ఉప కూర్పులు

హదీసుల జాబితా

1. ఎవరైతే కేవలం అల్లాహ్ కొరకు హజ్ చేస్తారో, అందులో (తన భార్యతో) లైంగిక చర్యలకు మరియు అశ్లీల సంభాషణలకు, చెడు పనులకు పాల్బడడో – అతడు తన తల్లి తనకు జన్మనిచ్చిన దినము వలే తిరిగి వస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
2. “పెద్ద పాపములలోకెల్లా అతి పెద్ద పాపములు ఏమిటో మీకు తెలుపనా? - 6 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
3. “ఒక వ్యక్తి తన తోటి సోదరుడిని ప్రేమిస్తున్నట్లయితే, ఆ వ్యక్తి తను ప్రేమిస్తున్న విషయాన్ని అతనికి తెలియ జేయాలి”
عربي ఇంగ్లీషు ఉర్దూ
4. “అల్-కబాయిర్ (ఘోరమైన పాపములు, పెద్ద పాపములు) ఏమిటంటే: అల్లాహ్ కు సాటి కల్పించుట (అల్లాహ్ కు సరిసమానులు చేయుట), తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుట, హత్య చేయుట మరియు ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధపు సాక్ష్యము చెప్పుట.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
5. “మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ఇలా విధేయతా ప్రతిజ్ఞ చేసినాము – కష్టకాలంలోనూ, సుఖసమయంలోనూ, శక్తివంతులుగా ఉన్న సమయంలోనూ, బలహీనులుగా ఉన్న సమయంలోనూ, మాపై మరొకరికి ప్రాధాన్యత ఇవ్వబడిన సందర్భంలోనూ - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
6. “భోజనము వడ్డించి, తయారుగా ఉన్న సమయాన సలాహ్ (నమాజు) ఆచరించరాదు, లేదా కాలకృత్యములు తీర్చుకోవలసిన తీవ్రమైన అవసరం ఉన్నపుడు కూడా సలాహ్ (నమాజు) ఆచరించరాదు.” - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
7. “శుక్రవారము నాడు ఇమాం ఖుత్బా ప్రసంగము ఇస్తూ ఉండగా, నీవు నీ ప్రక్కన కూర్చుని ఉన్న తోటివాడిని “మౌనంగా ఉండు” అని అంటే నీవు పెద్ద పొరపాటు చేసినవాడవు అవుతావు.” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
8. “ఎవరైతే వితంతువు యొక్క మరియు అక్కరగొన్న వాని యొక్క (మిస్కీన్ యొక్క) మంచిచెడ్డలు చూసుకుంటాడో అతడు అల్లాహ్ మార్గములో జిహాదు చేసిన వానితో (అల్లాహ్ మార్గములో శ్రమించిన వానితో) సమానము.” అబీ హురైరహ్ (రదియల్లాహు అన్హు) కొనసాగిస్తూ ఇంకా ఇలా అన్నారు: “లేక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “(నిరంతరం) రాత్రి అంతా నమాజులో గడిపి, ఉదయం ఉపవాసములు పాటించే వానితో సమానము.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
9. “మనిషి సహజత్వ ప్రక్రియలలో ఐదు విషయాలు ఇమిడి ఉన్నాయి: అవి సుంతీ, నాభి క్రింది భాగములోని వెంట్రుకలను తొలగించుట, మీసములను కత్తిరించుట (కురచగా చేయుట), (చేతి వేళ్ళ మరియు కాలి వేళ్ళ) గోళ్ళు కత్తిరించుట మరియు చంకలలోని వెంట్రుకలు తొలగించుట.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
10. “ఎవరి చేతిలోనైతే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా, ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదుల జాతి గాని, మరియు క్రైస్తవుల జాతి గానీ ఎవరైతే నా గురించి విని కూడా నేను ఏ సందేశముతో అయితే పంపబడినానో దానిని విశ్వసించకుండానే చనిపోతాడో, అతడు తప్పకుండా నరకవాసులలో ఒకడు అవుతాడు.” - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
11. మీసాలు కత్తిరించండి మరియు గడ్డాన్ని వదిలేయండి (పెంచండి)
عربي ఇంగ్లీషు ఉర్దూ
