عَنْ عُمَرَ بْنِ الخَطَّابِ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَوْ أَنَّكُمْ كُنْتُمْ تَوَكَّلُونَ عَلَى اللهِ حَقَّ تَوَكُّلِهِ لَرَزَقَكُمْ كَمَا يَرْزَقُ الطَّيْرَ تَغْدُو خِمَاصًا وَتَرُوحُ بِطَانًا».
[صحيح] - [رواه الإمام أحمد، والترمذي، والنسائي، وابن ماجه، وابن حبان في صحيحه، والحاكم] - [الأربعون النووية: 49]
المزيــد ...
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"మీరు అల్లాహ్ పై సంపూర్ణంగా ఆధారపడినట్లయితే, ఆయన పక్షులకు ఆహారాన్ని ఇచ్చే విధంగానే మీకు కూడా ఇస్తాడు. అవి ఉదయం ఖాళీ కడుపుతో బయలుదేరి, సాయంత్రం నిండిన కడుపుతో తిరిగి వస్తాయి."ఏర్పాటు
[దృఢమైనది] - [رواه الإمام أحمد والترمذي والنسائي وابن ماجه وابن حبان في صحيحه والحاكم] - [الأربعون النووية - 49]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధిస్తున్నారు – ప్రాపంచిక వ్యవహారాలలో గానీ లేక ధర్మానికి సంబంధించిన వ్యవహారాలలో గాని - ప్రయోజనం పొందేందుకు, కీడును లేక హాని కలుగజేసే వాటిని దూరం చేసేందుకు - మనం అన్ని వేళలా అల్లాహ్ పై ‘తవక్కల్’ను (దృఢమైన సంపూర్ణ నమ్మకాన్ని, భరోసాను) కలిగి ఉండాలి. ఎందుకంటే, ఎవరూ కూడా దేనినీ ప్రసాదించలేరు, దేనినీ ఆపి ఉంచలేరు, హాని కలిగించలేరు లేదా ప్రయోజనం కలిగించలేరు, కేవలం పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ తప్ప. ఇంకా ఇలా తెలియజేస్తున్నారు – ప్రయోజనం పొందడానికి లేదా కీడును, హానిని దూరం చేయడానికి వినియోగించే వనరులను, సాధనాలను, విధానాలను అల్లాహ్ నందు పూర్తి ‘తవక్కల్’తో (సంపూర్ణ విశ్వాసముతో, నమ్మకముతో, భరోసాతో) వినియోగించాలి. మనం ఎపుడైతే అలా చేస్తామో, పక్షులకు ప్రసాదించిన మాదిరిగా అల్లాహ్ మనకూ రిజ్’ఖ్ ను (ఉపాధిని) ప్రసాదిస్తాడు; ఎలాగైతే అవి ఉదయం తమ గూళ్ళ నుండి ఆకలితో బయలుదేరి, సాయంత్రం నిండిన పొట్టలతో సంతృప్తిగా తిరిగి వస్తాయో ఆ విధంగా. పక్షుల యొక్క ఈ చర్య ఉపాధిని పొందడానికి తగిన సాధనాలను వినియోగించాలి అనడానికి ఒక ఉదాహరణ, అంతే గానీ కేవలం భరోసాతో సోమరిపోతుగా ఉండి పోవడం తగదు.