కూర్పు:
+ -

عَنِ النَّوَّاسِ بْنِ سِمْعَانَ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«البِرُّ: حُسْنُ الخُلُقِ، وَالإِثْمُ مَا حَاكَ فِي صَدْرِكَ، وَكَرِهْتَ أَنْ يَطَّلِعَ عَلَيْهِ النَّاسُ». وَعَنْ وَابِصَةَ بْنِ مَعْبَدٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: أَتَيْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: «جِئْتَ تَسْأَلُ عَنِ البِرِّ وَالإِثْمِ»، قُلْتُ: نَعَمْ، قَالَ: «اسْتَفْتِ قَلْبَكَ، البِرُّ: مَا اطْمَأَنَّتْ إلَيْهِ النَّفْسُ، وَاطْمَأَنَّ إلَيْهِ القَلْبُ، وَالإِثْمُ: مَا حَاكَ فِي نَفْسِكَ وَتَرَدَّدَ فِي الصَّدْرِ، وَإِنْ أَفْتَاكَ النَّاسُ وَأَفْتَوْكَ».

[صحيح] - [الحديث الأول: رواه مسلم، والحديث الثاني: رواه أحمد والدارمي.] - [الأربعون النووية: 27]
المزيــد ...

అన్నవ్వాస్ ఇబ్నె సిమ్'ఆన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"పుణ్యం (అల్-బిర్ర్) అంటే మంచి ప్రవర్తన, మరియు పాపం (అల్-ఇథమ్) అంటే నీ హృదయంలో సందేహాన్ని కలిగించి, దానిని ప్రజలు తెలుసుకోవడాన్ని నీవు ఇష్టపడనిది."

[దృఢమైనది] - [الحديث الأول: رواه مسلم، والحديث الثاني: رواه أحمد والدارمي] - [الأربعون النووية - 27]

వివరణ

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుణ్యం (అల్-బిర్ర్) మరియు పాపం (అల్-ఇథమ్) గురించి తెలియజేస్తూ, ఇలా అన్నారు: పుణ్యం యొక్క అత్యంత గొప్ప లక్షణం - అల్లాహ్ పట్ల భయభక్తులతో మరియు ప్రజలతో సహనంతో, కోపాన్ని తగ్గించుకొని, ప్రసన్నంగా, మంచి మాటలతో, సంబంధాలను కొనసాగించడం, విధేయత చూపడం, దయతో, మంచితనంతో మరియు మంచి సహవాసంతో వ్యవహరించడం. మరియు పుణ్యం అంటే హృదయం మరియు మనస్సు ప్రశాంతంగా ఉన్నది. పాపం (అల్-ఇథమ్) విషయానికి వస్తే, అది హృదయం ప్రశాంతంగా ఉండకుండా, మనస్సులో సందేహమును కలిగించి, అటూఇటూ ఊగిసలాడేలా చేస్తుంది. అది పాపమేమోనని హృదయంలో సందేహం మరియు భయం కలుగుతుంది. అంతేకాకుండా, అది ఒక చెడు పని కావడం వల్ల, ప్రజల దృష్టిలోకి, ముఖ్యంగా గొప్ప వ్యక్తులు మరియు పరిపూర్ణమైన వారి దృష్టిలోకి రావడం నీవు ఇష్టపడవు. ఎందుకంటే, మనస్సు సహజంగానే తన మంచి పనులను ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటుంది. కాబట్టి, అలాంటి నీ పనులను ప్రజలు తెలుసుకోవడాన్ని ద్వేషిస్తే, అది పాపం, దానిలో ఏ మంచీ లేదు. ప్రజలు నీకు తీర్పు ఇచ్చినా, నీ హృదయంలో సందేహం ఉన్నంత వరకు వారి తీర్పును అంగీకరించకు. ఎందుకంటే, సందేహం సరైనదైనప్పుడు మరియు తీర్పు ఇచ్చే వ్యక్తికి జ్ఞానం లేనప్పుడు ఆ తీర్పు అనుమానాన్ని తొలగించదు. అయితే, తీర్పు షరియా ఆధారంగా ఇచ్చినట్లయితే, ఆ వ్యక్తి తన హృదయం ప్రశాంతంగా లేకపోయినప్పటికీ, ఆ తీర్పును పాటించడం తప్పనిసరి.

