عَنْ أَبِي مُـحَمَّدٍ الحَسَنِ بْنِ عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ - سِبْطِ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَرَيْحَانَتِهِ-، قَالَ: حَفِظْتُ مِنْ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«دَعْ مَا يَرِيبُك إلَى مَا لَا يَرِيبُكَ».
[صحيح] - [رواه الترمذي والنسائي] - [الأربعون النووية: 11]
المزيــد ...
అబూ ముహమ్మద్ అల్-హసన్ ఇబ్నె అలీ ఇబ్నె అబూ తాలిబ్ - రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మనుమడు మరియు ఆయనకు ఇష్టమైనవాడు - నుండి ఉల్లేఖన: నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇది కంఠస్థం చేసుకున్నాను:
"ఏది నీకు సందేహాన్ని కలిగిస్తుందో, దానిని వదిలిపెట్టి, ఏది నీకు సందేహాన్ని కలిగించదో, దానిని ఆచరించు."
-
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు: మాటలలో లేదా పనులలో, ఏది నిషిద్ధమైనదా కాదా, హరామా (నిషేధించబడినదా) లేదా హలాలా (ధర్మసమ్మతమైనదా) అని నీకు సందేహం కలిగించే వాటిని విడిచిపెట్టి, ఏది ఉత్తమమైనదని మరియు ధర్మసమ్మతమైనదని నీవు నిశ్చయించుకున్నావో, దానిని ఆచరించు.