హదీసుల జాబితా

మీ కంటే క్రింద ఉన్నవారిని చూడండి; మీ కంటే పైన ఉన్నవారిని చూడకండి. అలా చేయడం వల్ల అల్లాహ్ మీకు ప్రసాదించి అనుగ్రహాలను తక్కువగా భావించకుండా ఉంటారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
‘ఒక ముస్లింకి మరొక ముస్లిం పై ఆరు హక్కులు ఉన్నాయి. ‘ఒకటి అతన్ని కలిసినప్పుడు సలాం చేయాలి, రెండు : అతను నిన్ను ఆహ్వానించినప్పుడు దాన్ని స్వీకరించాలి. మూడు : అతను నిన్ను సలహా కోరితే అతనికి మేలైన సలహా ఇవ్వాలి. నాలుగు : తుమ్మినప్పుడు అల్హందులిల్లాహ్ పలికితే దానికి యర్హముకల్లాహ్ అని జవాబు చెప్పాలి. ఐదు : అతను జబ్బు పడినప్పుడు అనారోగ్యానికి గురైనప్పుడు వెళ్ళి పరామర్శించాలి. ఆరు : చనిపోయినప్పుడు అతని జనాజా వెంట వెళ్ళాలి
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎవరైతే గర్వంతో (అహంకారంతో) తన వస్త్రాన్ని నేలపై ఈడుస్తూ నడుస్తాడో, పరలోకంలో అల్లాహ్ అలాంటి వారి వైపు చూడడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
యూదులను మరియు క్రైస్తవులను అల్లాహ్ శపించు గాక! ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎవరైనా తప్పుడు ప్రమాణం చేసి (అల్లాహ్ పేరుతో అసత్య ప్రమాణం చేసి) ఒక ముస్లింకు చెందిన హక్కును (ఆస్తిని, వస్తువును, హక్కును) కాజేస్తే, అల్లాహ్ అతడి కొరకు స్వర్గాన్ని నిషేధిస్తాడు, నరకాన్ని తప్పనిసరి చేస్తాడు." అప్పుడు ఒక వ్యక్తి ఇలా అడిగారు: "ఓ రసూలుల్లాహ్! అది చిన్నది అయినాా (తక్కువ విలువది అయినా)?" ప్రవక్త ﷺ ఇలా జవాబు ఇచ్చారు: "అది ఒక చిన్న మిస్వాక్ పంటి పుల్ల అయినా సరే
عربي ఇంగ్లీషు ఉర్దూ
రెండు గొప్ప అనుగ్రహాలు ఉన్నాయి, వీటి విషయంలో చాలా మంది మనుషులు (నిర్లక్ష్యం వలన) నష్టపోతారు: ఇవి ఆరోగ్యం మరియు తీరిక సమయం
عربي ఇంగ్లీషు ఉర్దూ
ప్రవక్త ముహమ్మద్ ﷺ తన సజ్దాలో ఇలా ప్రార్థించేవారు: "అల్లాహ్‌మ్మగ్ఫిర్లీ దంబీ కుల్లహు;దిఖ్ఖహు వజిల్లహు; వ అవ్వలుహు, వ ఆఖిరహు; వ అలానియ్యతహు, వ సిర్రహు. (ఓ అల్లాహ్! నా మొత్తం పాపాలను క్షమించు — అవి చిన్నవైనా, పెద్దవైనా, మొదటివైనా, చివరివైనా, ప్రత్యక్షంగా చేసినవైనా, రహస్యంగా చేసినవైనా
عربي ఇంగ్లీషు ఉర్దూ
నిశ్చయంగా, శాపాలు పెట్టేవారు ప్రళయదినాన సాక్షులుగా గానీ, మధ్యవర్తులుగా గానీ ఉండరు
عربي ఇంగ్లీషు ఉర్దూ
నిశ్చయంగా మీ ప్రభువు బిడియపరుడు, ఉదారుడు. తన దాసుడు తన వైపు చేతులెత్తి అర్థించినప్పుడు, ఆయన వాటిని ఖాళీగా వాపసు చేయడానికి బిడియ పడతాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
నేను నిన్ను వదిలి వెళ్లిన తర్వాత నేను నాలుగు పదాలను మూడుసార్లు స్మరించినాను. నువ్వు ఈ రోజు చేసిన దిక్ర్‌తో పోలిస్తే, అవి తూకంలో బరువుగా ఉంటాయి: అవి
