عَنْ أَبِي يَعْلَى شَدَّادِ بْنِ أَوْسٍ رَضِيَ اللَّهُ عَنْهُ عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ اللهَ كَتَبَ الْإِحْسَانَ عَلَى كُلِّ شَيْءٍ، فَإِذَا قَتَلْتُمْ فَأَحْسِنُوا القِتْلَةَ، وَإِذَا ذَبَحْتُمْ فَأَحْسِنُوا الذِّبْحَةَ، وَلْيُحِدَّ أَحَدُكُمْ شَفْرَتَهُ، وَلْيُرِحْ ذَبِيحَتَهُ».
[صحيح] - [رواه مسلم] - [الأربعون النووية: 17]
المزيــد ...
అబూ యఅ'లా షద్దాద్ ఇబ్నె ఔస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
"నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి విషయంలోనూ 'ఇహ్సాన్' (ఉత్తమంగా, దయతో వ్యవహరించడం) ను విధిగా చేశాడు. కాబట్టి, మీరు చంపినట్లయితే, మంచి పద్ధతిలో చంపండి అంటే మీరు జంతువు ఖుర్బానీ చేసేటప్పుడు, మంచి పద్ధతిలో ఖుర్బానీ చేయండి. మీలో ప్రతి ఒక్కరూ తన కత్తిని బాగా పదును పెట్టుకోవాలి మరియు తన ఖుర్బానీ జంతువుకు ఉపశమనం కలిగించాలి (మొండి కత్తి వలన ఖుర్బానీ సమయంలో జంతువుకు కష్టం కలిగించకూడదు)."
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [الأربعون النووية - 17]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు – ‘ప్రతి విషయంలోనూ ‘అల్ ఇహ్’సాన్’ కలిగి ఉండడాన్ని అల్లాహ్ మనపై విధిగావించినాడు. (అల్ ఇహ్’సాన్: అంటే, ఉచితమైన స్థాయి కంటే కూడా ఎక్కువగా కరుణ కలిగి ఉండుట అనే అర్థం ఉన్నది). అది (అల్ ఇహ్’సాన్) అల్లాహ్ పట్ల అన్ని వేళలా చేతన కలిగి ఉండుట, ఆయన ఆరాధనలలో, అన్ని వేళలా మంచిని చేయటలో, దాతృత్వ గుణాన్ని కలిగి ఉండుటలో, అల్లాహ్ సృష్టితాలకు నష్టం కలిగించకుండా ఉండుట - మొదలైన విషయాలలో చేతన కలిగి ఉండుట ద్వారా సాధించ బడుతుంది. అదే విధంగా ‘అల్ ఇహ్’సాన్’ కలిగి ఉండ వలసిన విషయాలలో, ఏదైనా ప్రాణం తీయుట మరియు అల్లాహ్ పేరున జిబహ్ చేయుట కూడా ఉన్నాయి.
అల్’ఖిసాస్ విషయంలో ‘అల్ ఇహ్’సాన్’ పాటించుట: (అల్ ఖిసాస్ – అంటే షరియత్ ప్రకారం ‘ప్రాణానికి ప్రాణము’ అనే నియమం క్రింద, హతుని కుటుంబము క్షమాభిక్ష ప్రసాదించక పోతే, హంతకునికి విధించబడే మరణ శిక్ష): ఆ సందర్భములో హంతకునికి కష్టము, బాధ కలుగకుండా, తేలికగా, అత్యంత వేగంగా అతని ప్రాణం పోయే విధానాన్ని ఎంచుకోవడం.
అల్లాహ్ పేరున జంతువు జిబహ్ చేయ బడునప్పుడు ‘అల్ ఇహ్’సాన్’ పాటించుట: జిబహ్ చేయబడే జంతువు ఎదురుగా (అది చూస్తుండగా) కత్తిని పదును చేయరాదు మరియు ( మందలోని) ఇతర జంతువులు చూస్తుండగా జిబహ్ చేయరాదు.