عَن قُطْبَةَ بنِ مَالِكٍ رَضيَ اللهُ عنه قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ مُنْكَرَاتِ الأَخْلاَقِ وَالأَعْمَالِ وَالأَهْوَاءِ».

[صحيح] - [رواه الترمذي] - [سنن الترمذي: 3591]
المزيــد ...

ఖుత్బహ్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా దుఆ చేస్తూ ఉండేవారు:
“అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బికబిక మిన్ మున్కరాతిల్ అఖ్లాఖి, వల్ ఆ’మాలి, వల్ అహ్’వాయి” (ఓ అల్లాహ్! చెడు నైతికత నుండి, చెడు పనులు చేయుట నుండి మరియు చెడు కోరికల నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను)

[ప్రామాణికమైన హదీథు] - [అత్తిర్మిదీ నమోదు చేసినారు:] - [సునన్ అత్తిర్మిదీ - 3591]

వ్యాఖ్యానము

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దుఆలలో ఇది కూడా ఒకటి: (అల్లాహుమ్మ ఇన్నీ అఊదు) (నీ వైపునకు తిరిగి) ఓ అల్లాహ్ నేను శరణు వేడుకుంటున్నాను; (బిక) కేవలం నీ శరణు, మరింకెవరి శరణు కాదు; (మినల్ మున్కరాతి) అన్ని రకాల చెడుల నుండి, వేటినైతే అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారో; అంటే (అల్ అఖ్లాఖి) నైతికతకు చెందిన చెడులు, దుర్మార్గం, అసూయ మరియు అహంకారం వంటి చెడుల నుండి; (వ మిన్ మున్కరాతిల్ ఆ’మాల్) మరియు ఆచరణకు చెందిన చెడులు – అవమానించడం, శపించడం వంటి చెడుల నుండి, (వ మిన్ జమీ’ అల్ అహ్’వాల్) మరియు ఏవైతే షరియహ్ బోధనలకు విరుద్ధమైనవో – ఆత్మ కోరుకునే అటువంటి అన్ని రకాల కోరికల నుండి నీ రక్షణ, నీ శరణు వేడుకుంటున్నాను.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. ఈ హదీథులో ఈ దుఆ యొక్క ఘనత, యోగ్యత మరియు ఈ దుఆ యొక్క వాంఛనీయత తెలుస్తున్నాయి.
  2. విశ్వాసి అన్ని వేళలా నిందనీయమైన నైతికతలను మరియు నిందనీయమైన చర్యలను, ఆచరణలను నివారించడానికి ఆసక్తి కలిగి ఉంటాడు మరియు చిత్త చాపల్యములను మరియు వాంఛలు, కోరికలను అనుసరించకుండా జాగ్రత్తగా ఉంటాడు.
  3. నైతికత, ఆచరణలు మరియు మనోభావాలు రెండు రకాలుగా విభజించబడినవి: ఖండించదగినవి మరియు మంచివి.
అనువాదాలను చూపించండి
భాష: الإنجليزية الأوردية الإسبانية ఇంకా (35)
ఇంకా