عَنْ مُعَاذَةَ قَالَتْ:
سَأَلْتُ عَائِشَةَ، فَقُلْتُ: مَا بَالُ الْحَائِضِ تَقْضِي الصَّوْمَ، وَلَا تَقْضِي الصَّلَاةَ؟ فَقَالَتْ: أَحَرُورِيَّةٌ أَنْتِ؟ قُلْتُ: لَسْتُ بِحَرُورِيَّةٍ، وَلَكِنِّي أَسْأَلُ. قَالَتْ: كَانَ يُصِيبُنَا ذَلِكَ، فَنُؤْمَرُ بِقَضَاءِ الصَّوْمِ، وَلَا نُؤْمَرُ بِقَضَاءِ الصَّلَاةِ.

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 335]
المزيــد ...

ము’ఆదహ్ బింత్ అబ్దిల్లాహ్ అల్ అదవియ్యహ్ (సహాబాల తరువాత తరానికి అంటే తాబయీనుల తరానికి చెందిన స్త్రీ) ఉల్లేఖన:
“నేను ఆయిషా రదియల్లాహు అన్హాను ఇలా ప్రశ్నించాను: “ఋతుస్రావ సమయములో తాను తప్పి పోయిన ఉపవాసాలను స్త్రీ తరువాత పూర్తి చేస్తుంది, కానీ తప్పిపోయిన నమాజులను పూర్తిచేయదు ఎందుకు?” దానికి ఆమె “నీవు హరూరియ్యహ్ స్త్రీవా?” అని ప్రశ్నించినారు. నేను: “నేను హరూరియ్యహ్ స్త్రీని కాను, కానీ ఆసక్తి కొద్దీ అడిగాను” అన్నాను. అపుడు ఆమె ఇలా అన్నారు: “మాకు అలా జరిగేది. అయితే తప్పిపోయిన ఉపవాసాలను పూర్తి చేయమని మేము ఆదేశించబడేవారము, కానీ (తప్పిపోయిన) నమాజులను పూర్తి చేయమని ఆదేశించబడే వారము కాము.”

[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] - [సహీహ్ ముస్లిం - 335]

వివరణ

ము’అదహ్ అల్ అదవియ్యహ్ అనే స్త్రీ విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయిషా రదియల్లాహు అన్హాను ఇలా ప్రశ్నించినారు: “ఋతుస్రావంలో ఉన్న స్త్రీ తాను ఉండలేక పోయిన ఉపవాసాలను తరువాత పూర్తి చేస్తుంది, కానీ ఆ స్థితిలో చేయలేక పోయిన నమాజులను ఆ తరువాత పూర్తి చేయదు, ఎందుకు?” ఆయిషా రదియల్లాహు అన్హా ఆమెను “నీవు ఖారిజీయులలో ఒకరైన హరూరియ్యహ్’లలో ఒకరివా? వాళ్ళు మొండిగా, కఠినంగా ఉండేవారు, తరుచుగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు” అని ప్రశ్నించినారు. ఆ స్త్రీ “లేదు, నేను ఖారిజీయురాలిని కాను, ఆసక్తి కొద్దీ ప్రశ్నించినాను” అని బదులిచ్చింది. అప్పుడు ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా అన్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో మాకు ఋతుస్రావం సంభవించినప్పుడు మేము ఉండలేకపోయిన ఉపవాసాలను పూర్తి చేయమని ఆదేశించబడేవారము, కానీ నమాజుల విషయములో అలా ఆదేశించబడలేదు.”

من فوائد الحديث

  1. మూర్ఖత్వం మరియు మొండి వాదనకు దిగుతూ ప్రశ్నలు అడిగే ప్రతి ఒక్కరినీ ఖండించడం సరియైనదే.
  2. ‘హరురియా ప్రజలు’ కుఫా సమీపంలోని "హరురా" అనే పట్టణం పేరు మీదుగా అలా పిలువబడినారు: వారు ఖవారీజ్‌’లలో ఒక వర్గం; వ్యవహారాలలో హరురియా ప్రజల కఠినత్వం, వారి అనేక ప్రశ్నలు అడిగే తత్వము మరియు వారి మొండితనం కారణంగా ఆయిషా రదియల్లాహు అన్హా ఆ స్త్రీని వారితో పోల్చినారు.
  3. ఏదైనా విషయములో బోధన మరియు మార్గదర్శకత్వం కోసం తనను అభ్యర్థించిన వారికి గురువు ఆ విషయాన్ని స్పష్టం చేయాలి.
  4. ఖుర్ఆన్ లేదా హదీథులోని ఖచ్చితమైన వచనంతో ప్రతిస్పందించడం మంచిది, ఎందుకంటే ఆయిషా రదియల్లాహు అన్హా ప్రశ్నించిన స్త్రీ అడిగిన నిర్దిష్ట అర్థాన్ని ప్రస్తావించలేదు; వాస్తవానికి మూల వచనంతో సమాధానం ఇవ్వడం అభ్యంతరాలకు అవకాశం ఇవ్వదు.
  5. దాని వెనుక ఉన్న వివేకం, జ్ఞానం అర్థం చేసుకోలేకపోయినా, అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడి సల్లల్లాహు అలైహి వ సల్లం ఆదేశాలను శిరసావహించాలి.
  6. ఇమాం అల్-నవవీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: ఆయిషా రదియల్లాహు అన్హా ప్రకటన యొక్క అర్థం ఏమిటంటే, ఖవారీజ్‌లోని ఒక వర్గం ఋతుక్రమంలో ఉన్న స్త్రీలు ఆ స్థితిలో తప్పిపోయిన నమాజులను తిరిగి ఆచరించాలని అంటుంది, ఇది వాస్తవానికి ముస్లిం సమాజపు ఏకాభిప్రాయానికి విరుద్ధం. ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఆ స్త్రీని అడిగిన ఈ ప్రశ్న తిరస్కరణకు సంబంధించిన ప్రశ్న, అంటే: ఇది హరురియా వర్గం వారి మార్గం మరియు ఇది ఎంతో చెడ్డ మార్గము.
అనువాదాలను వీక్షించండి
భాష: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇంకా (34)