహు లిమన్ హమిదహ్
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ముగీరహ్ ఇబ్న్ షు’బహ్ రజియల్లాహు అన్హు ఇలా నాకు చెబుతూ నా చేత ము’ఆవియహ్ రజియల్లాహు అన్హు కు ఇలా ఒక లేఖ వ్రాయించినారు “
عربي ఇంగ్లీషు ఉర్దూ
“(నమాజులో) రెండు సజ్దాల నడుమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు “రబ్బిగ్'ఫిర్లీ, రబ్బిగ్’ఫిర్లీ” (ఓ నా ప్రభూ! నన్ను మన్నించు, ఓ నా ప్రభూ! నన్ను క్షమించు)
عربي ఇంగ్లీషు ఉర్దూ
వాడి ‘ఖింజబ్’ అని పిలువబడే షైతాను. నీవు వాడి ప్రభావాన్ని గ్రహించినట్లయితే, వెంటనే (అ’ఊజు బిల్లాహ్ అని) అల్లాహ్ యొక్క శరణు కోరుకో, మరియు నీ ఎడమ వైపునకు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్లాహ్ కేవలం తనకొరకు, చిత్తశుద్ధితో చేసే పనిని తప్ప మరే పనిని అంగీకరించడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్లాహ్’ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను తన సందేశహరునిగా సంతృప్తి చెందిన వ్యక్తి, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని చవిచూసినాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నాలుగు లక్షణాలు ఉన్నాయి, వాటిని కలిగి ఉన్నవాడు స్వచ్ఛమైన కపటుడు, మరియు వాటిలో ఒకటి ఉన్నవాడు దానిని వదులుకునే వరకు కపటత్వం యొక్క ఒక లక్షణం కలిగి ఉంటాడు: అతను మాట్లాడినప్పుడు, అతను అబద్ధం చెబుతాడు; అతను ఒడంబడిక చేసినప్పుడు, అతను దానిని విచ్ఛిన్నం చేస్తాడు; అతను వాగ్దానం చేసినప్పుడు, అతను దానిని ఉల్లంఘిస్తాడు; మరియు అతను ఎవరితోనైనా వివాదం లోనికి దిగితే, అతను అనైతికంగా ప్రవర్తిస్తాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మనిషి చనిపోయినపుడు అతని ఆచరణలు ముగిసిపోతాయి; మూడు (ఆచరణలు) తప్ప: కొనసాగుతూ ఉండే దానము; ప్రయోజనకరమైన ఙ్ఞానము; అతని కొరకు దుఆ చేసే ధార్మికుడైన కుమారుడు.”
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
“ఓ రసులుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఉమ్మె సాద్ (నా తల్లి) చనిపోయింది. (ఆమె కొరకు) ఏ దానము ఉత్తమమైనది?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “త్రాగునీరు”. ఆయన ఒక బావిని త్రవ్వించి “ఇది ఉమ్మె సాద్ కొరకు” అన్నారు
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
“ఒక విశ్వాసి అపవాది కాజాలడు (ఇతరులపై అపవాదులు మోపు వాడు), ఇతరులను శపించడు మరియు అనైతిక చర్యలకు పాల్బడడు లేదా సిగ్గుమాలిన పనులు చేయడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా మీ పేర్లలో అల్లాహ్ వద్ద అత్యంత ఇష్టమైన, ప్రియమైన పేర్లు ‘అబ్దుల్లాహ్’ మరియు ‘అబ్దుర్రహ్మాన్’
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
“ఏ పదార్థమైనా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మత్తు కలిగించేట్లైతే, దానిని కొద్ది మొత్తంలో తీసుకోవడం కూడా నిషిద్ధం.”
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
“మీసాలను కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం, చంకలలోని వెంట్రుకలు తీయడం మరియు నాభి క్రింది భాగములోని వెంట్రుకలు (జఘన వెంట్రుకలు) గీసుకోవడం గురించి మాకు ఒక సమయ పరిమితి విధించబడింది - మేము వాటిని నలభై రాత్రులకు మించి వదిలివేయరాదు.”