12. ఎవరైతే నేను చేసిన విధంగా వుజూ చేసి, తరువాత నిలబడి, రెండు రకాతుల నమాజును ఖుషూతో అంటే ఆ రకాతులలో తన మనసు, తన ఆలోచనలు ఎటూ పోకుండా, నమాజుపైనే నిలిపి ఆచరిస్తాడో, అతడి పూర్వపు పాపాలు క్షమించి వేయబడతాయి - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
13. క్రైస్తవులు మరియు యూదులపై అల్లాహ్ యొక్క శాపము ఉండుగాక, వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిదుగా (ఆరాధనా గృహాలుగా) చేసుకున్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
14. “వినాశకరమైన ఏడు పాపముల నుండి దూరంగా ఉండండి - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
15. “ఓ అల్లాహ్! నా సమాధిని (పూజించబడే) ఒక విగ్రహం
عربي ఇంగ్లీషు ఉర్దూ
16. నిశ్చయంగా ఎంతపెద్ద ఆపద వస్తే దానికి అంతటి పుణ్యం లభిస్తుంది,నిస్సందేహంగా ఎవరినైతే అల్లాహ్ తఆలా ప్రేమిస్తాడో వారిని పరీక్షకు గురిచేస్తాడు,ఎవరైతే దీంట్లో సహనంగా ఓర్పుతో ఉంటాడో అల్లాహ్ అతని పట్ల సంతోషపడుతాడు మరెవరైతే విముఖత చూపుతాడో అల్లాహ్ కూడా అతని పట్ల క్రోదాన్ని చూపుతాడు. - 1 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
17. ‘సాటి కల్పించబడే వారందరికన్నా నేను అత్యంత స్వయం సమృధ్ధుడను. సహాయకునిగా, సహ్యోగిగా ఎవరినీ కలిగి ఉండవలసిన అవసరం లేని వాడను. కనుక ఎవరైనా ఏదైనా ఆచరణ ఆచరించి, అందులో ఇతరులతో నాకు సాటి కల్పించినట్లయితే , అతడిని,అతడు సాటి కల్పించిన వాటిని నేను వదిలి వేస్తాను - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
18. నేను మీలో నుండి ఎవరినైనా నా ఆప్తమిత్రునిగా చేసుకున్నాను అనే విషయం నుండి నన్ను నేను అల్లాహ్ ముందు విముక్తుణ్ణి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ విధంగానైతే అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం ను తన ఆప్తమిత్రునిగా (ఖలీల్ గా) తీసుకున్నాడో, నన్ను కూడా అల్లాహ్ తన ఆప్తమిత్రునిగా తీసుకున్నాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
19. “మీ ఇళ్ళను సమాధుల మాదిరి కానివ్వకండి. మరియు నా సమాధిని ఉత్సవ ప్రదేశంగా చేయకండి మరియు నాపై అల్లాహ్ అశీస్సుల కొరకు ప్రార్థించండి (నాపై దరూద్ పఠించండి), మీరెక్కడ ఉన్నా అది నన్ను చేరుతుంది”
عربي ఇంగ్లీషు ఉర్దూ
20. “నిశ్చయంగా అల్లాహ్ అభిమానవంతుడు, విశ్వాసి కూడా అభిమానవంతుడే. అల్లాహ్ యొక్క అభిమానము అంటే దాసుడు అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్బడుట (అనగా అల్లాహ్ యొక్క అభిమానము భంగపడినట్లు).”
عربي ఇంగ్లీషు ఉర్దూ
21. “ఎవరైతే అల్లాహ్ పేరున గాక మరింకెవరి పేరుతో ప్రమాణం చేస్తారో, నిశ్చయంగా వారు అవిశ్వానికి పాల్బడినట్లే లేదా అల్లాహ్ కు సాటి కల్పించినట్లే”
عربي ఇంగ్లీషు ఉర్దూ
22. “నిశ్చయంగా కపటులపై అత్యంత భారమైన నమాజులు ఇషా మరియు ఫజ్ర్ నమాజులు. వాటిలో ఏమి (శుభము దాగి) ఉన్నదో ఒకవేళ వారికి తెలిస్తే, వారు (తమ కాళ్ళపై నడవలేక) ప్రాకుతూ రావలసి వస్తే, అలా ప్రాకుతూ అయినా వస్తారు - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
23. “ప్రజలలో అత్యంత నీచులు, దుష్టులు ఎవరంటే, వారు జీవించి ఉండగానే ప్రళయఘడియ వచ్చి పడుతుంది, మరియు ఎవరైతే సమాధులను తమ ఆరాధనా గృహాలుగా (మస్జిదులుగా) చేసుకున్నారో.” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
24. మహ్’మూద్ ఇబ్న్ లబీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా మీ విషములో నేను భయపడే విషయం ఏమిటంటే – మీరు చిన్న షిర్క్ కు పాల్బడతారేమోనని.” అక్కడ ఉన్న వారు ఇలా ప్రశ్నించారు “చిన్న షిర్క్ అంటే ఏమిటి ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం?” దానికి ఆయన “ - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
