عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضيَ اللهُ عنه قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَمَّا عُرِجَ بِي مَرَرْتُ بِقَوْمٍ لَهُمْ أَظْفَارٌ مِنْ نُحَاسٍ يَخْمُشُونَ بها وُجُوهَهُمْ وَصُدُورَهُمْ، فَقُلْتُ: مَنْ هَؤُلَاءِ يَا جِبْرِيلُ، قَالَ: هَؤُلَاءِ الَّذِينَ يَأْكُلُونَ لُحُومَ النَّاسِ، وَيَقَعُونَ فِي أَعْرَاضِهِمْ».
[حسن] - [رواه أبو داود] - [سنن أبي داود: 4878]
المزيــد ...
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“(ఇస్రా మరియు మేరాజ్ నాటి రాత్రి) నన్ను ఆకాశాలలోనికి తీసుకు వెళ్ళినపుడు (నరకములో) రాగి గోళ్ళను కలిగి ఉండి వాటితో ముఖాలను, చాతీలను చీలికలు అయ్యేలా గీరుకుంటూ ఉన్న వారి గుంపును దాటుకుంటూ వెళ్ళినాను. నేను ఇలా అడిగినాను: “ఓ జిబ్రయీల్! ఎవరు వీళ్ళు?” దానికి ఆయన ఇలా జవాబిచ్చినారు: “వీరు మనుషుల మాంసం తినడంతో సమానమైన చర్యలైన 'ప్రజల వీపు వెనుక (వారి పరోక్షంలో) వారి గురించి చెడుగా మాట్లాడుట, వారిపై అపనిందలు వేయుట' చేసేవారు.”
[హసన్ హదీథు] - [అబూదావూద్ నమోదు చేసినారు:] - [సునన్ అబీదావూద్ - 4878]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్రా మరియు మే’రాజ్ యాత్రలో స్వర్గనరకాల దర్శనానికి తీసుకు వెళ్ళబడినపుడు, రాగి గోళ్ళు కలిగి ఉండి వాటితో ముఖాలను, మరియు ఛాతీలను, అవి చీలికలు అయ్యేలా గోక్కుంటూ ఉన్న వ్యక్తులను దాటుకుంటూ వెళ్ళడం జరిగింది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాంను ఇలా అడిగారు: “ఓ జిబ్రయీల్! ఏమి చేసినందుకు వీరు ఈ శిక్షకు అర్హులైనారు?” జిబ్రీల్ అలైహిస్సలాం) ఇలా జవాబిచ్చారు: “వీరు ప్రజల గురించి వారి వీపు వెనుక చెడుగా మాట్లాడేవారు, వారిపై అపనిందలు మోపేవారు మరియు వారి గౌరవానికి భంగం కలిగించేవారు.”