عَنْ سَلْمَانَ الْفَارِسِيِّ رَضيَ اللهُ عنه قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«ثَلَاثَةٌ لَا يُكَلِّمُهُمُ اللَّهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ: أُشَيْمِطٌ زَانٍ، وَعَائِلٌ مُسْتَكْبِرٌ، وَرَجُلٌ جَعَلَ اللَّهَ لَهُ بِضَاعَةً، فَلَا يَبِيعُ إِلَّا بِيَمِينِهِ وَلَا يَشْتَرِي إِلَّا بِيَمِينِهِ».
[صحيح] - [رواه الطبراني] - [المعجم الصغير: 821]
المزيــد ...
సల్మాన్ అల్ ఫార్సీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మూడు రకాల వ్యక్తులతో అల్లాహ్ పునరుత్థాన దినమున మాట్లాడడు, వారిని శుద్ధి చేయడు, మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది: వృద్ధుడైన వ్యక్తి వ్యభిచారానికి పాల్బడినట్లైతే, పేదవాడైన వ్యక్తి అహంకారిగా ఉంటే, మరియు ఆ వ్యక్తి, ఎవరికైతే అల్లాహ్ వర్తక సామాగ్రిని ఇచ్చినాడో – అతడు కొన్నా ‘అల్లాహ్ మీద ఒట్టు’ అని, అమ్మినా ‘అల్లాహ్ మీద ఒట్టు’ అని వర్తకం చేస్తాడు.
[ప్రామాణికమైన హదీథు] - [అత్తబ్రానీ నమోదు చేసినారు:] - [సంక్షిప్త నిఘంటువు - 821]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో మూడు రకాల వ్యక్తులను గురించి తెలియజేసినారు: వారు పశ్చాత్తాప పడకపోయినా లేక క్షమించబడక పోయినా పునరుత్థాన దినమున అల్లాహ్ యొక్క మూడు శిక్షలకు పాత్రులవుతారు. మొదటిది: అల్లాహ్ తన తీవ్రమైన కోపం కారణంగా పునరుత్థాన దినాన వారితో మాట్లాడడు. పైగా ఆయన వారి నుండి దూరంగా ఉంటాడు లేదా ఆయన వారితో వారికి నచ్చని విధంగా మాట్లాడి వారి పట్ల తనకున్న అసంతృప్తిని సూచిస్తాడు. రెండవది: ఆయన వారిని స్తుతించడు, పొగడడు, మరియు వారి పాపాలను కడిగివేయడు. మూడవది: వారు పరలోకంలో కఠినమైన మరియు బాధాకరమైన శిక్షను అనుభవిస్తారు. ఆ మూడు రకాల వ్యక్తులు వీరే: మొదటి రకం: వ్యభిచారానికి పాల్బడిన వృద్ధుడు. రెండవది: సంపద లేకపోయినా ప్రజల పట్ల అహంకారంతో ఉండే పేదవాడు. మూడవది: కొనేటప్పుడు మరియు అమ్మేటప్పుడు తరచుగా అల్లాహ్ పై ప్రమాణం చేసేవాడు (అల్లాహ్ మీద ఒట్టు అనుట), తద్వారా అల్లాహ్ పేరును దిగజార్చేవాడు, కించపరిచేవాడు మరియు దానిని ధనం సంపాదించడానికి ఒక మాధ్యమంగా ఉపయోగించేవాడు.