25. అల్లాహ్ హలాలు పర్చిన విషయాలను వారు హరామ్ చేయలేదా మీరు వాటిని హరామ్ గా భావించలేదా?అల్లాహ్ నిషిద్దపర్చిన విషయాలను హలాల్ చేయలేదా మీరు వాటిని హలాల్ గా భావించలేదా అని ప్రశ్నించారు,దానికి నేను అవును అన్నాను ప్రవక్త- దాస్యం చేయడం అంటే అదే అని జవాబిచ్చారు. - 3 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
26. నిశ్చయంగా నీవు ఇప్పుడు గ్రంథావహులైన జాతి (ప్రజల) వద్దకు వెళుతున్నావు. వారి వద్దకు చేరినపుడు “అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
27. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారితో‘అన్నుష్ర ’{మంత్ర విద్యను మంత్ర విద్య తో దూరం చేయడం} గురించి ప్రశ్నించటం జరిగింది,ఆయన అది షైతాన్ చర్య అని బదులిచ్చారు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
28. “మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం ను క్రైస్తవులు (హద్దుమీరి) కీర్తించిన విధంగా, నా ప్రశంసలో అతిశయం చేయకండి. నిశ్చయంగా నేను ఆయన (అల్లాహ్) దాసుడను. కనుక నన్ను ‘అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు’ అని మాత్రమే అనండి - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
29. తీర్పు దినమునాడు నా మధ్యవర్తిత్వాన్ని పొందే (నా సిఫారసు పొందే) ఆ అదృష్టవంతుడు ఎవరంటే – “లా ఇలాహ ఇల్లల్లాహ్” (నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, కేవలం అల్లాహ్ తప్ప) అని ఎవరైతే నిష్కల్మషంగా, హృదయపూర్వకంగా పలుకుతాడో అతడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
30. శకునం కారణంగా పని నుండి వెనుకకు మరలి పోయినవాడు నిశ్చయంగా షిర్క్ కు పాల్పడినట్లే ,సహాబాలు ప్రశ్నిస్తూ ‘దానికి ప్రత్యామ్నాయం/మార్గాంతరం ఏంటి ప్రవక్త అని ప్రశ్నించారు,ప్రవక్త బదులిస్తూ ‘ఈ విధంగా దుఆ చేయటం"అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరక,వలా తియర ఇల్లా తియరక వలా ఇలాహ గైరుక{ఓ అల్లాహ్ నీవు తప్ప మేలు ను వేరెవరు ప్రసాదించలేరు నీ శకునం తప్ప మరే శకునం లేదు నీవు తప్ప ఇతర వాస్తవ ఆరాధ్య దేవుడు లేడు} - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
31. అల్లాహ్ అతడిని స్వర్గం లో ప్రవేశింపజేస్తాడు, అతడి ఆచరణలు ఏమైనప్పటికీ.” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
32. “ఎవరైతే అల్లాహ్’తో ‘షిర్క్’ నకు పాల్బడకుండా (ఆయనకు ఎవరినీ, దేనినీ సాటి కల్పించకుండా, తౌహీద్ పై ఉండి) అల్లాహ్ ను కలుస్తాడో, అతడు స్వర్గం లో ప్రవేశిస్తాడు. మరియు ఎవరైతే అల్లాహ్‘కు ఇతరులను సాటి కల్పిస్తున్న స్థితిలో అల్లాహ్ ను కలుస్తాడో అతడు నరకంలో ప్రవేశిస్తాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
33. ఎవరైతే అల్లాహ్ ను గాక ఇంకెవరినైనా అల్లాహ్ కు సాటి కల్పిస్తూ వేడుకుంటాడో, మరియు ఆ విధానం పైనే మరణిస్తాడో అతడు నరకాగ్ని లోనికి ప్రవేశిస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
34. “(ధర్మం విషయంలో) ‘హద్దుమీరేవారు నాశనమయ్యారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
