عَنْ أَبِي العَبَّاسِ، عَبْدِ الله بْنِ عَبَّاسٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ: كُنْت خَلْفَ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَوْمًا، فَقَالَ:
«يَا غُلَامِ! إنِّي أُعَلِّمُك كَلِمَاتٍ: احْفَظِ اللَّهَ يَحْفَظْكَ، احْفَظِ الله تَجِدْهُ تُجَاهَكَ، إذَا سَأَلْتَ فَاسْأَلِ اللهَ، وَإِذَا اسْتَعَنْتَ فَاسْتَعِنْ بِاَللهِ، وَاعْلَمْ أَنَّ الأُمَّةَ لَوْ اجْتَمَعَتْ عَلَى أَنْ يَنْفَعُوكَ بِشَيْءٍ لَمْ يَنْفَعُوكَ إلَّا بِشَيْءٍ قَدْ كَتَبَهُ اللَّهُ لَكَ، وَإِنِ اجْتَمَعُوا عَلَى أَنْ يَضُرُّوكَ بِشَيْءٍ لَمْ يَضُرُّوكَ إلَّا بِشَيْءٍ قَدْ كَتَبَهُ اللَّهُ عَلَيْكَ؛ رُفِعَتِ الأَقْلَامُ، وَجَفَّتِ الصُّحُفُ».
وَفِي رِوَايَةِ غَيْرِ التِّرْمِذِيِّ: «احْفَظِ اللهَ تَجِدْهُ أَمَامَكَ، تَعَرَّفْ إلَى اللهِ فِي الرَّخَاءِ يَعْرِفْكَ فِي الشِّدَّةِ، وَاعْلَمْ أَنَّ مَا أَخْطَأَكَ لَمْ يَكُنْ لِيُصِيبَكَ، وَمَا أَصَابَك لَمْ يَكُنْ لِيُخْطِئَكَ، وَاعْلَمْ أَنَّ النَّصْرَ مَعَ الصَّبْرِ، وَأَنْ الفَرَجَ مَعَ الكَرْبِ، وَأَنَّ مَعَ العُسْرِ يُسْرًا».
[صحيح] - [رواه الترمذي وغيره] - [الأربعون النووية: 19]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, ఒకరోజు నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక ఉన్నాను. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
"ఓ బాలుడా! నేను నీకు కొన్ని విషయాలు బోధిస్తాను: అల్లాహ్ ను (ఆదేశాలను పాటించడం, ఆయన హక్కులను గౌరవించడం) సంరక్షించు, ఆయన నిన్ను సంరక్షిస్తాడు. అల్లాహ్ ను (ఆదేశాలను) సంరక్షించు, ఆయన నీతో పాటే ఉన్నట్లు నీవు కనుగొంటావు. నీవు ఏదైనా అడగాలనుకుంటే, తిన్నగా అల్లాహ్ నే అడుగు. నీవు సహాయం కోరాలనుకుంటే, తిన్నగా అల్లాహ్ ను మాత్రమే సహాయం కోరు. మరియు తెలుసుకో! ఈ జాతి మొత్తం నీకు ఏదైనా మేలు చేయాలని ఏకమైనా, అల్లాహ్ నీకు వ్రాసి పెట్టిన మేలును తప్ప వారు నీకు ఏ మేలూ చేయలేరు. మరియు వారు నీకు ఏదైనా కీడు చేయాలని ఏకమైనా, అల్లాహ్ నీకు వ్రాసి పెట్టిన కీడును తప్ప వారు నీకు ఏ కీడు చేయలేరు. కలములు ఎత్తబడ్డాయి మరియు వ్రాతలు ఆరిపోయాయి."
-
ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా తెలియజేశారు: నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో కలిసి ఒక వాహనంపై ఉన్నాను. అప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు: "నేను నీకు కొన్ని విషయాలను, కొన్ని అంశాలను బోధిస్తాను, వాటి ద్వారా అల్లాహ్ నీకు ప్రయోజనం చేకూరుస్తాడు." అల్లాహ్ యొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా మరియు ఆయన నిషేధాల నుండి దూరంగా ఉండడం ద్వారా అల్లాహ్ ను సంరక్షించు. తద్వారా ఆయన నిన్ను విధేయతలలో మరియు సాన్నిధ్యంలో కనుగొంటాడు, కానీ పాపాలలో మరియు అపరాధాలలో కనుగొనడు. నీవు అలా చేస్తే, దాని ప్రతిఫలంగా అల్లాహ్ నిన్ను ఈ లోకంలోని మరియు పరలోకంలోని కష్టాల నుండి సంరక్షిస్తాడు మరియు నీవు ఎక్కడ వెళ్ళినా నీ ముఖ్యమైన పనులలో నీకు సహాయం చేస్తాడు. "మరియు నీవు ఏదైనా అడగాలని కోరితే, అల్లాహ్ ను మాత్రమే అడుగు. ఎందుకంటే కేవలం ఆయన మాత్రమే అడిగేవారికి సమాధానం ఇచ్చేవాడు." "మరియు నీవు ఎవరి సహాయాన్ని అయినా కోరాలనుకుంటే, కేవలం అల్లాహ్ ను మాత్రమే (సహాయం) కోరు." "మీకు ఒక ప్రయోజనం చేకూర్చాలని భూమిపై ఉన్న వారందరూ ఏకమైనా సరే, అల్లాహ్ దానిని మీకు వ్రాసి పెట్టి ఉంటే తప్ప మీ కొరకు ఏమీ చేయలేరు; మరియు మీకు ఒక హాని చేయాలని భూమిపై ఉన్న వారందరూ ఏకమైనా సరే, అల్లాహ్ దానిని మీపై నిర్ణయించి ఉంటే తప్ప, మీకు ఎలాంటి హానీ కలిగించలేరు" అని మీరు నిశ్చయంగా విశ్వసించాలి. "మరియు ఈ విషయం అల్లాహ్ చేత, ఆయన జ్ఞానం మరియు వివేచనకు అనుగుణంగా వ్రాయబడింది మరియు నిర్ణయించబడింది. అల్లాహ్ వ్రాసిన దానిని మార్చడం ముమ్మాటికీ అసాధ్యం." అల్లాహ్ యొక్క ఆజ్ఞలను పాటించడం మరియు ఆయన నిషేధాల నుండి దూరంగా ఉండటం ద్వారా ఎవరైతే అల్లాహ్ ను సంరక్షిస్తారో, నిశ్చయంగా అల్లాహ్ తన దాసుడికి ఎదురుగా ఉండి, అతనికి ఏమి జరుగుతుందో తెలుసుకుంటాడు, అతనికి సహాయం చేసి మద్దతు ఇస్తాడు. ఒక వ్యక్తి సుఖసమయాలలో అల్లాహ్ కు విధేయత చూపితే, అల్లాహ్ కష్టసమయాలలో అతనికి ఉపశమనాన్ని, ఒక మార్గాన్ని కల్పిస్తాడు. ప్రతి దాసుడు అల్లాహ్ తనకు నిర్ణయించిన మంచి మరియు చెడు పట్ల సంతృప్తి చెందాలి. కష్టాలు మరియు పరీక్షలు వచ్చినప్పుడు, దాసుడు సహనంతో ఉండాలి, ఎందుకంటే సహనం ఉపశమనానికి తాళం చెవి. కష్టం తీవ్రమైనప్పుడు, అల్లాహ్ నుండి ఉపశమనం వస్తుంది. మరియు కష్టం వచ్చినప్పుడు, అల్లాహ్ దాని తర్వాత సుఖాన్ని కలుగజేస్తాడు.