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
“నేను మహిళలతో కరచాలనం చేయను. వంద మంది మహిళలకు చెప్పిన నా మాటలు ఒక మహిళకు చెప్పిన నా మాటలకు సమానం, లేదా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
“నిశ్చయంగా (నా తరువాత) పాలకులు వస్తారు. వారు అసత్యాలు పలుకుతారు మరియు దౌర్జన్యానికి పాల్బడతారు. ఎవరైతే వారి అసత్యాలను విశ్వసిస్తాడో, వారి దౌర్జన్యాలకు సహాయపడతాడో, అతడు నావాడు కాడు; నేను అతని వాడను కాను
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
“ఒక వృద్ధుని హృదయం రెండు విషయాలలో యవ్వనంగా ఉంటుంది, ప్రపంచం పట్ల అతని ప్రేమ (అంటే దాని సంపద, వినోదం మరియు విలాసాలు) మరియు అతని నిరంతర ఆశ
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
“సుఖాలను, భోగాలను నాశనం చేసే దానిని తరుచూ గుర్తు చేసుకుంటూ ఉండండి” అంటే మృత్యువును
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
“ఎవరైతే స్వయంగా తమకు తామే అన్యాయం చేసుకున్నారో వారి ఇళ్లలోనికి (ప్రాంతము లోనికి) ప్రవేశించకండి, మీరు ఏడుస్తూ ఉన్న స్థితిలో ఉంటే తప్ప
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
“రెల్లు చాపను రెల్లు పుల్లలతో ఒకదాని తరువాత ఒకటి కలిపి నేసినట్లుగా, “అల్-ఫితన్” (ఆకర్షణలు, ప్రలోభాలు, వాంఛలు, కోరికలు, సంకటములు, పరీక్షలు మొ.) మనుషుల హృదయాలకు ప్రస్తుతపరచబడతాయి
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
“రమజాన్ మాసం వచ్చినపుడు ఉమ్రా చేయి. ఎందుకంటే ఆ మాసములో చేయు ఉమ్రా (పుణ్యఫలములో) హజ్జ్ తో సమానము” అన్నారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మేము జిహాద్ ను అత్యుత్తమ ఆచరణగా భావిస్తాము. మరి మేము జిహాద్ చేయవద్దా (జిహాద్ లో పాల్గొనవద్దా?), దానికి ఆయన ఇలా అన్నారు “లేదు, మీ కొరకు (స్త్రీల కొరకు) అత్యుత్తమమైన జిహాద్ ఏమిటంటే (అల్లాహ్ చే) స్వీకరించబడిన హజ్జ్”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“తీర్పు దినమున అల్లాహ్ మొదటి వారినుండి చివరి వారి వరకు (అందరినీ) సమీకరించినపుడు, ప్రతి ద్రోహికి ఒక జెండా ఎత్తబడుతుంది మరియు ఇలా చెప్పబడుతుంది: ఇది ఫలానా వ్యక్తి కుమారుడైన ఫలానా వాడు చేసిన ద్రోహం.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు ఏడు పనులు చేయమని ఆదేశించినారు, అలాగే ఏడు పనులు చేయవద్దని నిషేధించినారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
అతని ధనము నుండి నీకు సరిపోయే మరియు మీ పిల్లలకు సముచితమైన రీతిలో సరిపోయేటంత తీసుకో
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్లాహ్ మార్గంలో ఒక రోజు “రిబాత్” పాటించడం (అంటే, ముస్లింల సరిహద్దులను కాపాడటం) ఈ ప్రపంచం మరియు దానిలో ఉన్న ప్రతిదానికంటే శుభప్రదమైనది