35. అల్లాహ్ వాక్యం గురించి తెలియ పర్చారు(وَقَالُوا لا تَذَرُنَّ آلِهَتَكُمْ وَلا تَذَرُنَّ وَدًّا وَلا سُوَاعًا وَلا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا)"వారన్నారు ‘మీరు మీ ఆరాధ్య దైవాలను ఎన్నటికీ వదలకండి,వద్ద్ ను సువా ను యగూస్ ను యఊక్ ను నసర్ ను ఎన్నటికీ వదలకండి’’ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా తెలుపుతూ ‘ఈ పేర్లన్నీ నూహ్ అలైహిస్సలమ్ కాలంకు సంబంధించిన సత్పురుషులు"అన్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
36. “ఎవరైతే తన రెండు దవడల మధ్య ఉన్న దాని విషయంలోనూ మరియు తన రెండు తొడల మధ్య ఉన్న దాని విషయంలోనూ నాకు హామీ ఇస్తారో, అతనికి నేను స్వర్గం యొక్క హామీ ఇస్తున్నాను”
عربي ఇంగ్లీషు ఉర్దూ
37. సమీప భవిశ్యత్తులో మీపై అమీరులు (పాలకులు) వస్తారు. మీరు వారిని (వారి మంచి పనుల కారణంగా) ఇష్టపడనూ వచ్చు, లేదా (వారి దురాచరణల కారణంగా) వారిని ఇష్టపడకపోనూ వచ్చు. ఎవరైతే పాలకుని దురాచరణలను, దుర్మార్గాలను (అవి పునరావృతం కాకుండా ఉండాలని) అతని దృష్టికి తీసుకు వెళతాడో, (తీర్పు దినమున) అతడు తనను తాను రక్షించుకున్నవాడు అవుతాడు. మరియు ఎవరైతే (పాలకుని దృష్టికి తీసుకు వెళ్ళేటంత శక్తి, ధైర్యము లేక) అతని దుర్మార్గాలను మనసులో అసహ్యించుకుంటాడో (తీర్పు దినమున) అతడు శాంతిని పొందుతాడు. అయితే ఎవరైతే పాలకుని దుర్మార్గాలను ఆమోదిస్తాడో, మరియు వాటిని తాను కూడా ఆచరిస్తాడో – తీర్పు దినము నాడు నాశనమై పోతాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
38. అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా చిన్న హదస్ స్థితిలో (తప్పనిసరిగా వుదూ చేయవలసిన అశుద్ధ స్థితిలో) ఉన్నట్లయితే, వారు వుదూ చేయనంత వరకు అల్లాహ్ వారి సలాహ్ ను (నమాజును) స్వీకరించడు.” - 6 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
39. “అల్లాహ్ యొక్క దాసుడు ఒకవేళ వ్యాధిగ్రస్తుడై ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా, అతడు స్థానికంగా ఉన్నపుడు లేదా ఆరోగ్యంగా ఉన్నపుడు చేసే మంచిపనులకు సమానంగా అతని కొరకు ప్రతిఫలం వ్రాయబడుతుంది” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
40. ‘జిక్ర్’ లలో (అల్లాహ్’ను ధ్యానించు విషయాలలో) అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” (వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, కేవలం అల్లాహ్ తప్ప) అని పలుకుట మరియు దుఆలలో అత్యుత్తమమైనది “అల్-హందులిల్లాహ్” (సకల స్తోత్రములు కేవలం అల్లాహ్ కొరకే) అని పలుకుట”
عربي ఇంగ్లీషు ఉర్దూ
41. “మీలో (ప్రతి) ఒకరికి స్వర్గము అతని కాలి చెప్పు యొక్క తోలుపట్ట కంటే దగ్గరగా ఉన్నది, అలాగే నరకము కూడా దాని మాదిరిగానే (అతనికి దగ్గరగా) ఉన్నది”
عربي ఇంగ్లీషు ఉర్దూ
42. “సివాక్ (పంటిపుల్ల) నోటిని శుభ్రపరుస్తుంది మరియు ప్రభువు (అయిన అల్లాహ్) ను ప్రసన్నుడిని చేస్తుంది - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
43. “పెద్ద పాపములకు దూరంగా ఉన్నట్లయితే; (ప్రతిదినము విధిగా ఆచరించే) ఐదుపూటల నమాజులు, ఒక శుక్రవారపు నమాజు నుండి మరో శుక్రవారపు నమాజు వరకు, అలాగే ఒక రమదాన్ మాసము నుండి మరో రమదాన్ మాసము వరకు – వీటి మధ్య జరిగే చిన్నచిన్న పాపాలకు అవి పరిహారంగా మారతాయి” - 8 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