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎవరైనా ఒక సభలో కూర్చుని, ఆ సభలో అల్లాహ్‌ను స్మరించకపోతే మరియు తమ ప్రవక్తపై దురూద్ పంపకపోతే, అది వారి మీద బాధగా (పాపంగా, నష్టంగా) అవుతుంది. అల్లాహ్‌ తన ఇష్ట ప్రకారం వారిని శిక్షించవచ్చు లేదా క్షమించవచ్చు
عربي ఇంగ్లీషు ఉర్దూ
అద్-హిబిల్-బాస, రబ్బన్నాస్, వష్ఫి, అంత అష్షాఫీ, లా షిఫాఅ’ ఇల్లా షిఫాఉక, షిఫా’అన్ లా యుగాదిరు సఖమా." (ప్రజల ప్రభువా! బాధను తొలగించు. నీవే ఆరోగ్యదాతవు. నీ ఆరోగ్యమే నిజమైన ఆరోగ్యం. నీ ఆరోగ్యం తప్ప మరొకటి లేదు. అలాంటి ఆరోగ్యాన్ని ప్రసాదించు — అది ఎలాంటి వ్యాధినీ మిగల్చకుండా పూర్తిగా నయం చేసే ఆరోగ్యాన్ని ప్రసాదించు
عربي ఇంగ్లీషు ఉర్దూ
నిశ్చయంగా మీలో నాకు ప్రియమైన వారు,ప్రళయ దినాన నాకు దగ్గరగా కూర్చుంటారు,వారుఎవరంటే ‘ప్రవర్తన రీత్యా
عربي ఇంగ్లీషు ఉర్దూ
నువ్వు ఒక దీనార్ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేశావు మరొకటి బానిస విముక్తి కోసం ఇంకొకటి బీధవాడికి దానం చేశావు మరో దీనార్ నీ కుటుంబీకులపై ఖర్చు చేశావు అందులో పుణ్యప్రధంగా విలువైనది ‘నీ కుటుంబీకుల పై ఖర్చు చేసినదే’
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎవరు ఇస్లాం‌ను అంగీకరించారో, తగినంత జీవనాధారం పొందారో, మరియు అల్లాహ్ తనకు ఇచ్చిన దానితో సంతృప్తి చెందారో, నిశ్చయంగా అతను విజయవంతుడయ్యాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
మీలో ఎవరైతే ఉదయం లేచినప్పుడు ఆరోగ్యంగా, తన ఇంట్లో సురక్షితంగా, ఆ రోజుకి సరిపడా ఆహారం కలిగి ఉంటారో, అతనికి ఈ ప్రపంచమంతా ప్రసాదించబడినట్లే
عربي ఇంగ్లీషు ఉర్దూ
రసూలుల్లాహ్ ﷺ సంక్షిప్తంగాను, విస్తృత అర్థంతోనూ ఉండే దుఆలు (ప్రార్థనలు) చేయడం ఇష్టపడేవారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఒక వస్తువును అమ్మేందుకు అల్లాహ్ పై ప్రమాణం చేయడం అనేది తాత్కాలిక ఫలితాన్ని ఇస్తుంది, కానీ అది అసలు లాభాన్ని నాశనం చేస్తుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
గాలిని దూషించకండి (తిట్టకండి). మీకు ఇష్టము లేని గాలి (ఉదాహరణకు — బలమైన తుఫాను, గాలి దుమారము వంటిది) చూస్తే, ఇలా వేడుకోండి: ‘ఓ అల్లాహ్! ఈ గాలిలో ఉన్న మంచి కోసం, అది తీసుకొచ్చే మంచి కోసం, మరియు ఈ గాలి ద్వారా ఆజ్ఞాపించబడిన మంచి కోసం మేము నిన్ను వేడు కుంటున్నాము. ఈ గాలిలో ఉన్న దుష్టత (చెడుల) నుండి, అది తీసుకొచ్చే చెడు నుండి, మరియు ఈ గాలి ద్వారా ఆజ్ఞాపించబడిన చెడు నుండి మేము నీ శరణు వేడు కుంటున్నాము
عربي ఇంగ్లీషు ఉర్దూ