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం రెండు నలుపు మరియు తెలుపు కొమ్ములతో కూడిన, గొర్రెలను బలిగా అర్పించారు, వీటిని ఆయన తన స్వంత చేతులతో ఖుర్బానీ చేసినారు. అపుడు, ఆయన ఇలా అన్నారు: "బిస్మిల్లాహ్, అల్లాహ్ అక్బర్!” మరియు వాటి మెడ మీద తన పాదాన్ని ఉంచినారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైనా ఒక ముస్లిం యొక్క సంపదను లేదా ఆస్తిని మోసపూరితంగా ఆక్రమించుకునే ఉద్దేశ్యముతో (అబద్ధపు) ప్రమాణం చేస్తాడో, (తీర్పు దినమున) అతనిపై అల్లాహ్ ఆగ్రహంతో ఉన్న స్థితిలో అతడు అల్లాహ్’ను కలుస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“(ఒకసారి) నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉన్నాను. (దారిలో) ఆయన ఒక తెగవారు తమ చెత్తాచెదారం వేసే స్థలం వద్దకు వచ్చారు. అక్కడ ఆయన నిలబడి మూత్ర విసర్జన చేసారు,
عربي ఇంగ్లీషు ఉర్దూ
నిశ్చయంగా నా ఉమ్మత్ లోని మగవారి కొరకు ఈ రెండూ హరాం (నిషేధము), వారి ఆడవారి కొరకు అనుమతించబడినవి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు – సారాయి, చనిపోయిన జంతువులు, పందులు మరియు విగ్రహాలను అమ్మడాన్ని నిషేధించినారు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నేను రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను (పరస్త్రీపై) అనుకోకుండా, ఆకస్మికంగా పడిన చూపును గురించి ప్రశ్నించాను. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించినారు “నీ చూపును మరల్చుకో”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గోప్యస్థలము (బహిర్భూమి, మరుగుదొడ్డి) నుండి బయటకు వచ్చినపుడు ఇలా అనేవారు “గుఫ్రానక” (ఓ అల్లాహ్! నాకు నీ క్షమాపణ ప్రసాదించు).”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోరలు ఉన్న అన్ని మాంసాహార జంతువులను మరియు పంజాలు, గోళ్ళు కలిగిన అన్ని పక్షులను తినడాన్ని నిషేధించారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నమాజు కొరకు ఇవ్వబడే రెండు పిలుపులకు మధ్య (అదాన్ మరియు ఇఖామత్ ల మధ్య) నమాజు ఉన్నది; నమాజు కొరకు ఇవ్వబడే రెండు పిలుపులకు మధ్య నమాజు ఉన్నది” తరువాత మూడవసారి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “ఎవరైతే చదవాలనుకుంటున్నారో వారి కొరకు” అన్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే మనకు (విశ్వాసులకు) వ్యతిరేకంగా ఆయుధాలు ఎత్తుతాడో, వాడు మనలోని వాడు కాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
దీనార్ లో కనీసం నాలుగవ వంతు లేదా అంతకంటే ఎక్కువ విలువైనదాన్ని దొంగతనం చేసిన వారి చేయి నరకాలి
عربي ఇంగ్లీషు ఉర్దూ
మీకు పూర్వం జీవించినవారిలో ఒక వ్యక్తి గాయపడినాడు. అతడు సహనం కోల్పోయి, కత్తితో తన చేతిని కోసుకొనగా, ఆ రక్తస్రావంతో మరణించాడు. దానికి మహోన్నతుడైన అల్లాహ్ ఇలా ప్రకటించినాడు: "నా దాసుడు తన మరణం విషయంలో త్వరపడినాడు; అందువలన నేను అతని కొరకు స్వర్గాన్ని నిషేధించాను
عربي ఇంగ్లీషు ఉర్దూ
అల్లాహ్ నిర్దేశించిన హుదూద్ మహాశిక్షలను మినహాయించి, ఎవరికీ పది కొరడా దెబ్బల కంటే ఎక్కువ కొరడా దెబ్బల శిక్ష విధించకూడదు
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎవరైనా వేట కోసం లేదా పశువుల కాపలా కోసం కాకుండా కుక్కను పెంచుకుంటే, అతని సత్కార్యాలు ప్రతి రోజు రెండు ఖీరాతుల వరకు తగ్గిపోతాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