44. “నా నుండి ఇతరులకు చేరవేయండి, అది ఒక్క వాక్యమైనా సరే. ఇస్రాయీలు సంతతి వారి నుండి కూడా ఉల్లేఖించండి, అందులో అభ్యంతరము ఏమీ లేదు. (అయితే తెలుసుకోండి) ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నాకు అబద్దాలను అంటగడతాడో, అతడు తన స్థానాన్ని నరకాగ్నిలో స్థిర పరుచుకున్నట్లే - 8 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
45. “ఒక ముస్లింకు ఎలాంటి అలసట, అనారోగ్యం, చింత, దుఃఖం, హాని లేదా వేదన కలిగినా, చివరికి ముల్లు గుచ్చుకున్నా - అల్లాహ్ అతని పాపాలలో కొన్నింటిని క్షమించి వేస్తాడు.” - 6 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
46. “నరకము కోరికలు, వ్యామోహముల నడుమ ఉన్నది మరియు స్వర్గము కష్టము, ప్రయాసల నడుమ ఉన్నది”
عربي ఇంగ్లీషు ఉర్దూ
47. “ఒక ముస్లిమునకు తోటి ముస్లిముపై ఐదు హక్కులు ఉన్నాయి: సలామునకు జవాబిచ్చుట, వ్యాధిగ్రస్తుని పరామర్శించుట, మృతులను శ్మశానమునకు కొనిపోవునపుడు, స్మశానము వరకు అనుసరించుట, ఎవరైనా ఆహ్వానించినట్లయితే వారి ఆహ్వానాన్ని మన్నించుట మరియు ఎవరైనా తుమ్మి నపుడు (అతడు అల్-హందులిల్లాహ్ అని పలికినట్లయితే) అతడికి ‘యర్హకుముల్లాహ్’ అని సమాధానమిచ్చుట”
عربي ఇంగ్లీషు ఉర్దూ
48. “కొనుగోలు చేసేటపుడు, అమ్మేటపుడు మరియు అప్పు తిరిగి ఇచ్చివేయమని అడిగేటపుడు మృదువుగా వ్యవహరించే వానిని అల్లాహ్ కరుణించుగాక”
عربي ఇంగ్లీషు ఉర్దూ
49. “ఒక మనిషి ఉండేవాడు. అతడు ప్రజలకు అప్పులు ఇస్తూ ఉండేవాడు. అతడు తన సేవకునితో ఇలా అనేవాడు ‘నీవు (అప్పులు వసూలు చేసే టప్పుడు) పేదరికంలో ఉన్నవాని దగ్గరకు వెళితే, అతడి అప్పును ఉపేక్షించు. బహుశా అల్లాహ్ మన పాపాలను ఉపేక్షించవచ్చు (చూసీ చూడనట్లు వదిలివేయవచ్చు)
عربي ఇంగ్లీషు ఉర్దూ
50. “బంధుత్వపు సంబంధాలను నిలబెట్టేవాడు అంటే తన బంధువులు చేసిన మేలుకు ప్రతిఫలం ఇచ్చేవాడని కాదు; కానీ, తనతో బంధుత్వపు బంధాన్ని తెంచుకున్న బంధువులతో సత్సంబంధాలు కొనసాగించేవాడు” - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
51. “ఎవరైతే, (పేదరికం కారణంగా) తీసుకున్న అప్పు తీర్చలేక పోతున్న వానికి వ్యవధినిస్తాడో లేదా ఎవరైతే అతని అప్పులో కొంత భాగాన్ని తగ్గిస్తాడో, అతడికి అల్లాహ్ తన నీడ తప్ప మరింకే నీడ ఉండని ఆ తీర్పు దినమున తన అర్ష్ (సింహాసనము) క్రింద నీడ కల్పిస్తాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
52. ఇస్లాంధర్మార్జన కొరకు ఇంటి నుండి బయల్దేరిన వ్యక్తి తిరిగి తన ఇంటికి చేరేవరకు అల్లాహ్ మార్గం లో ఉంటాడు. - 3 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
53. “ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ, రమజాన్ నెల ఉపవాసాలు పాటిస్తారో, అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”
عربي ఇంగ్లీషు ఉర్దూ
54. “ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ‘లైలతుల్ ఖద్ర్’ లో (రమజాన్ నెలలోని ఘనమైన రాత్రి) నమాజు ఆచరిస్తూ (అల్లాహ్ ఆరాధనలలో) గడుపుతారో అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”
عربي ఇంగ్లీషు ఉర్దూ
55. “అల్లాహ్ ఎవరికైతే మంచి చేయాలని తలపోస్తాడో అతడిని బాధలు, కష్టాలు అనుభవించేలా చేస్తాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
56. “ఇద్దరు ముస్లిములు, కత్తులు దూసి ఒకరిపై నొకరు దాడికి దిగితే, వారిలో చంపిన వాడూ మరియు చనిపోయిన వాడూ ఇద్దరూ నరకాగ్నిలో వేయబడతారు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
57. “ధర్మము ఒక నిష్కల్మషమైన బోధన, ఉపదేశం”
عربي ఇంగ్లీషు ఉర్దూ
