عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«أَلْحِقُوا الفَرَائِضَ بِأَهْلِهَا، فَمَا بَقِيَ فَلِأَوْلَى رَجُلٍ ذَكَرٍ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6737]
المزيــد ...
ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
నిర్దిష్ట వారసులకు వారి వారసత్వ భాగం (ఫరైద్) ముందుగా కేటాయించండి. (వారసత్వ పంపకాల తరువాత) మిగిలిన సంపత్తి అత్యంత సమీప పురుష వారసునికి (అసబా) చెందుతుంది.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 6737]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారసత్వ ఆస్తిని పంచేవారికి, సర్వోన్నతుడైన అల్లాహ్ కోరిన విధంగా, న్యాయమైన మరియు ధార్మికమైన పద్ధతిలో, దానికి అర్హులైన వారికి పంచాలని ఆజ్ఞాపిస్తున్నారు. అందువలన, నిర్ణీత వాటాలు (ఫురూద్) కలిగిన వారికి అల్లాహ్ గ్రంథంలో నిర్దేశించిన వారి వాటాలు ఇవ్వబడతాయి. అవి: రెండు-మూడు వంతులు (2\3), మూడవ వంతు (1\3), ఆరవ వంతు (1\6), సగం (1\2), నాలుగవ వంతు (1\4), మరియు ఎనిమిదవ వంతు (1\8). ఆ తర్వాత ఏది మిగిలి ఉన్నా, అది మరణించిన వ్యక్తికి అత్యంత దగ్గర సంబంధం కలిగి ఉన్న పురుషులకు ఇవ్వబడుతుంది, మరియు వారిని 'అస్బా' (Residuaries) అని అంటారు.