నిజంగా, నువ్వు ఎలాంటి హాని చేయలేని, ఎలాంటి లాభం కలిగించలేని ఒక రాయివి మాత్రమే అనే విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను ముద్దు పెట్టుకోవడం నేను చూడకపోయి ఉంటే, నేనూ నిన్ను ముద్దాడే వాడిని కాను
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఓ అల్లాహ్! నేను నీకు మాత్రమే సమర్పించుకుంటున్నాను, నిన్ను మాత్రమే విశ్వసిస్తున్నాను, నీపైనే ఆధారపడుతున్నాను, నీ వైపే పశ్చాత్తాపంతో మరలుతున్నాను, నీ సహాయంతోనే వాదిస్తున్నాను. నీ మహిమలోనే నేను ఆశ్రయాన్ని కోరుతున్నాను. నీవు తప్ప మరే ఆరాధ్యడూ లేడు. నీవు నన్ను తప్పుదారి పట్టించకు. నీవు ఎప్పటికీ జీవించే నిత్యుడివి, నీకు మరణం లేదు. కానీ జిన్నులు మరియు మనుషులు మాత్రం మరణిస్తారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
నీవు తిరిగి వెళ్లి నమాజ్ చేయి, ఎందుకంటే నువ్వు నమాజ్ ను సరిగ్గా చేయలేదు
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఒక ముస్లిం - లేదా విశ్వాసి - వుదూ చేసినప్పుడు — అతడు తన ముఖాన్ని కడిగినప్పుడు, అతడు తన కళ్లతో చూసిన ప్రతి పాపం, ఆ నీటితో లేదా చివరి నీటి బొట్టుతో ముఖం నుండి బయటకు వచ్చేస్తుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు అన్ని సందర్భాలలో ఇస్తిఖారా నమాజ్‌ చేయుటను ఖుర్ఆన్‌లోని సూరాలు నేర్పినట్టుగా నేర్పించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పేవారు: "మీలో ఎవరికైనా ఏదైనా పని చేయాలనే ఉద్దేశం ఉంటే, తప్పనిసరి ఫర్ద్ నమాజ్ కాకుండా రెండు రకాతుల (ఇస్తిఖారహ్) నమాజ్ చేయాలి. తర్వాత ఇలా దువా చేయాలి: اللَّهُمَّ إِنِّي أَسْتَخِيرُكَ بِعِلْمِكَ وَأَسْتَقْدِرُكَ بِقُدْرَتِكَ، وَأَسْأَلُكَ مِنْ فَضْلِكَ الْعَظِيمِ، فَإِنَّكَ تَقْدِرُ وَلَا أَقْدِرُ، وَتَعْلَمُ وَلَا أَعْلَمُ، وَأَنْتَ عَلَّامُ الْغُيُوبِ، اللَّهُمَّ إِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ خَيْرٌ لِي فِي دِينِي، وَمَعَاشِي، وَعَاقِبَةِ أَمْرِي» أَوْ قَالَ: «عَاجِلِ أَمْرِي وَآجِلِهِ، فَاقْدُرْهُ لِي وَيَسِّرْهُ لِي ثُمَّ بَارِكْ لِي فِيهِ، وَإِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ شَرٌّ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي» أَوْ قَالَ: «فِي عَاجِلِ أَمْرِي وَآجِلِهِ، فَاصْرِفْهُ عَنِّي وَاصْرِفْنِي عَنْهُ، وَاقْدُرْ لِي الْخَيْرَ حَيْثُ كَانَ، ثُمَّ أَرْضِنِي» قَالَ: «وَيُسَمِّي حَاجَتَه». ("అల్లాహుమ్మ ఇన్నీ అస్'తఖీరుక బి ఇల్మిక, వ అస్తఖ్'దిరుక బి ఖుద్'రతిక, వ అస్అలుక మిల్ ఫద్'లికల్ అజీమ్, ఫఇన్నక తఖ్'దిరు వలా అఖ్'దిరు, వ తఅ్'లము వలా అఅ్'లము, వ అంత అల్లాముల్ గుయూబ్, అల్లాహుమ్మ ఇన్ కుంత తఅ్'లము అన్న హాదాల్ అమ్'ర - (ఇక్కడ మీ విషయం ప్రస్తావించాలి) - ఖైరున్ లి ఫిద్దునియా వమఆషీ వ ఆఖిబతి అమ్'రి - లేదా ఇలా అన్నారు - ఆజిలిహి వ ఆజిలిహి - ఫఖ్'దుర్'హు లీ వ యస్సిర్'హు లీ థుమ్మ బారిక్ లీ ఫీహి, వ ఇన్ కుంత తఅ్'లము అన్న హాదల్ అమ్'ర షర్రు లీ ఫిద్దునియా వ మఆ్'షీ వ ఆ్'ఖిబతి అమ్'రి - లేదా ఇలా అన్నారు ఆజిలిహి వ ఆజిలిహి - ఫస్'రిఫ్'హు అ'న్నీ వస్'రిఫ్'నీ అ'న్'హు వఖ్'దుర్ లిల్ ఖైర హంథు కాన థుమ్మ అర్'దినీ బిహి) అర్థం: "అల్లాహ్, నేను నీ జ్ఞానంతో నీ సలహా అడుగుతున్నాను. నీ శక్తితో నేను నీ వద్ద బలాన్ని కోరుతున్నాను. నీ గొప్ప దయను నేను అడుగుతున్నాను. ఏదైనా నువ్వే చేయగలవు, నేనేమీ చేయలేను. నీకే సర్వం తెలుసు, నాకేమీ తెలియదు. నువ్వే గోచర, అగోచరాలన్నింటి జ్ఞానం గలవాడివి. ఓ అల్లాహ్! ఈ విషయం (తన అవసరాన్ని ఇక్కడ చెప్పాలి) నా ధర్మం, నా జీవితం, నా పనుల ఫలితానికి (లేదా నా తక్షణ, భవిష్యత్ విషయాలకు) మంచిదని నీ జ్ఞానంలో ఉంటే, అది నా కొరకు నిర్ణయించు, సులభతరం చేయు, దానిలో నాకు శుభాలు ప్రసాదించు. ఇది నా ధర్మం, నా జీవితం, నా పనుల ఫలితానికి (లేదా నా తక్షణ, భవిష్యత్ విషయాలకు) చెడుగా ఉంటే, దానిని నన్ను దూరం చేయు, నన్ను దాని నుండి దూరం చేయు, అది ఎక్కడ ఉన్నా నా కొరకు మంచి దానినే నిర్ణయించు, నన్ను దానితో సంతృప్తిగా ఉంచు
عربي ఇంగ్లీషు ఉర్దూ
అంత్యక్రియలు (గుసుల్) నిర్వహించి, మనుషులు జనాజాను భుజాలపై మోసినప్పుడు, అది ధర్మబద్ధంగా ఉంటే, ఇలా అంటుంది: "నన్ను ముందుకు తీసుకెళ్లండి
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి: "అస్సలాము అలైకుం" అని అభివాదం చేసినాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చినారు, ఆ తరువాత ఆ వ్యక్తి కూర్చున్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "పది
عربي ఇంగ్లీషు ఉర్దూ
అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ హుదా వత్తుఖా వల్అఫాఫ వల్ గినా" ("ఓ అల్లాహ్! నేను నిన్ను మార్గదర్శకం (హిదాయత్), భయభక్తి (తఖ్వా), పవిత్రత (శుద్ధత), మరియు సంతృప్తి/సంపద (స్వయం సమృద్ధి) కోసం అడుగుతున్నాను
عربي ఇంగ్లీషు ఉర్దూ
దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "నీవు చెప్పిన ఆ మాట, ఒకవేళ సముద్రపు నీటిలో కలిపితే, అది నీటినంతా కలుషితం చేసి వేసేది
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఓ అబా సయీద్! ఎవరైతే అల్లాహ్‌ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా మరియు ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంను తన ప్రవక్తగా సంతృప్తి చెందుతారో, వారికి స్వర్గం హామీ ఇవ్వబడుతుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎవరు ‘సుబహానల్లాహిల్-అజీమ్ వ బిహమ్'దిహి’ పరమ పవిత్రుడైన అల్లాహ్‌కు మహోన్నత మహిమ గలవాడు మరియు సకలస్తోత్రాలు, కృతజ్ఞతలు ఆయనకే శోభిస్తాయి) అని పలుకుతారో, అతడి కోసం స్వర్గంలో ఒక ఖర్జూర చెట్టు నాటబడుతుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
