కూర్పు:
+ -

عَنْ أَبِي هُرَيْرَةَ عَبْدِ الرَّحْمَنِ بْنِ صَخْرٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: سَمِعْت رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّم يَقُولُ:
«مَا نَهَيْتُكُمْ عَنْهُ فَاجْتَنِبُوهُ، وَمَا أَمَرْتُكُمْ بِهِ فَافْعَلُوا مِنْهُ مَا اسْتَطَعْتُمْ، فَإِنَّمَا أَهْلَكَ الَّذِينَ مِنْ قَبْلِكُمْ كَثْرَةُ مَسَائِلِهِمْ، وَاخْتِلَافُهُمْ عَلَى أَنْبِيَائِهِمْ».

[صحيح] - [رواه البخاري ومسلم] - [الأربعون النووية: 9]
المزيــد ...

అబూ హురైరహ్ అబ్దుర్రహ్మాన్ బిన్ సఖ్'ర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:
నేను మీకు వారించిన వాటి నుండి మీరు దూరంగా ఉండండి; నేను మీకు ఆజ్ఞాపించిన దానిని మీకు సాధ్యమైనంత వరకు చేయండి. నిజంగా, మీకంటే పూర్వం గతించిన వారిని నాశనం చేసినది వారి అధిక ప్రశ్నలు అడగడము, తమ ప్రవక్తలకు విరోధంగా వ్యవహరించడమ.

[దృఢమైనది] - [رواه البخاري ومسلم] - [الأربعون النووية - 9]

వివరణ

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇలా స్పష్టం చేసినారు: ఆయన దేని నుంచైనా మనల్ని వారించినప్పుడు, మనం దాని నుండి ఎలాంటి మినహాయింపు లేకుండా పూర్తిగా దూరంగా ఉండ వలెను. మరియు ఆయన దేనినైనా మనకు ఆజ్ఞాపించినప్పుడు, మనం మన శక్తి మేరకు దానిని పూర్తి చేయ వలెను. అనంతరం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పూర్వం గతించిన కొన్ని సమాజముల వలె ప్రవర్తించవద్దని మనల్ని హెచ్చరించారు. వారు తమ ప్రవక్తలను మరీ ఎక్కువ ప్రశ్నలు అడిగేవారు మరియు ధిక్కరించేవారు. దాని ఫలితంగా, అల్లాహ్ వారిని వివిధ రకాల వినాశనాలతో మరియు విధ్వంసాలతో శిక్షించాడు. కాబట్టి, వారు నాశనమైనట్లుగా మనం కూడా నాశనం కాకుండా ఉండటానికి మనం వారిలా ప్రవర్తించకూడదు.

من فوائد الحديث

  1. తప్పనిసరిగా పాటించాల్సిన ఆదేశాలను మరియు తప్పనిసరిగా మానుకోవాల్సిన నిషేధాలను స్పష్టం చేయడంలో ఈ హదీథు ఒక ప్రాథమిక నియమం లాంటిది.
  2. నిషేధించబడిన వాటిలో నుండి ఏ ఒక్కటి కూడా చేయడానికి అనుమతి లేదు. కానీ వాజిబ్ ఆదేశానికి చెందిన ఆచరణలు మన శక్తికి పరిమితం చేయబడినాయి (అంటే సాధ్యమైనంతగా ఆచరించండి అని ఆదేశించబడింది). ఎందుకంటే, విడిచి పెట్టడం అనేది సులభమూ మరియు సాధ్యమే, కానీ ఒక పనిని చేయడానికి దానిని చేయగలిగే సామర్థ్యం చాలా అవసరం.
  3. ఏదైనా విషయాన్ని గురించి అతిగా ప్రశ్నించడం పట్ల నిషేధము: ధర్మ పండితులు ప్రశ్నలను రెండు వర్గాలుగా విభజించారు: వాటిలో ఒకటి మతపరమైన విషయాలలో అవసరమైన వాటిని బోధించే ఉద్దేశ్యంతో అడగబడే ప్రశ్నలు. ఇది అనుమతించబడినది; మరియు ఙ్ఞానవృద్ధి కొరకు అటువంటి ప్రశ్నలు అడగాలని ఆదేశించబడినది. రెండవది: ఏదైనా విషయానికి సంబంధించి మొండిపట్టుగా, లేదా కపటత్వముతో కూడిన వాదనకు ఒడిగట్టడం – ఇది నిషేధించబడింది.
  4. గతించిన జాతులలో జరిగిన విధంగా, అతిగా ప్రశ్నించడం అనేది తమ ప్రవక్త పట్ల ఆ సమాజం అవిధేయతకు పాల్బడేలా చేస్తుంది అనే హెచ్చరిక ఉన్నది.
  5. నిషేధించబడిన విషయం - పరిమాణంలో తక్కువ దానినీ మరియు ఎక్కువ దానినీ, అన్నింటినీ కలిగి ఉంటుంది. ఎందుకంటే, నిషేధించబడిన విషయాన్ని మొత్తంగా విడిచిపెట్టాలి అంటే అది కొద్ది మోతాదులో ఉన్నా, ఎక్కువ మోతాదులో ఉన్నా సరే దానిని విడిచిపెట్టాలి. ఉదాహరణకు: అల్లాహ్ మనలను రిబా (వ్యాజం) నుండి నిషేధించాడు, అది తక్కువ వడ్డీ అయినా, ఎక్కువ వడ్డీ అయినా ఈ నియమం వర్తిస్తుంది.
  6. నిషిద్ధమైన (హరామ్) వాటికి దారి తీసే కారణాలను కూడా విడిచి పెట్టడం అవసరం; ఎందుకంటే అది కూడా 'దూరంగా ఉండటం' (ఇజ్తినాబ్) అనే అర్థంలో భాగమే.
  7. ఒక వ్యక్తి ప్రవక్త ﷺ ఆజ్ఞను విన్నప్పుడు — "ఇది తప్పనిసరా? లేక అభిలషణీయమా?" అని అనడం తగదు. బదులుగా, ఆ వ్యక్తి వెంటనే ఆ పనిని చేయటానికి త్వరపడాలి. ఎందుకంటే ప్రవక్త ﷺ ఇలా అన్నారు: «మీకు సాధ్యమైనంతవరకు దానిని చేయండి».
  8. అధిక ప్రశ్నలు వినాశనానికి కారణం, ముఖ్యంగా వాటికి జవాబులు పొందలేని ప్రశ్నల విషయాలలో. ఉదాహరణకు, 'అగోచర విషయాలు' మరియు ప్రళయ దినాన పరిస్థితులు ఎలా ఉంటాయనే వాటి గురించి ఎక్కువగా ప్రశ్నలు అడగవద్దు. అలా చేస్తే, మీరు నాశనమవుతారు, మరియు అతిశయోక్తిగా, మితిమీరి ఆలోచించేవారిగా మారిపోతారు.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ ఇండోనేషియన్ బెంగాలీ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం థాయ్ జర్మన్ పష్టో అస్సామీ అల్బేనియన్ الأمهرية الغوجاراتية Қирғизӣ النيبالية الليتوانية الدرية الصربية الطاجيكية Кинёрвондӣ المجرية التشيكية الموري Канада الولوف Озарӣ الأوزبكية الأوكرانية الجورجية المقدونية الخميرية
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
ఇంకా