من فوائد الحديث

  1. ఈ హదీథులో మంచి నైతికతలను ప్రోత్సహించడం కనిపిస్తుంది; ఎందుకంటే మంచి నైతికత అనేది ధర్మము యొక్క గొప్ప లక్షణాలలో ఒకటి.
  2. విశ్వాసి సత్యం మరియు అసత్యం గురించి గందరగోళంలో పడడు; బదులుగా, అతను తన హృదయంలోని వెలుగు ద్వారా సత్యాన్ని తెలుసుకుంటాడు మరియు అసత్యానికి దూరంగా ఉంటాడు మరియు దానిని తిరస్కరిస్తాడు.
  3. పాపపు సంకేతాలలో ఆందోళన, హృదయంలో కలత, మరియు ప్రజలు దాని గురించి తెలుసుకోవడం పట్ల అయిష్టత ఉన్నాయి.
  4. అల్ సింది (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఇది అనుమానాస్పద విషయాలలో ఉంది, దీనిలో ప్రజలకు ఒక విషయపు రెండు పార్శ్వముల నిర్దిష్ట లక్షణాల గురించి తెలిసి ఉండదు. అలా గాక షరియతులో – వ్యతిరేకంగా ఎటువంటి ఆధారమూలేని ఆఙ్ఞాపించబడిన విషయాలన్నీ ధర్మబద్ధమైనవే. అలాగే షరియతులో నిషేధించబడినది కూడా పాపమే. ఇటువంటి విషయాలలో (అంటే, ఆఙ్ఞాపించబడిన మరియు నిషేధించబడిన విషయాలలో) హృదయాన్ని సంప్రదించి దానికి భరోసా ఇవ్వవలసిన అవసరం లేదు.
  5. హదీథులలో ప్రస్తావించబడిన వారు మంచి స్వభావం గల వ్యక్తులు; అంతేగానీ, కోరికల నుండి ఉత్పన్నమైన విషయాలు నింపబడిన హృదయాలు కలిగి ఉన్న వారు కాదు. అటువంటి హృదయాలు తలక్రిందులైన హృదయాలుగా ఉంటాయి. వారు మంచిని గుర్తించరు, చెడును ఖండించరు.
  6. అల్-తయ్యిబి ఇలా అన్నారు: హదీథులో ధర్మబద్ధత వివిధ అర్థాలతో వివరించబడినది అని చెప్పబడింది. ఒక చోట దీనిని ఆత్మకు శాంతి ప్రదాయినిగా వివరించబడింది, మరియు హృదయం శాంతిని పొందే విషయంగా వివరించబడింది. మరొక చోట దీనిని విశ్వాసంగా, మరొక చోట ఒకరిని అల్లాహ్ కు దగ్గరగా తీసుకువచ్చే విషయంగా వివరించబడింది, అలాగే ఇక్కడ మంచి వ్యక్తిత్వంగా వివరించబడింది. మంచి వ్యక్తిత్వాన్ని – హానిని, కష్టాలను భరించడం, తక్కువ కోపం కలిగి ఉండడం, ఉల్లాసమైన ముఖం మరియు దయగల మాటలు అని వివరించబడింది. ఇవన్నీ అర్థంలో దగ్గరగా ఉన్న విషయాలే.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ ఇండోనేషియన్ బెంగాలీ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం థాయ్ జర్మన్ పష్టో అస్సామీ అల్బేనియన్ الأمهرية الغوجاراتية Қирғизӣ النيبالية الليتوانية الدرية الصربية الطاجيكية Кинёрвондӣ المجرية التشيكية الموري Канада الولوف Озарӣ الأوزبكية الأوكرانية الجورجية المقدونية الخميرية
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
ఇంకా