మీలో ఎవ్వరూ ఇలా పలకవద్దు: ‘ఓ అల్లాహ్! నీ ఇష్టం ఉంటే నన్ను క్షమించు, నీకు ఇష్టం ఉంటే నా మీద కరుణ చూపు, నీకు ఇష్టం ఉంటే నాకు అన్నపానీయాలు (రిజ్క్) ఇవ్వు’ అని. బదులుగా, తన కోరికను కోరడంలో దృఢంగా అడగాలి. నిజంగా, అల్లాహ్ తాను కోరినదాన్ని చేస్తాడు, ఆయనను ఎవరూ బలవంతం చేయలేరు (ఆయన తన పని గురించి ఎవరితోనూ ఇబ్బంది పడడు)
عربي ఇంగ్లీషు ఉర్దూ
నా ప్రస్తావన అతడి ముందుకు వచ్చినప్పుడు, నాపై దరుద్ పంపని వ్యక్తి ముక్కు మట్టి కొట్టుకు పోవుగాక! అతడు రమదాన్ నెలలో ప్రవేశించిన తరువాత, తను క్షమించబడకుండానే అది గడిచి పోయిన వ్యక్తి ముక్కుమీద మట్టి కొట్టుకు పోవుగాక! అతడి తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకున్నా, వారు అతడిని స్వర్గంలో ప్రవేశింపజేయకపోతే (వారికి సేవలు చేయడం ద్వారా పుణ్యాలు సంపాదించి స్వర్గంలో ప్రవేశం పొందలేకపోయిన), ఆ వ్యక్తి ముక్కు మట్టి కొట్టుకు పోవుగాక!
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎవరైతే ఎడతెరపి లేకుండా ఉపవాసం పాటిస్తారో, వారి ఉపవాసం లెక్కించ బడదు. నెలలో మూడు రోజులు ఉపవాసం పాటిస్తే, మొత్తం సంవత్సరమంతా ఉపవాసం పాటించినట్టే అవుతుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
అయితే నన్ను సాక్షిగా చేయవద్దు, ఎందుకంటే నేను అన్యాయానికి సాక్ష్యమివ్వను
عربي ఇంగ్లీషు ఉర్దూ
నేను అలా చేయ్యను, నేను ఇలా చేయ్యను అని చెప్పిన వారి గతి ఏమిగాను? నిజానికి, నేను నమాజు చేస్తాను మరియు నిద్ర పోతాను, నేను ఉపవాసం ఉంటాను మరియు ఉపవాసం విరమిస్తాను మరియు నేను స్త్రీలను వివాహం చేసుకుంటాను. నా సున్నతు నుండి తప్పుకున్నవాడు నాకు చెందినవాడు కాదు
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఇద్దరు ముస్లింలు కలుసుకుని పరస్పరం కరచాలనం చేసిన తరువాత, వారు విడిపోయి (తమ తమ దారిలో) వెళ్ళే లోగా వారి పాపాలు క్షమించబడతాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎవరైతే సూరతుల్ కహఫ్ యొక్క మొదటి పది ఆయతులను (వచనాలను) కంఠస్థం చేస్తారో, వారు దజ్జాల్ ఫిత్నా నుండి రక్షించబడతారు." మరొక రివాయతులో "సూరతుల్ కహఫ్ యొక్క చివరి పది ఆయతులు." అని ఉంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
మరణ సమయం ఇంకా సమీపించని రోగిని సందర్శించి, అతని సమక్షంలో ఎవరైనా ఏడుసార్లు ఇలా అంటే అల్లాహ్ అతనిని ఆ వ్యాధి నుండి నయం చేస్తాడు: 'అస్’అలల్లాహుల్-‘అజీమ్ రబ్బుల్-‘అర్షిల్-‘అజిమ్ అన్ యష్ఫియక్ (నిన్ను నయం చేయమని నేను గొప్ప సింహాసనానికి అధిపతి అయిన అల్లాహ్‌ను అర్థిస్తున్నాను)'
عربي ఇంగ్లీషు ఉర్దూ