58. “నిశ్చయంగా ‘హలాల్’ ఏమిటో (ఏమి అనుమతించ బడినదో) స్పష్టం చేయబడినది మరియు నిశ్చయంగా ‘హరామ్’ ఏమిటో (ఏమి నిషేధించబడినదో) స్పష్టం చేయబడినది - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
59. “నిశ్చయంగా అల్లాహ్ ప్రతి విషయంలోనూ కారుణ్యం కలిగి ఉండాలని ఆదేశించినాడు - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
60. నిశ్చయంగా అల్లాహ్ మంచి పనులను గురించి, మరియు చెడు పనులను గురించి నమోదు చేసినాడు. తరువాత దానిని గురించి ఇలా విశదీకరించినాడు – ఎవరైతే ఏదైనా మంచి పని చేయాలని సంకల్పించుకుంటాడో, మరి ఏదైనా కారణం వలన దానిని చేయలేక పోతాడో, అల్లాహ్ తన వద్ద, అతడి కొరకు ఆ మంచి పని సంపూర్ణంగా చేసినట్టు వ్రాస్తాడు మరియు ఎవరైతే మంచి పని చేయాలని నిర్ణయించుకుని, ఆ పనిని చేస్తాడో, అల్లాహ్ తనవద్ద అతడి కొరకు పది నుండి మొదలుకుని ఏడు వందల రెట్లు ఎక్కువగా మంచి పనులు చేసినట్లు, ఇంకా దానికంటే కూడా ఎక్కువగా చేసినట్లు వ్రాస్తాడు. మరియు ఎవరైతే ఏదైనా చెడు పని చేయాలని సంకల్పించు కుంటాడో మరియు దానిని చేయకుండా ఉండి పోతాడో, అల్లాహ్ తన వద్ద అతడి కొరకు ఒక మంచి పని సంపూర్ణంగా చేసినట్టు వ్రాస్తాడు. మరియు ఎవరైతే చెడు పని చేయాలని సంకల్పించుకుని ఆ పని చేస్తాడో, అల్లాహ్ తనవద్ద అతడి కొరకు ఒక చెడు పని చేసినట్లుగా వ్రాస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
61. “నిశ్చయంగా అల్లాహ్ మీ బాహ్య రూపాన్ని గానీ లేక మీ సంపదలను గానీ చూడడు. కానీ మీ హృదయాలను మరియు మీ ఆచరణలను చూస్తాడు” - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
62. నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానినే పొందుతారు, దేని కొరకైతే వారు సంకల్పించినారో - 6 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
63. ఇస్లాం అంటే, నీవు అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు ఎవరూ లేరని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు అని సాక్ష్యమిచ్చుట, సలాహ్’ను (నమాజును) స్థాపించుట, జకాతు చెల్లించుట, రమదాన్ మాసములో ఉపవాసాలు ఉండుట మరియు తగిన స్తోమత ఉంటే (కాబా) గృహానికి తీర్థయాత్ర చేయుట - 32 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
64. కోపం తెచ్చుకోకు - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
65. “ఎవరికీ హాని తలపెట్టకండి, హాని తలపెట్టిన వానికి ప్రతీకారం చేయకండి. ఎవరైతే (ఇతరులకు) హాని తలపెడతాడో అల్లాహ్ అతడికి హాని కలుగజేస్తాడు మరియు ఎవరైతే (ఇతరుల పట్ల) కఠినంగా ఉంటాడో, అల్లాహ్ అతడి పట్ల కఠినంగా ఉంటాడు” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
66. “మీరు అల్లాహ్ పై ‘తవక్కల్’ (భరోసా) ఉంచవలసిన విధంగా ‘తవక్కల్’ కలిగి ఉంటే, ఆయన పక్షులకు ప్రసాదించిన విధంగా మీకూ రిజ్’ఖ్ ను (ఉపాధిని) ప్రసాదిస్తాడు. అవి ఉదయం తమ గూళ్ళ నుండి ఆకలితో బయలు దేరుతాయి, సాయంత్రం నిండిన పొట్టలతో సంతృప్తిగా తిరిగి వస్తాయి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
67. నేను వారించిన విషయాలకు మీరు దూరంగా ఉండండి,ఆదేశించిన విషయాలను శక్తి మేరకు ఆచరించండి,యదార్థంగా మీ పూర్వపు జాతులవారు అధిక ప్రశ్నలతో వారి ప్రవక్తలను విభేదించినందువలన నాశనం చేయబడ్డారు. - 32 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
68. “ఎవరైనా మా ఈ విషయములో (ఇస్లాంలో), దానికి చెందని ఏదైనా విషయాన్ని ప్రవేశ పెట్టినట్లయితే అది తిరస్కరించబడుతుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
