عَنْ عِيَاضِ بْنِ حِمَارٍ أَخِي بَنِي مُجَاشِعٍ رَضيَ اللهُ عنه قَالَ: قَامَ فِينَا رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ ذَاتَ يَوْمٍ خَطِيبًا، فَقَالَ: وَسَاقَ الْحَدِيثَ وَفِيهِ:
«وَإِنَّ اللهَ أَوْحَى إِلَيَّ أَنْ تَوَاضَعُوا حَتَّى لَا يَفْخَرَ أَحَدٌ عَلَى أَحَدٍ، وَلَا يَبْغِي أَحَدٌ عَلَى أَحَدٍ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2865]
المزيــد ...

బనీ ముజాషీ తెగ సోదరుడైన ఇయాద్ ఇబ్న్ హిమార్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ఒకరోజు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్యన ఒక ప్రసంగకర్తగా నిలబడి ఇలా అన్నారు:” ఇయాద్ ఇబ్న్ హిమార్ (రదియల్లాహు అన్హు) ఆ హదీథును వివరించినారు; అందులో ఇలా ఉన్నది:
“నిశ్చయంగా అల్లాహ్ నాకు ఈ విధంగా వహీ చేసినాడు (దివ్యజ్ఞానాన్ని అవతరింపజేసినాడు) – ఎవరూ ఒకరిపై మరొకరు గొప్పలు చెప్పుకోకండి, మరియు ఎవరూ ఒకరిని మరొకరు అణచివేతకు గురిచేయకండి.”

[ప్రామాణికమైన హదీథు] - [ముస్లిం నమోదు చేసినారు:] - [సహీహ్ ముస్లిం - 2865]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను సంబోధిస్తూ ప్రసంగించినారు – ఆ ప్రసంగములో మిగతా విషయాలతో పాటు వారు ఇలా అన్నారు: నిశ్చయంగా అల్లాహ్ తనపై ఈ విధంగా దివ్యఙ్ఞానాన్ని అవతరింపజేసినాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినారు: ప్రజలు పరస్పరం వినయంతో మెలగాలి, ఇతరుల కొరకు తమ రెక్కలు వంచి, సౌమ్యంగా ఉండాలి. తద్వారా ఎవరూ తమ వంశపారంపర్యత, సంపద లేదా మరే విషయం ఆధారంగానైనా గొప్పతనం, గర్వం లేదా గౌరవం గురించి గొప్పలు చెప్పుకోరాదు; మరియు ఎవరూ ఎవరినీ అణచివేయరాదు లేదా అతిక్రమించరాదు.

من فوائد الحديث

  1. ఈ హదీథు వినయాన్ని ప్రోత్సహిస్తుంది మరియు ప్రజల పట్ల అహంకారం మరియు గర్వాన్ని కలిగి ఉండడాన్ని నివారిస్తుంది.
  2. ఇది అతిక్రమణ, అణచివేత మరియు అహంభావాన్ని కూడా నిషేధిస్తుంది.
  3. అల్లాహ్ పట్ల వినయం అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి:
  4. మొదటి అర్థం ఏమిటంటే: మీరు అల్లాహ్ యొక్క ధర్మం పట్ల వినయంగా ఉంటారు, దాని పట్ల లేదా దాని నియమాల పట్ల అహంకారంతో ఉండరు.
  5. రెండవ అర్థం ఏమిటంటే: మీరు అల్లాహ్ యొక్క దాసుల పట్ల కేవలం అల్లాహ్ కొరకు వినయంగా ఉంటారు, వారి పట్ల భయంతో లేదా వారు కలిగి ఉన్న వాటిపై ఆశతో కాదు, కానీ కేవలం సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కోసం మాత్రమే.
అనువాదాలను వీక్షించండి
భాష: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇంకా (33)
ఇంకా