నిశ్ఛయంగా ఆదము సంతానం (మానవుల) హృదయాలన్నీ ఆ దయామయుడి (అల్లాహ్) రెండు వేళ్ల మధ్యలో ఒకే ఒక్క హృదయంలా ఉంటాయి. ఆయన తన ఇష్టం ప్రకారం వాటిని తిప్పుతాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎప్పుడైనా రెండు విషయాల మధ్య ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తే, అది పాపం కానంత వరకు, వారు సులభమైన దాన్నే ఎంచుకునే వారు. ఒకవేళ అది పాపమైతే, ఆయన దాని నుండి ఎంతో దూరంగా ఉండేవారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
అల్లాహ్ ఆ వ్యక్తి ముఖాన్ని ప్రకాశవంతం చేయుగాక, ఎవరైతే మా నుండి ఏదైనా విని, అది అలాగే (ఏ మార్పు లేకుండా) ఇతరులకు చేరవేస్తాడో! ఎందుకంటే బహుశా అది ఎవరికి తెలియజేయబడిందో అతను వినిపించినవారి కంటే ఎక్కువ బుద్ధిమంతుడు కావచ్చు
عربي ఇంగ్లీషు ఉర్దూ
మీరు నన్ను నమ్మడం లేదా? నేను ఆకాశాల్లో ఉన్న అల్లాహ్‌కు విశ్వసనీయుడిని. ఉదయం, సాయంత్రం నా వద్దకు పరలోక వార్తలు వస్తుంటాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
'నీవు కోరుకున్నది నీకు ఇవ్వబడింది, అదనంగా దానికి సమానమైనంత కూడా ఇవ్వబడింది.'
عربي ఇంగ్లీషు ఉర్దూ
అల్లాహ్ మొదటి తరం నుండి చివరి తరం వరకు ఉనికిలో వచ్చిన ప్రజలందరినీ ఒకే చోట సమీకరిస్తాడు. ప్రతి ఒక్కరూ ప్రకటనకర్త (ఇస్రాఫీల్) స్వరాన్ని వింటారు, ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యుడు అతి సమీపంలోకి వచ్చేస్తాడు. ప్రజలు ఎంతో బాధతో(ఆ వేడిని) తట్టుకోలేని స్థితిలో భయకంపితులై ఉంటారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
నిశ్చయంగా స్వర్గంలో విశ్వాసి కొరకు ఒకే ఒక ముత్యంతో చేసిన, అరవై మైళ్ల పొడవు ఉన్న ఓ గుడారం ఉంటుంది. అందులో ఆ విశ్వాసి కుటుంబ సభ్యులు ఉంటారు. విశ్వాసి వారి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, కానీ (గుడారం విశాలం వలన) ఒకరినొకరు చూడలేరు
عربي ఇంగ్లీషు ఉర్దూ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషుడు స్త్రీ వస్త్రాలు ధరించడాన్ని, స్త్రీ పురుషుని వస్త్రాలు ధరించడాన్ని శపించారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎవరి వద్దనైనా (బక్రీద్ పండుగ నాడు) ఖుర్బానీ చేయడానికి ఒక పశువు ఉంటే , దుల్ హజ్ నెలవంక (హిలాల్) కనిపించిన తర్వాత, తన ఖుర్బానీ పూర్తి చేసే వరకు అతడు తన వెంట్రుకలు లేదా గోర్ల నుండి ఏదీ కత్తిరించకూడదు
عربي ఇంగ్లీషు ఉర్దూ
రమదాన్ (మాసం) వచ్చినప్పుడు, స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి మరియు షైతానులు సంకెళ్లలో బంధించబడతారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
పరమ పరిశుద్ధుడు మరియు మహిమాన్వితుడైన అల్లాహ్ ప్రకటన: 'నేను నా నీతిమంతులైన దాసుల కొరకు అంతకు ముందెన్నడూ ఎవరి కళ్లూ చూడని, ఎవరి చెవులూ వినని, ఎవరి హృదయాలూ ఊహించని వాటిని సిద్ధం చేసి ఉంచాను.'
