عَنْ أَبِي رُقَيَّةَ تَمِيمِ بْنِ أَوْسٍ الدَّارِيِّ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«الدِّينُ النَّصِيحَةُ» قُلْنَا: لِمَنْ؟ قَالَ: «لِلهِ وَلِكِتَابِهِ وَلِرَسُولِهِ وَلِأَئِمَّةِ الْمُسْلِمِينَ وَعَامَّتِهِمْ».
[صحيح] - [رواه مسلم] - [الأربعون النووية: 7]
المزيــد ...
అబూ రుఖయ్యహ్ ఇబ్నె ఔస్ అద్దారీయ్యి రదియల్లాహు అన్హు ఉ్లలేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహ వసల్లం ఇలా పలికినారు:
“ధర్మము ఒక నిష్కల్మషమైన బోధన, ఉపదేశం”. మేము ఇలా అడిగాము: “ఎవరి కొరకు?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ కొరకు, ఆయన గ్రంథం (ఖుర్’ఆన్) కొరకు, ఆయన సందేశహరుని కొరకు, ముస్లిముల విద్వాంసుల కొరకు మరియు సాధారణ ముస్లిములందరి కొరకు” అన్నారు.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [الأربعون النووية - 7]
"నిశ్చయంగా, ఇస్లాం ధర్మం నిజాయితీ (ఇఖ్లాస్) మరియు సత్యం (సిద్ఖ్) పై ఆధారపడి ఉందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. దీని వలన అల్లాహ్ ఆజ్ఞాపించినట్లుగా, ఎలాంటి కొరత లేదా మోసం లేకుండా, సంపూర్ణంగా దాన్ని పాటించాలి." ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగారు: "సలహా (నసీహత్) ఎవరి కొరకు?" అప్పుడు ఆయన ఇలా జవాబు ఇచ్చారు: మొదటిది: పరమ పవిత్రుడైన అల్లాహ్ గురించి మీ కొరకు సలహా (నసీహత్): ఆయన కోసం చేసే కర్మలలో చిత్తశుద్ధి (ఇఖ్లాస్) కలిగి ఉండడం, ఆయనతో ఎవరినీ భాగస్వాములను చేయకుండా ఉండడం, ఆయన యొక్క రుబూబియ్యత్ (సార్వభౌమత్వం) పట్ల, ఉలూహియ్యత్ (ఏకైక ఆరాధకుడనే అర్హత) పట్ల, ఆయన పేర్లు మరియు గుణాల పట్ల విశ్వసించడం, ఆయన ఆజ్ఞలను ఎంతో ఉన్నతంగా గౌరవించడం, మరియు ఆయన పట్ల విశ్వాసం వైపు ఆహ్వానించడం. రెండవది: అల్లాహ్ గ్రంథం ఖుర్ఆన్ గురించి మీ కొరకు సలహా (నసీహత్): దానిని అల్లాహ్ వాక్యంగా నమ్మాలి, అది ఆఖరి దైవగ్రంథం, దానికి ముందున్న షరియతులన్నింటినీ (దైవచట్టాలన్నింటినీ) రద్దు చేస్తున్నది. దానిని గౌరవించాలి, సరియైన పద్ధతిలో దాని పారాయణం చేయాలి, దానిలోని స్పష్టమైన ఆజ్ఞలను పాటించాలి, దానిలోని స్పష్టంగా లేని విషయాలను విశ్వసించాలి, దాని అర్థాన్ని వక్రీకరించేవారి నుండి దాన్ని కాపాడాలి, దానిలోని బోధనల నుండి పాఠాలు నేర్చుకోవాలి, దాని జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలి, దాని వైపు (ప్రజలను) ఆహ్వానించాలి. మూడవది: ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మీ కొరకు సలహా (నసీహత్): ఆయన ప్రవక్తల పరంపరలో చిట్టచివరి ప్రవక్త అని మనము విశ్వసిస్తున్నాము, ఆయన తీసుకు వచ్చిన దానిని (ఖుర్ఆన్ ను) మనము విశ్వసిస్తాము, ఆయన ఆజ్ఞలను పాటిస్తాము, ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉంటాము, ఆయన బోధించిన దాని ప్రకారం మాత్రమే అల్లాహ్ ను ఆరాధిస్తాము, ఆయన హక్కుకు గొప్ప స్థానము ఇస్తాము , ఆయనను గౌరవిస్తాము, ఆయన పిలుపును వ్యాప్తి చేస్తాము, ఆయన చట్టాన్ని వ్యాప్తి చేస్తాము మరియు ఆయనపై వచ్చే ఆరోపణలను ఖండిస్తాము. నాల్గవది: ముస్లిం నాయకుల గురించి మీ కొరకు సలహా (నసీహత్): సత్యంలో వారికి సహాయం చేయ వలెను, వారితో వివాదం చేయకూడదు, అల్లాహ్ కు విధేయత చూపడంలో భాగంగా వారి సత్యమైన మాట వినాలి మరియు వారికి విధేయత చూపాలి. ఐదవది: తోటి ముస్లింల గురించి మీ కొరకు సలహా: వారి పట్ల దయతో వ్యవహరించాలి, వారిని మంచి వైపు ఆహ్వానించాలి, వారికి హాని కలిగించకూడదు, వారితో ప్రేమగా మెలగాలి, ఇంకా వారు (ఇస్లాం) ధర్మాన్ని అనుసరించడంలో మరియు (అల్లాహ్ పట్ల) దైవభక్తి పెంపొందించుకోవడంలో వారికి సహకరించాలి.