عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«الدُّنْيَا سِجْنُ الْمُؤْمِنِ وَجَنَّةُ الْكَافِرِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2956]
المزيــد ...
అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఈ ప్రపంచము విశ్వాసి కొరకు ఒక జైలు వంటిది; మరియు అవిశ్వాసి కొరకు ఒక స్వర్గము వంటిది.”
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم - 2956]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు: విశ్వాసికి ఈ ప్రాపంచిక జీవితం జైలు లాంటిది, ఎందుకంటే అతడు షరియత్’లో ఆదేశించబడిన వాటిని చేయడం మరియు నిషేధించబడిన వాటిని నివారించడం, వాటి నుండి దూరంగా ఉండడం అనే ధార్మికపరమైన బాధ్యతలకు కట్టుబడి ఉంటాడు. అతను మరణించినప్పుడు, దీని నుండి విముక్తి పొంది, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అతని కోసం సిద్ధం చేసిన శాశ్వత ఆనందానికి మరలుతాడు. అవిశ్వాసికి ఈ ప్రపంచం స్వర్గం లాంటిది, ఎందుకంటే అందులో అతను తన మనసు కోరినది చేస్తాడు మరియు తన మనోభావాలు, వాంఛలు, కోరికలు అతనికి ఏమి ఆజ్ఞాపిస్తాయో అది చేస్తాడు. అతను మరణించినప్పుడు, పునరుత్థాన దినమున సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అతని కోసం సిద్ధం చేసిన శాశ్వత నరక శిక్షలోనికి విసిరి వేయబడతాడు.