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసభ్యంగా మాట్లాడేవారు కాదు, అసభ్యంగా ప్రవర్తించేవారు కాదు, సంతల్లో (బజార్లలో) గొడవపడి అరవేవారు కాదు, తనకు చెడు చేసినవారికి చెడుతో ప్రతిస్పందించేవారు కాదు, కానీ ఆయన క్షమించేవారు, మన్నించేవారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
నిశ్చయంగా సమాధి పరలోక ప్రయాణంలోని మెట్టు. ఇక్కడ (అల్లాహ్ శిక్ష నుండి) రక్షించబడితే, తర్వాతి దశలు సులభంగా ఉంటాయి. ఇక్కడ రక్షించబడకపోతే, తర్వాతి దశలు చాలా కఠినంగా ఉంటాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
నేను ఇలా అడిగాను: "ఓ రసూలుల్లాహ్‌! నేను ఎవరి పట్ల విధేయత చూపాలి?" దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చినారు: "నీ తల్లి, మళ్లీ నీ తల్లి, మళ్లీ నీ తల్లి, ఆ తర్వాత నీ తండ్రి, ఆ తర్వాత బంధుత్వంలోని సమీప బంధువులు
عربي ఇంగ్లీషు ఉర్దూ
స్వర్గంలో ప్రవేశించే మొదటి సమూహం పూర్ణ చంద్రుని (పౌర్ణమి చంద్రుడు) వలె ప్రకాశవంతంగా ఉంటారు. వారిని అనుసరించే తదుపరి సమూహం ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రంలా మెరుస్తారు
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
కాబట్టి మీరు అల్లాహ్‌ను ఏదైనా అడిగినప్పుడు, ఆయనతో ఫిర్'దౌస్ స్వర్గాన్ని ప్రసాదించమని వేడుకోండి
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
నా మీద ఈ ఆయతులు అవతరించాయి, వీటి వంటివి ఇంతకు ముందు ఎన్నడూ చూడబడలేదు - అవి 'అల్-ముఅవ్వదతైన్' (అల్-ఫలక్ మరియు అన్నాస్ సూరాలు)
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
ఒకవేళ ప్రజలు అదాన్ (నమాజు కొరకు పిలుపు) ఇవ్వడం మరియు మొదటి వరుసలో (సలాహ్ చేయడంలో) ఉన్న గొప్ప ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, దానిని పొందడానికి లాటరీ వేసుకోవాల్సి వచ్చినా, వారు తప్పనిసరిగా లాటరీ వేసుకునే వారు
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
నా సమాజంలో ఒక సమూహం (తాయిఫా) ఎల్లప్పుడూ సత్యంపైనే స్థిరంగా ఉంటుంది. అల్లాహ్ ఆజ్ఞ (ప్రళయం లేదా నిర్ణయం) వచ్చే వరకు వారు దానిపైనే విజయవంతంగా నిలిచి ఉంటారు
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
ఎవరైతే 'నేను అల్లాహ్‌ను నా ప్రభువుగా, ఇస్లాం‌ను నా ధర్మంగా, ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంను నా ప్రవక్తగా స్వీకరించాను' అని పలుకుతారో, వారికి స్వర్గం నిశ్చయం
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
'జాగ్రత్తగా వినండి! మద్యం ఇప్పుడు నిషేధించబడింది.'
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
ఎవరైనా కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే, నరకంలో కూడా అతడు నిరంతరం అలా దూకుతూనే ఉంటాడు;
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
మీరు నాతో ఈ విషయాలపై ప్రమాణం చేయండి: అల్లాహ్‌ కు ఎవరినీ భాగస్వాములుగా చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
ఇస్లాం మొదట్లో పరాయిగా (అన్యంగా, అపరిచితంగా) ప్రారంభమైంది. ఇది మళ్లీ మొదట్లో ఉన్నట్లుగానే పరాయిగా మారిపోతుంది. కాబట్టి, (దానిని గట్టిగా పట్టుకుని ఉండేవారికి) పరాయివారికి శుభం కలుగుగాక!
