عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إنَّ اللَّهَ طَيِّبٌ لَا يَقْبَلُ إلَّا طَيِّبًا، وَإِنَّ اللَّهَ أَمَرَ المُؤْمِنِينَ بِمَا أَمَرَ بِهِ المُرْسَلِينَ، فَقَالَ تَعَالَى: {يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنْ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا}، وَقَالَ تَعَالَى: {يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُلُوا مِنْ طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ} ثُمَّ ذَكَرَ الرَّجُلَ، يُطِيلُ السَّفَرَ، أَشْعَثَ، أَغْبَرَ، يَمُدُّ يَدَيْهِ إلَى السَّمَاءِ: يَا رَبِّ! يَا رَبِّ! وَمَطْعَمُهُ حَرَامٌ، وَمَشْرَبُهُ حَرَامٌ، وَمَلْبَسُهُ حَرَامٌ، وَغُذِيَ بِالحَرَامِ، فَأَنَّى يُسْتَجَابُ لَذلك».
[صحيح] - [رواه مسلم] - [الأربعون النووية: 10]
المزيــد ...
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"నిశ్చయంగా, అల్లాహ్ పరమ పరిశుద్ధుడు, మరియు పరిశుద్ధమైన దానిని తప్ప మరేమీ అంగీకరించడు. మరియు అల్లాహ్ విశ్వాసులకు, ప్రవక్తలకు ఆజ్ఞాపించిన దానినే మీకూ ఆజ్ఞాపించాడు."; అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {ఓ ప్రవక్తలారా! పరిశుద్ధమైన వాటిని భుజించండి మరియు మంచి పనులు చేయండి.} (అల్-ముమినూన్: 51); మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {ఓ విశ్వాసులారా! మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన వాటి నుండే భుజించండి.} (అల్-బఖరహ్: 172); ఆ తర్వాత ప్రవక్త ఒక వ్యక్తి గురించి ప్రస్తావించారు: అతను సుదీర్ఘ ప్రయాణం చేయడం వలన అతని వెంట్రుకలు చిందరవందరగా, దుమ్ము పట్టి ఉన్నాయి. అతను తన చేతులను ఆకాశం వైపు చాచి: 'ఓ నా ప్రభూ! ఓ నా ప్రభూ!' అని వేడుకుంటున్నాడు. అయితే, అతని ఆహారం నిషేధించబడినది (హరామ్), అతని పానీయం నిషేధించబడినది, అతని దుస్తులు నిషేధించబడినవి, మరియు అతను నిషేధించబడిన వాటితోనే పోషించబడ్డాడు. అలాంటి వ్యక్తి దుఆ (ప్రార్థన) ఎలా స్వీకరించబడుతుంది?"
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [الأربعون النووية - 10]
ఈ హదీథులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్ధుడు, మరియు పరమ పవిత్రుడు, కొరతలు, లోపాలు మరియు దోషాలు లేనివాడు మరియు పరిపూర్ణతలతో కూడిన సంపూర్ణ గుణగణాలు, లక్షణాలు కలిగిన వాడు. ఆయన మంచిని మరియు పరిశుద్ధమైన వాటిని, మరియు కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ఆచరించిన వాటిని మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గదర్శకానికి అనుగుణంగా ఉన్న వాటిని తప్ప మరి దేనినీ అంగీకరించడు – అవి ఆచరణలైనా, పలుకులైనా