ప్రళయ దినాన, సూర్యుడు ప్రజలకు చాలా దగ్గరగా తీసుకురాబడతాడు — కేవలం ఒక "మీల్" అంత దూరంలో మాత్రమే ఉంటాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే ‘అల్లాహ్ మార్గములో’ ఒక దినము ఉపవాసం ఉంటాడో, అల్లాహ్ అతడి ముఖాన్ని నరకాగ్ని నుండి డెబ్బై సంవత్సరాల (దూరం) వరకు దూరం చేస్తాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఉపవాస విరమణలో త్వరపడినంత కాలం ప్రజలు శుభాన్ని కలిగి ఉంటారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మా మధ్య ఉన్నప్పుడు, మేము మాలోని ప్రతి చిన్నవారి తరఫున, ప్రతి పెద్దవారి తరఫున, యువకుల తరఫున, వృద్ధుల తరఫున, స్వేచ్ఛా బానిసల తరఫున, ఒక సా' ఆహారం, లేదా ఒక సా' వెన్న, లేదా ఒక సా' బార్లీ, లేదా ఒక సా' ఖర్జూరం, లేదా ఒక సా' ఎండుద్రాక్ష, జకాతుల్ ఫితర్’గా ఇచ్చేవాళ్ళం
عربي ఇంగ్లీషు ఉర్దూ
మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి సహరీ (ఉపవాసం ప్రారంభించే ముందు చేసే) భోజనం చేసినాము. తర్వాత ఆయన నమాజ్‌ కొరకు లేచినారు. అపుడు నేను ఇలా అడిగాను: అదాన్ (నమాజు కొరకు పిలిచే పిలుపు) మరియు సహరీ మధ్య ఎంత సమయం ఉండింది? దానికి ఆయన ఇలా అన్నారు: సుమారు 50 ఆయతుల అంత (అంటే 50 ఖుర్‌ఆన్ వచనాలు పఠించే సమయమంత అని అర్థము)
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎల్లప్పుడూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్ నెలలో చివరి పది రోజులు ఇతికాఫ్ (మస్జిద్‌లో ఏకాంతంగా గడపడం) చేసేవారు. ఆయన మరణం వరకు ఈ సున్నతును తప్పకుండా పాటించారు. ఆయన మరణం తర్వాత ఆయన భార్యలు కూడా ఇదే విధంగా ఇతికాఫ్ కొనసాగించినారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
సహరీ భోజనం తినండి, ఎందుకంటే సహరీ భుజించటంలో శుభము ఉన్నది
عربي ఇంగ్లీషు ఉర్దూ
రమదాన్ నెలకు ఒక్క రోజు లేదా రెండు రోజుల ముందు ఉపవాసం పాటించవద్దు. అయితే, ఎవరైనా ఒక నియమిత ఉపవాసాన్ని (అలవాటుగా) పాటించుతున్నట్లయితే, అతను దాన్ని కొనసాగించవచ్చు (ఉదా: ప్రతి సోమవారం లేదా ప్రతి గురువారం ఉపవాసం)
عربي ఇంగ్లీషు ఉర్దూ
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలలో బానిసపై మరియు స్వతంత్ర వ్యక్తిపై, పురుషులపై మరియు స్త్రీలపై, చిన్నవారిపై మరియు పెద్దవారిపై మొత్తం అందరిపై ఒక సాఅ ఖర్జూరాలు లేదా ఒక సాఅ బార్లీ జకాతుల్-ఫితర్‌ దానం చెల్లింపును విధిగావించారు. ప్రజలు ఈద్ నమాజుకు వెళ్ళే ముందే దానిని చెల్లించాలని ఆయన ఆదేశించారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఒక ముస్లిం మహిళకు, మహ్రమ్ (భర్త లేదా వివాహం చేయరాని సన్నిహిత బంధువు) అయిన పురుషుడు తోడుగా లేకుండా, ఒక రాత్రి ప్రయాణ దూరం ప్రయాణించడం అనుమతించబడలేదు
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎవరైనా ఉపవాసంలో ఉండగా మర్చిపోయి తిన్నా లేదా తాగినా, అతను తన ఉపవాసాన్ని పూర్తిగా కొనసాగించాలి. ఎందుకంటే అతనికి ఆహారం, పానీయం ఇచ్చింది స్వయంగా అల్లాహ్ యే
عربي ఇంగ్లీషు ఉర్దూ
నేను ఈద్ రోజున ఉమర్ ఇబ్నుల్-ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు)తో ఉన్నాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు: "ఇవి రెండు రోజులు — ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రెండు రోజులలో ఉపవాసం పాటించడం నిషేధించారు: ఒకటి ఉపవాసాన్ని ముగించే రోజు (ఈదుల్-ఫిత్ర్), మరొకటి మీ ఖుర్బానీ నుండి తినే రోజు (ఈదుల్-అద్హా)
عربي ఇంగ్లీషు ఉర్దూ
