عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ رضي الله عنهما أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«أُعْطِيتُ خَمْسًا لَمْ يُعْطَهُنَّ أَحَدٌ قَبْلِي: نُصِرْتُ بِالرُّعْبِ مَسِيرَةَ شَهْرٍ، وَجُعِلَتْ لِي الأَرْضُ مَسْجِدًا وَطَهُورًا، فَأَيُّمَا رَجُلٍ مِنْ أُمَّتِي أَدْرَكَتْهُ الصَّلاَةُ فَلْيُصَلِّ، وَأُحِلَّتْ لِي المَغَانِمُ، وَلَمْ تَحِلَّ لِأَحَدٍ قَبْلِي، وَأُعْطِيتُ الشَّفَاعَةَ، وَكَانَ النَّبِيُّ يُبْعَثُ إِلَى قَوْمِهِ خَاصَّةً وَبُعِثْتُ إِلَى النَّاسِ عَامَّةً».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 335]
المزيــد ...
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
“నాకంటే ముందు ఎవరికీ ప్రసాదించబడని ఐదు (ప్రత్యేకతలు) నాకు ప్రసాదించబడినాయి. నాకు ఒక నెల ప్రయాణం దూరం నుండి (శత్రువులలో) భయోత్పాతం ద్వారా విజయం ప్రసాదించబడింది; భూమి నాకు మస్జిదుగానూ మరియు శుద్ధి పొందే స్థలంగానూ చేయబడింది. కనుక నా ఉమ్మత్’కు చెందిన వ్యక్తి నమాజు సమయం అయినపుడు అతడు సమయానికి నమాజు ఆచరించాలి, యుద్ధములో గెలువబడిన సంపద (యుద్ధప్రాప్తి) నా కొరకు ధర్మసమ్మతం (హలాల్) చేయబడింది, నాకు పూర్వం ఎవరికీ అది ధర్మసమ్మతం కానప్పటికీ; (తీర్పు దినమునాడు) సిఫారసు చేసే అవకాశం నాకు ప్రసాదించబడింది; ప్రవక్తలు, సందేశహరులు ప్రత్యేకంగా తమ జాతివారి కొరకు మాత్రమే పంపబడేవారు, మరియు నేను ప్రజలందరి కొరకు (అల్లాహ్ యొక్క) సందేశహరునిగా పంపబడినాను.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 335]
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: నిశ్చయంగా తనకు పూర్వం ఏ ప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేకతలను అల్లాహ్ తనకు ప్రసాదించినాడు.
మొదటిది: నాకు మరియు వారికి మధ్య ఒక నెల ప్రయాణమంత దూరం ఉన్నప్పటికీ, (నా గురించి) శత్రువుల హృదయాలలో జనించే భయోత్పాతం ద్వారా నాకు సహాయం చేయబడింది.
రెండవది: భూమి మనకు మస్జిదుగా (ప్రార్థనా స్థలంగా) చేయబడింది, దాని కారణంగా మనం ఎక్కడ ఉన్నా నమాజు చేయవచ్చు మరియు భూమి, నీరు లభ్యం కానప్పుడు ధూళితో శుద్ధి చేసే సాధనంగా కూడా చేయబడింది.
మూడవది: యుద్ధ ప్రాప్తి, అంటే అవిశ్వాసులతో జరిగే యుద్ధములలో గెలిచే సంపద, మన కొరకు ధర్మసమ్మతం చేయబడింది. ముస్లిములు అటువంటి సంపదను తీసుకోవచ్చును.
నాలుగవది: పునరుత్థాన దినమునాడు భయోత్పాతంలో కొట్టుమిట్టాడుతు నిలుచుని ఉన్న ప్రజలకు ఊరటనిచ్చేలా గొప్ప సిఫారసు చేసే అవకాశం ప్రసాదించబడింది.
ఐదవది: నేను సృష్టితాలన్నింటి కొరకు, మానవులకొరకు మరియు జిన్నుల కొరకు (అల్లాహ్ యొక్క సందేశహరునిగా) పంపబడినాను. నాకు పూర్వం పంపబడిన ప్రవక్తలు ప్రత్యేకించి వారి వారి జాతుల కొరకు పంపబడినారు.