عَنْ أَبِي ذَرٍّ، جُنْدُبِ بْنِ جُنَادَةَ، وَأَبِي عَبْدِ الرَّحْمَنِ، مُعَاذِ بْنِ جَبَلٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«اتَّقِ اللَّهَ حَيْثُمَا كُنْت، وَأَتْبِعْ السَّيِّئَةَ الْحَسَنَةَ تَمْحُهَا، وَخَالِقْ النَّاسَ بِخُلُقٍ حَسَنٍ».
[قال الترمذي: حديث حسن] - [رواه الترمذي] - [الأربعون النووية: 18]
المزيــد ...
అబూ దర్, జున్దుబ్ బిన్ జునాదా, అబూ అబ్దిర్రహ్మాన్ మరియు ముఆద్ బిన్ జబల్ రదియల్లాహు అన్హుమ్ ల ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"మీరు ఎక్కడ ఉన్నా అల్లాహ్ పట్ల భయభీతి (తఖ్వా) కలిగి ఉండండి మరియు ఏదైనా చెడు పని చేస్తే, వెంటనే ఒక మంచి పని చేయండి, అది దానిని అంటే ఆ పాపాన్ని తుడిచివేస్తుంది, మరియు ప్రజలతో మంచి నడవడికతో (చక్కని ప్రవర్తనతో) వ్యవహరించండి."٨
[قال الترمذي: حديث حسن] - [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు] - [الأربعون النووية - 18]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు విషయాల గురించి ఆజ్ఞాపిస్తున్నారు: మొదటిది: ఎల్లప్పుడూ అల్లాహ్ పట్ల భయభక్తులు (తఖ్వా) కలిగి ఉండటం. అది, ప్రతి ప్రదేశంలోనూ, ప్రతి కాలంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ , గోప్యంగానూ మరియు బహిరంగంగానూ, ఆరోగ్యంగా ఉన్నప్పుడూను మరియు కష్టాలలో ఉన్నప్పుడూను, విధిగావించిన వాటిని ఆచరించటం మరియు నిషేధించబడిన వాటికి దూరంగా ఉండటం వలన సాధ్యమగును. రెండవది: నీవు ఏదైనా ఒక చెడు పని చేసినట్లయితే, వెంటనే దాని తర్వాత ఒక మంచి పని చేయి — అది నమాజు (సలాహ్), దానధర్మం, సత్కార్యం, బంధుత్వాలు కలపడం (అంటే సత్సంబంధాలు నెలకొల్పడం), పశ్చాత్తాపం లేదా ఇతరత్రా ఏదైనా మంచి పని కావచ్చు—నిశ్చయంగా అది ఆ చెడు పనిని తుడిచివేస్తుంది (అంటే ప్రక్షాళన చేస్తుంది). మూడవది: ప్రజలతో మంచి నడవడికతో వ్యవహరించు, అందులో వారి ముఖాలపై చిరునవ్వు చిందించడం, దయ, మృదుత్వం, మేలు చేయడం మరియు బాధను తొలగించడం వంటివి అందులో ఉన్నాయి.