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
చిన్న చిన్న పాపాలను తక్కువగా భావించకండి
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
నన్ను పంపబడిన ముఖ్య ఉద్దేశ్యం — ఉత్తమ నైతిక విలువలను (మంచి స్వభావాలను) పరిపూర్ణం చేయడమే
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
ఏడు రకాలవారు ఉన్నారు — అల్లాహ్ తన (అర్ష్) నీడను - ఆ రోజు (ప్రళయ దినం) ఆయన (అర్ష్) నీడ తప్ప మరే నీడ
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
ఒక నమాజు తరువాత మరొక నమాజు కొరకు వేచి ఉండటంలోని విశిష్ఠత
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు, అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు, అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు." అపుడు సహచరులు ఇలా అడిగారు: "ఎవరు, ఓ రసూలల్లాహ్?" దానికి ఆయన ఇలా జవాబిచ్చారు: "ఎవరి చెడు వలన అతడి పొరుగువారు సురక్షితంగా ఉండలేరో
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
ఏ వ్యక్తి అయినా తన సహోదరుడిని చూసి: "ఓ అవిశ్వాసి (కాఫిర్)" అని అంటే, అది వారిద్దరిలో ఒకరిపై పడుతుంది; నిజంగా అతను చెప్పినట్లే ఉంటే, ఆ మాట అతనిపై పడుతుంది, ఒకవేళ అలా లేకపోతే, ఆ మాట తిరిగి అతనిపైనే (చెప్పిన వ్యక్తి పైనే) పడుతుంది
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "ఆదం కుమారుడు "కాలాన్ని దూషించడం ద్వారా" నన్ను బాధిస్తున్నాడు - అసలు కాలం అంటే నేను (అల్లాహ్‌నే). సర్వాధికారమూ నా చేతిలోనే ఉంది. నేనే రాత్రిని, పగటిని మారుస్తున్నాను
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
నమాజును (సలాత్) పాటించండి, మీ కుడి చేయి కలిగి ఉన్న వారిని (మీ ఆధీనంలో ఉన్న మీ సేవకులను, బానిసలను) దయగా చూడండి
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
మీలో ఉత్తములు నా తరం వారు (సహాబాలు), తర్వాత వారిని అనుసరించే వారు (తాబియీన్), తర్వాత వారిని అనుసరించే వారు (అతబ్బ తాబియీన్)
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
నిశ్చయంగా కలహాలు (ఫిత్నా) సంభవిస్తాయి. తెలుసుకోండి! ఆ తర్వాత ఒక ఫిత్నా వస్తుంది. దానిలో కూర్చుని ఉండటం, నడుస్తున్నవాడి కంటే మేలు. నడుస్తున్నవాడు, దానివైపు పరిగెత్తేవాడి కంటే మేలు
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
బంగారానికి బంగారం, వెండికి వెండి, గోధుమలకు గోధుమలు, జొన్నలకు జొన్నలు, ఖర్జూరాలకు ఖర్జూరాలు, ఉప్పుకు ఉప్పు — ఏదైనా ఒక రకము వస్తువుకు బదులుగా అదే రకము వస్తువు మార్పిడి చేసుకునేటప్పుడు, (ఇచ్చే దానికి మరియు పుచ్చుకునేదానికి) సరిసమాన పరిమాణంలో, ఆ మార్పిడి ప్రత్యక్ష్యంగా తక్షణమే జరగాలి. ఒకవేళ ఈ వస్తువులు వేర్వేరు రకాలకు చెందినవి అయితే, మీకు ఇష్టమైన విధంగా అమ్ముకోవచ్చు (ఉదాహరణకు బంగారాన్ని వెండితో మార్చుకోవడం), కానీ ఆ లావాదేవీ ప్రత్యక్షంగా తక్షణమే జరగాలి
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
కిందటి దుస్తులలో ఏదైతే కాలి చీలమండలముల కంటే దిగువగా ఉంటుందో అది నరకాగ్నిలో ఉంటుంది (నరకశిక్షకు గురవుతాడు)
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్