عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنه قَالَ:
جَاءَ رَجُلٌ إِلَى رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: يَا رَسُولَ اللهِ، أَرَأَيْتَ إِنْ جَاءَ رَجُلٌ يُرِيدُ أَخْذَ مَالِي؟ قَالَ: «فَلَا تُعْطِهِ مَالَكَ» قَالَ: أَرَأَيْتَ إِنْ قَاتَلَنِي؟ قَالَ: «قَاتِلْهُ» قَالَ: أَرَأَيْتَ إِنْ قَتَلَنِي؟ قَالَ: «فَأَنْتَ شَهِيدٌ»، قَالَ: أَرَأَيْتَ إِنْ قَتَلْتُهُ؟ قَالَ: «هُوَ فِي النَّارِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 140]
المزيــد ...
అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
“ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగాడు: “ఓ రసూలుల్లాహ్! సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ ఎవరైనా ఒకడు నా నుంచి ధనాన్ని కాజేయాలనే ఉద్దేశ్యంతో నా వద్దకు వస్తే, మీరు ఏమంటారు?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నీ ధనాన్ని అతనికి ఇవ్వవద్దు”, అపుడు అతడు ఇలా అన్నాడు: “ఒకవేళ అతడు నాతో పోరాటానికి దిగితే?”; దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: “నీవు కూడా అతనితో పోరాడు” అన్నారు. మళ్ళీ అతడు: “ఒకవేళ ఆ పోరాటంలో అతడు నన్ను చంపివేస్తే?” అని అడిగాడు, దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: “అపుడు నీవు “షహీదు”గా పరిగణించబడతావు” అన్నారు; అపుడు అతడు మళ్ళీ: “ఒకవేళ నేనే అతడిని చంపివేస్తే?” అని అడిగాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అతడు నరకంలో ఉంటాడు.”
[ప్రామాణికమైన హదీథు] - [ముస్లిం నమోదు చేసినారు:] - [సహీహ్ ముస్లిం - 140]
ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నాడు: ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! , “ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి నా డబ్బును బలవంతంగా లాక్కోవడానికి వస్తే మీరు ఏమంటారు?” ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "నీవు అతనికి లొంగిపోయి నీ డబ్బు ఇవ్వవలసిన అవసరం లేదు." దానికి ఆ వ్యక్తి ఇలా అన్నాడు: “ఒకవేళ అతడు నాతో పోరాటానికి దిగితే?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అతనితో ఎదురు పోరాటం చేయడానికి నీకు కూడా అనుమతి ఉన్నది.” అపుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు: “ఒకవేళ అతడు నన్ను చంపివేస్తే?” ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు షహీదుగా (అమరవీరునిగా) పరిగణించబడతావు” అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ ఇలా అన్నాడు: “మరి ఒకవేళ నేను అతడిని చంపివేస్తే?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: “పునరుత్థాన దినమున ఆ వ్యక్తి నరకాగ్నిలో వేయబడడానికి అర్హుడవుతాడు” అన్నారు.