లేదా నమ్మకాలైనా. వీటి ద్వారా తప్ప ఎవరూ అల్లాహ్ సామీప్యానికి చేరుకోవాలని కోరుకోరాదు. విశ్వాసి తన ఆచరణలను ఉత్తమమైనవిగా మార్చుకోవడానికి ఉన్న మార్గాలలో ఉత్తమమైనది ఏమిటంటే అతడు తినే ఆహారం పరిశుద్ధమైనదై ఉండడం, అంటే హలాల్ సంపాదన ద్వారా సంపాదించినది మాత్రమే తినడం. అది అతడి ఆచరణలను పరిశుద్ధ పరుస్తుంది. ఆ విధంగా అతడి ఆచరణలు పరిశుద్ధమవుతాయి. కనుక, అల్లాహ్ తాను ప్రవక్తలకు, సందేశహరులకు ఏదైతే ఆదేశించినాడో, దానినే విశ్వాసుల కొరకు కూడా ఆదేశించినాడు: ధర్మసమ్మతమైన దానిని (హలాల్) మాత్రమే తినండి మరియు మంచి పనులు చేయండి’ అని. అల్లాహ్ ప్రకటన, { يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا ۖ إِنِّي بِمَا تَعْمَلُونَ عَلِيمٌ } [ఓ సందేశహరులారా! పరిశుద్ధమైన వాటినే తినండి మరియు సత్కార్యాలు చేయండి. 17 నిశ్చయంగా, మీరు చేసేదంతా నాకు బాగా తెలుసు. సూరహ్ అల్ ము’మినూన్ 23:51]; మరియు అల్లాహ్ ప్రకటన: { يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ} [ఓ విశ్వాసులారా! మీరు నిజంగానే కేవలం ఆయన (అల్లాహ్)నే ఆరాధించేవారు అయితే; మేము మీకు జీవనోపాధిగా ఇచ్చిన పరిశుద్ధ (ధర్మసమ్మత)మైన వాటినే తినండి, సూరహ్ అల్ బఖరహ్ 2:172]
ఇంకా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హరాం (ధర్మ విరుద్ధమైనది) తినరాదని హెచ్చరించినారు. అది ఆచరణలను నాశనం చేస్తుంది. అది ఆచరణలు (అల్లాహ్ వద్ద) స్వీకరించబడడాన్ని నిరోధిస్తుంది; ఆ బాటసారి ఆమోదయోగ్యమైన స్పష్టమైన మార్గాలను ఉపయోగించినప్పటికీ అతని ఆచరణలు ఆమోదయోగ్యం కావు: ఉదాహరణకు:
మొదటిది: (అల్లాహ్’కు) విధేయతను చూపే వాటిని ఆచరించుటకు అతడు ఎంత దూరం ప్రయాణించినా, అంటే హజ్ చేయడం, జిహాద్ లో పాల్గొనడం, అలాగే బంధుత్వాలను గౌరవించడం, వాటిని నిభాయించడం మొదలైనవి చేసినా, చేస్తూ ఉన్నా.
రెండవది: తల వెంట్రుకలను దువ్వుకోకపోవడం వల్ల చిందరవందరగా ఉన్న వెంట్రుకలు, దుమ్ము కారణంగా రంగు మారిన చర్మం మరియు అతని ఒంటిపై బట్టలు కూడా రంగు మారి, అతను నిస్సహాయంగా దీనస్థితిలో ఉన్నాడు.
మూడవది: అతడు తన రెండు చేతులను ఆకాశం వైపునకు ఎత్తి దుఆ చేయడం.
నాల్గవది: అల్లాహ్’ను ఆయన పేర్ల ద్వారా పట్టుదలతో వేడుకొనడం: “ఓ నా ప్రభూ! ఓ నా ప్రభూ!” అంటూ.
ఈ విధంగా ప్రార్థనలకు జవాబు లభించటానికి ఆవశ్యకమైన అన్ని మార్గాలు ఉన్నప్పటికీ, అతడికి ఏ సమాధానమూ లభించ లేదు; ఎందుకంటే అతని ఆహారం, పానీయం మరియు బట్టలు హరాం (అక్రమమైనవి), మరియు అతడు హరాం (ధర్మ విరుద్ధమైన, అక్రమమైన వాటి) ద్వారా పోషించబడ్డాడు. ఈ హదీథులో వర్ణించబడినటువంటి వ్యక్తి విన్నపానికి, అతని వేడుకోలుకు సమాధానం లభించడం దాదాపుగా అసంభవం; దానికి ఎలా సమాధానం లభిస్తుంది?