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తల్బియ ఇలా ఉండేది: "లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక, లబ్బైక లా షరీక లక లబ్బైక, ఇన్నల్ హమ్ద వన్ని'మత లక వల్ ముల్క్, లా షరీక లక్." ("హాజరయ్యాను, ఓ అల్లాహ్! నేను హాజరయ్యాను, నీకు భాగస్వామి లేడు, నేను హాజరయ్యాను. నిశ్చయంగా సకల ప్రశంసలు కృతజ్ఞతలు, అనుగ్రహాలు, సార్వభౌమాధికారం అన్నీ నీకే శోభిస్తాయి; నీకు భాగస్వామి లేడు)
عربي ఇంగ్లీషు ఉర్దూ
రమదాన్ చివరి పది దినాలలోని బేసి రాత్రుల్లో లైలతుల్-ఖదర్ రాత్రిని అన్వేషించండి
عربي ఇంగ్లీషు ఉర్దూ
మీ కలలు చివరి ఏడు రాత్రులపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. కాబట్టి, ఎవరైనా ఖదర్ రాత్రిని అన్వేషిస్తూ ఉంటే, వారు దానిని చివరి ఏడు రాత్రుల్లో అన్వేషించాలి
عربي ఇంగ్లీషు ఉర్దూ
అల్లాహ్ మీకు కూడా అలా దానం చేసే అవకాశం ఇవ్వలేదు అని భావిస్తున్నారా? ప్రతిసారి 'సుబహానల్లాహ్' (అల్లాహ్ పరమ పవిత్రుడు) అని ధ్యానం చేయడమూ దానమే, ప్రతిసారి 'అల్లాహు అక్బర్' (అల్లాహ్ గొప్పవాడు) అని పలకడమూ దానమే, ప్రతిసారి 'అల్‌హమ్దులిల్లాహ్' (అల్లాహ్‌కే సకల స్తుతులు) అని పలకడమూ దానమే, ప్రతిసారి 'లా ఇలాహ ఇల్లల్లాహ్' (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు) అని పలకడమూ దానమే. మంచి పనిని ప్రోత్సహించడమూ దానమే, చెడు పనిని నిషేధించడము కూడా దానమే. ఇంతేకాదు, మీలో ఎవరు తమ శారీరక కోరికను హలాల్ మార్గంలో తీరుస్తారో, వారికి దాని పుణ్యమూ లభిస్తుంది." అప్పుడు సహాబాలు ఆశ్చర్యపడి, "ఓ రసూలుల్లాహ్! మాలో ఎవరు తమ కోరికను తీర్చుకున్నా అతనికి కూడా పుణ్యం లభిస్తుందా?
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఒకరిపై మరొకరు ఈర్ష్య పడకండి, ఒకరి కోసం మరొకరు కావాలని ధరలను కృత్రిమంగా పెంచకండి, ఒకరినొకరు ద్వేషించకండి, ఒకరికొకరు దూరం కాకండి, వ్యాపారంలో ఒకరి లావాదేవీలను మరొకరు భంగపరచకండి. బదులుగా, అల్లాహ్ యొక్క దాసులుగా సోదర భావంతో ఉండండి
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎవరైతే ఒక విశ్వాసిని ఈ ప్రాపంచిక కష్టాలలోని ఒక కష్టం నుండి విముక్తి చేస్తారో, ప్రళయ దినాన అల్లాహ్ అతడిని ఒక కష్టం నుండి విముక్తి చేస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఓ ప్రజలారా! అల్లాహ్ వద్ద పశ్చాత్తాపపడండి, ఎందుకంటే నేను రోజుకు వంద సార్లు ఆయన వద్ద పశ్చాత్తాపపడతాను
عربي ఇంగ్లీషు ఉర్దూ
నిశ్చయంగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, సాలిఖా (జనాజాపై పెద్దగా పెడబొబ్బలు పెడుతూ విలపించే స్త్రీ), హాలిఖా (తలజుట్టు గొరిగించుకునే స్త్రీ) మరియు షక్కా (దుఃఖంలో దుస్తులు చింపుకునే స్త్రీ) లను తిరస్కరించారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఇస్రాయీలు సంతతివారిని ప్రవక్తలు పాలించేవారు. ఒక ప్రవక్త మరణించినప్పుడు, మరొక ప్రవక్త అతని స్థానంలో వచ్చేవారు. నిశ్చయంగా, నా తరువాత ఏ ప్రవక్తా రాడు, కానీ అనేకమంది ఖలీఫాలు (పాలకులు) ఉంటారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
