____
[] - []
المزيــد ...
అబూ మస్ఊద్ ఉఖ్'బహ్ ఇబ్నె అమర్ అల్ అన్సారీ అల్ బద్'రియ్యి రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ప్రాచీన ప్రవచనాల నుండి ప్రజలు నేర్చుకున్న విషయాలలో ఒకటి: “(ఆ పనిలో) సిగ్గు, అవమానం ఏమీ లేకపోయినట్లైతే, మీకు నచ్చినది చేయండి.”
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [الأربعون النووية - 20]
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: పూర్వపు ప్రవక్తల ఆదేశాలను ప్రజలు తమలో తాము వ్యాపింపజేసుకునేవారు; ఆ విధంగా అవి శతాబ్దాల తరబడి ఒక శతాబ్దం తరువాత మరొక శతాబ్దానికి తరువాతి తరాల వారికి వారసత్వంగా సంక్రమిస్తూ వచ్చేవి; చివరికి అవి ఈ ఉమ్మత్ యొక్క తొలితరం వారికి చేరాయి; వాటిలో ఒకటి: ముందుగా నీవు ఏమి చేయాలనుకుంటున్నావో చూడు; అది అవమానకరమైనది, సిగ్గుపడవలసినది కానట్లైతే, అపుడు ఆ పని చేయి; ఒకవేళ అది అవమానకరమైనది, సిగ్గుపడవలసిన పని అయినట్లైతే దానిని వదిలివేయి; ఎందుకంటే అవమానకరమైన పనుల నుండి మనలను నిరోధించేది సచ్ఛీలత, మరియు అణకువ. కనుక అణకువ మరియు సచ్ఛీలత లేని వారు ప్రతి అశ్లీల కార్యములో మరియు ప్రతి చెడులో, ప్రతి దుష్కర్మలో మునిగి పోతారు.