కూర్పు:
+ -

عَنْ أُمِّ المُؤْمِنِينَ أُمِّ عَبْدِ اللَّهِ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا، قَالَتْ: قَالَ: رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّم:
«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ». وَفِي رِوَايَةٍ لِمُسْلِمٍ: «مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ».

[صحيح] - [رواه البخاري ومسلم] - [الأربعون النووية: 5]
المزيــد ...

ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఎవరైనా మన ఈ ధర్మంలో (ఇస్లాం) భాగం కాని ఏదైనా కొత్త విషయాన్ని ప్రవేశపెడితే, అది తిరస్కరించబడుతుంది."

[దృఢమైనది] - [رواه البخاري ومسلم] - [الأربعون النووية - 5]

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతున్నారు: ఎవరైనా ఈ ధర్మములో (ఇస్లాంలో) ఏదైనా కొత్త విషయాన్ని సృష్టించినట్లయితే, లేదా ఖుర్’ఆన్ మరియు సున్నత్’లలో ప్రామాణికము లేని ఏదైనా ఆచరణను ఆచరించినా, అది ఈ ధర్మము యొక్క యజమాని (అల్లాహ్) చే తిరస్కరించబడుతుంది, మరియు ఆయన వద్ద (అల్లాహ్ వద్ద) అది ఆమోదయోగ్యము కాదు.

من فوائد الحديث

  1. ఇస్లాంలో ఏ ఆరాధనైనా (ఇబాదత్ ఐనా) ఖుర్’ఆన్ మరియు సున్నత్’లో పేర్కొనబడిన విధానం పైనే ఆధారపడి ఉంటుంది. కనుక మనం సర్వోన్నతుడైన అల్లాహ్ ను ఆయన ఆదేశించిన విధంగానే ఆరాధిస్తాము. అంతే గానీ, ఖుర్’ఆన్ మరియు సున్నత్ లలో పేర్కొనబడని విధంగా లేదా కొత్తగా సృష్టించబడిన కల్పిత ఆరాధనల ద్వారా ఆయనను ఆరాధించము.
  2. ధర్మము (ఇస్లాం) "అభిప్రాయాలపై మరియు ‘ఈ విధంగా ఆరాధించడం మంచిది’ అని లేదా ‘ఈ పద్ధతిలో ఆరాధించడం కూడా సరైనదే’ అని భావించడం" మొదలైన వాటిపై ఆధారపడి ఉండదు. ధర్మము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించి చూపిన విధానంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.
  3. ఇస్లాం ధర్మం పరిపూర్ణమైన ధర్మమని ఈ హదీథు నిరూపిస్తున్నది (పరిపూర్ణమైన దానిలోనికి మరింకే కొత్త విషయం లేక విధానం యొక్క అవసరం ఉండదు).
  4. “బిద్’అత్” అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలములో గానీ లేక ఆయన సహాబాల కాలములో గానీ ఇస్లాం లో లేని విషయమూ, ఆ తరువాత అందులోనికి కొత్తగా ప్రవేశపెట్టబడిన ప్రతి విషయమూ “బిద్’అత్” అనబడుతుంది; అది విశ్వాసానికి సంబంధించిన కొత్త విషయం గానీ, లేక ధర్మానికి సంబంధించి కొత్త పలుకులు, మాటలు, పదాలు గానీ, లేక కొత్త ఆచరణలు గానీ.
  5. ఈ హదీసు ఇస్లాం యొక్క మూలస్థంభాల వంటి నియమాలలో ఒకటి – అది ఇస్లాం లో ఆచరణలకు సంబంధించి ఒక త్రాసు (మీజాన్) వంటిది. ఏ ఆచరణైనా అది కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత, మరియు ఆయన సామీప్యము పొందుట కొరకు మాత్రమే సంకల్పించబడినదై ఉండాలి. అలా కాకపోయినట్లయితే ఆచరించిన వానికి దాని పుణ్యఫలములో ఏమీ లభించదు. అదే విధంగా ఏ ఆచరణైనా అది రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించి చూపిన విధానానికి అనుగుణంగా ఉండాలి. అలా కాకపోయినట్లయితే అది ఆచరించిన వాని పైనే త్రిప్పి కొట్టబడుతుంది అంటే తిరస్కరించబడుతుంది.
  6. ఈ హదీథు, ధర్మంలో కొత్తగా కల్పించబడిన బిద్అత్‌లను మరియు తప్పుడు పనులను తిరస్కరించడానికి ఒక ప్రాథమిక నియమం (ఆధారం) గా నిలుస్తుంది.
  7. ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే – కొత్త విషయాలు నిషేధము అంటే, అది ధర్మానికి చెందిన కొత్త విషయాలు అని. అంతే కాని ఈ ప్రపంచానికి సంబంధించిన కొత్త విషయాలు నిషేధము అని కాదు అర్థము.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ ఇండోనేషియన్ బెంగాలీ టర్కిష్ రష్యన్ బోస్నియన్ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం థాయ్ జర్మన్ పష్టో అస్సామీ అల్బేనియన్ الأمهرية الغوجاراتية Қирғизӣ النيبالية الدرية الصربية الطاجيكية Кинёрвондӣ المجرية التشيكية الموري Канада الولوف Озарӣ الأوزبكية الأوكرانية الجورجية المقدونية الخميرية
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
ఇంకా