పది (రమదాన్ చివరి పది రాత్రులు) ప్రారంభమైనప్పుడు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిని మేల్కొని గడిపేవారు, తన కుటుంబాన్ని కూడా లేపేవారు, తాను మరింత ఎక్కువగా (ఆరాధనలలో) శ్రమించేవారు, మరియు తన నడుము బిగించేవారు (అర్థం: పూర్తిగా ధ్యానం, ఆరాధనలలో నిమగ్నమయ్యేవారు)
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఒక ముస్లిం యొక్క ఇజార్ (థోబు, లుంగీ లేదా ప్యాంటు అంటే నడుము క్రింది భాగంలో ధరించే వస్త్రం) కనీసం సగం కాలిపిక్క వరకు ఉండాలి. ఒకవేళ అతడి కాలిపిక్కకు మరియు చీలమండలానికి మధ్య భాగంలో ఉంటే అందులో దోషం ఏమీ లేదు. కానీ చీలమండలానికి దిగువన ఉంటే (నేలపై ఈడుస్తూ ఉంటే), అది నరకంలోనికి తీసుకువెళ్తుంది. ఎవరు గర్వంతో తన లుంగీని లేదా ప్యాంటును (గర్వంతో నేలపై) ఈడుస్తారో, అల్లాహ్ అతని వైపు చూడడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
కలహాలు, అశాంతి సమయాలలో ఆరాధన చేయడం అంటే నాకు హిజ్రత్ (ధర్మం కోసం వలస) చేసినట్లుగా ఉంటుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎవరైనా ముస్లిం పాపం లేదా బంధుత్వాన్ని తెంచే వేడుకోలు లేని దుఆ చేస్తే, అల్లాహ్ ఆ దుఆకు బదులుగా అతనికి మూడు విషయాల్లో ఒకదాన్ని ప్రసాదిస్తాడు: అతని దుఆను వెంటనే నెరవేర్చుతాడు, లేదా దుఆకు బదులుగా అతనికి పరలోకంలో పుణ్యాలు ప్రసాదించబడేందుకు ఆపుతాడు, లేదా ఆ దుఆ స్థాయిలో అతనిపై వచ్చే కష్టాన్ని తొలగిస్తాడు." అప్పుడు సహాబాలు అడిగారు: "అయితే మేము ఎక్కువగా దుఆ చేస్తాం!" దానికి ప్రవక్త ﷺ అన్నారు: "అల్లాహ్ మరింత ఎక్కువగా (ఇస్తాడు)
عربي ఇంగ్లీషు ఉర్దూ
అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కష్టకాలంలో ఇలా పలికేవారు: "లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్ అజీముల్ హలీమ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ రబ్బుల్ అర్షిల్ అజీమ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ రబ్బుస్సమావాతి వ రబ్బుల్ అర్ది, వ రబ్బుల్ అర్షిల్ కరీమ్ (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన మహాన్నతుడు, మహాసహనశీలుడు. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన మహా సింహాసనానికి అధిపతి. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన ఆకాశాలకు ప్రభువు మరియు భూమికి ప్రభువు మరియు ఘనమైన సింహాసనం యొక్క అధిపతి)
عربي ఇంగ్లీషు ఉర్దూ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై {إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ} (అన్నస్ర్ సూరహ్ 1) అవతరించిన తర్వాత, ఆయన ప్రతి నమాజ్‌లో ఇలా పలకకుండా ఉండలేదు (నమాజు కొనసాగించలేదు): "సుబహానక రబ్బనా వ బిహమ్దిక, అల్లాహుమ్మఘ్ఫిర్లీ (మా ప్రభువా! నీవు పరమ పవిత్రుడవు, స్తుతులన్నీ నీకే శోభిస్తాయి, ఓ అల్లాహ్! నన్ను క్షమించు)
عربي ఇంగ్లీషు ఉర్దూ
మీలో ఎవరైనా ఆవులింత వస్తే, (వెంటనే) తన నోటి మీద చెయ్యి పెట్టుకోవాలి, ఎందుకంటే నిశ్చయంగా షైతాన్ లోపలికి ప్రవేశిస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