69. ఓ నా దాసులారా! నేను ‘జుల్మ్’ను (దౌర్జన్యం, హింస, పీడన, అన్యాయము మొ.) నాపై నేను నిషేధించుకున్నాను మరియు ‘జుల్మ్’ను మీ మధ్యన కూడా నిషేధించాను. కనుక మీరు ఒకరిపైనొకరు ‘జుల్మ్’నకు పాల్బడకండి - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
70. ఓ పిల్లవాడా! నేను నీకు కొన్ని పదాలు నేర్పుతాను (వాటిని బాగా గుర్తుంచుకో) - అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు, అల్లాహ్ నిన్ను రక్షిస్తాడు, అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు, అల్లాహ్ ను నీవు నీ ఎదురుగా కనుగొంటావు, ఒకవేళ ఏమైనా కోరుకోవాలంటే, కేవలం అల్లాహ్ నే కోరుకో, ఒకవేళ ఏమైనా సహాయం అర్థించవలసి వస్తే, కేవలం అల్లాహ్ నే సహాయం కొరకు వేడుకో - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
71. నా దాసుడు ఒకడు పాపపు పని చేసినాడు. తరువాత ఇలా వేడుకున్నాడు “ఓ అల్లాహ్, నా ఈ పాపాన్ని క్షమించు - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
72. “నిశ్చయంగా, అల్లాహ్ వద్ద న్యాయవంతులు (గా గుర్తించబడిన వారు) , అపార కరుణామయుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుని కుడి చేతి వైపున కాంతితో చేయబడిన ఉన్నత ఆసనాలపై ఆశీనులై ఉంటారు. ఆయన రెండు చేతులు కూడా కుడి చేతులే - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
73. “నా ఉమ్మత్ (ముస్లిం సమాజం) లోని ప్రతి ఒక్కరూ స్వర్గంలోనికి ప్రవేశిస్తారు, ఎవరైతే నిరాకరిస్తారో వారు తప్ప - 10 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
74. “(ఒకసారి అల్లాహ్ వద్ద నుండి సందేశం తీసుకుని నా వద్దకు వచ్చినపుడు) జిబ్రయీల్ అలైహిస్సలాం పొరుగువాని హక్కులను గురించి నాకు ఎంతగా ఉపదేశించినారంటే, పొరుగు వానిని వారసుడిగా చేస్తారేమోనని నాకు సందేహం కలిగింది”
عربي ఇంగ్లీషు ఉర్దూ
75. “నిశ్చయంగా చేతబడి (మంత్రతంత్రాలు), తాయెత్తులు, వశీకరణ మొదలైనవన్నీ బహుదైవారాధనలే” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
76. “ ‘గీబత్’ (చాడీలు చెప్పుట, వ్యక్తి పరోక్షములో అతని గురించి మాట్లాడుట) అంటే ఏమిటో తెలుసా మీకు?” ఆయన సహాబాలు “అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికే బాగా తెలుసు” అన్నారు. ఆయన “(‘గీబత్’ అంటే) మీ సోదరుని గురించి అతడు ఇష్టపడని విధంగా మాట్లాడడం” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
77. “ఓ అల్లాహ్! నా ఉమ్మత్ కు (సమాజానికి) సంబంధించిన ఏ విషయములోనైనా ఎవరికైనా అధికారాన్ని ఇచ్చినట్లయితే, అతడు దాని ద్వారా ప్రజలను కష్టాలకు, కఠిన పరిస్థితులకు గురిచేస్తే, నీవు కూడా అతడిని కాఠిన్యానికి గురి చేయి. మరియు నా ఉమ్మత్ కు సంబంధించిన ఏ విషయములోనైనా ఎవరికైనా అధికారాన్ని ఇచ్చినట్లయితే, అతడు (ప్రజలను కష్టాలపాలు చేయకుండా) ప్రజలతో దయతో, కరుణతో స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే, నీవు కూడా అతనిపై కృపతో, దయతో, అనుగ్రహముతో ఉండు” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
78. “కొందరు అల్లాహ్ యొక్క సంపత్తిని న్యాయ విరుద్ధంగా (మూర్ఖంగా, లక్ష్యరహితంగా) వినియోగిస్తారు. తీర్పు దినమునాడు అటువంటి వారికి నరకాగ్నియే గతి” - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
79. అనుమానాలకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అనుమానం (మనం మాట్లాడే) మాటల్లోనే అత్యంత అసత్యమైనది, దుర్మార్గమైనది - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
80. “అల్లాహ్ అధికార పదవిలో నియమించిన ఎవరైనా సరే, తాను చనిపోయే దినమున, తన అధికారము క్రింద ఉన్న వారిని మోసం చేస్తున్న స్థితిలో చనిపోతే, అటువంటి వానికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించినాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
81. ‘ప్రతీ ఆదమ్ కుమారుడు తప్పు చేస్తాడు కానీ చేసిన తప్పుకు పశ్చాత్తాప చెందినవాడే అందులో శ్రేష్టుడు. - 14 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
82. “ప్రతి మంచి పని పుణ్యకార్యమే”
عربي ఇంగ్లీషు ఉర్దూ
83. “సత్కార్యాలలో దేనినీ అల్పమైనదిగా భావించకండి; అది మీ సహోదరుణ్ణి చిరునవ్వు ముఖంతో, ఉల్లాసంగా కలవడమైనా సరే”
عربي ఇంగ్లీషు ఉర్దూ
84. బలశాలి అంటే ఇతరులను చిత్తు చేసేవాడు కాదు. వాస్తవానికి బలశాలి అంటే ఎవరైతే కోపం కలిగినపుడు, తనను తాను అదుపులో ఉంచుకుంటాడో అతడు - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
85. ఎవరైనా ఏదైనా జాతి వారిని అనుకరించినట్లయితే వారు అందులోని వారే అయిపోతారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
86. ఎవరైతే ఒక మంచి వైపునకు మార్గదర్శకం చేస్తారో, అతనికి ఆ మంచి పనిని ఆచరించిన వానితో సమానంగా ప్రతిఫలం లభిస్తుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
87. “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “(ఓ ప్రవక్తా!) అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఘోరమైన పాపము ఏది?”; దానికి ఆయన “అల్లాహ్’యే నిన్ను సృష్టించినప్పటికీ (నీ సృష్టికర్త అయినప్పటికీ)
عربي ఇంగ్లీషు ఉర్దూ
88. చనిపోయిన వారి పట్ల చెడుగా మాట్లాడకండి. ఎందుకంటే వారి ఆచరణల ఫలాలను వారు పొందినారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
89. (కోపంలో) ఒక ముస్లిం తన తోటి ముస్లిం నుండి మూడు రాత్రులకంటే ఎక్కువ దూరంగా ఉండుట అనుమతించబడలేదు. (మామూలుగా అలాంటి స్థితిలో) ఒకరినొకరు కలిసినా, ఒకరికొకరు వీపు చూపుకుని మరలి పోతారు. అయితే వారిలో ఉత్తముడు ఎవరంటే - ఎవరైతే తోటి వానికి సలాం చెప్పడంలో ముందడుగు వేస్తాడో - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
90. “బంధుత్వాలను త్రెంచుకునే వాడు స్వర్గంలో ప్రవేశించలేడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
91. “అపోహలను కల్పించేవాడు స్వర్గం లోనికి ప్రవేశించడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
92. “ఎవరైతే తన జీవనోపాధి విస్తరించాలని, తన జీవన కాలము పొడిగించ బడాలని ఆశిస్తాడో, అతడు తన బంధువులతో సంబంధాలను నిలిపి ఉంచుకోవాలి (వాటిని సజావుగా కొనసాగించాలి)” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
93. “ఎవరైనా ఇతరులకు హాని కలిగించినట్లయితే, అల్లాహ్ అతనికి హాని కలుగజేస్తాడు. మరియు ఎవరైనా ఇతరులను కఠిన పరిస్థితులకు లోను చేసినట్లయితే, అల్లాహ్ అతడికి కఠిన పరిస్థితులను కల్పిస్తాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
94. “’సజ్దా’ (సాష్టాంగ ప్రమాణము) చేసినపుడు (ఆ స్థితిలో) దాసుడు తన ప్రభువుకు అతి చేరువగా ఉంటాడు. కనుక ‘సజ్దా’ స్థితిలో మరింత ఎక్కువగా ఆయనను వేడుకొనండి” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
95. “ఎవరైతే ఫజ్ర్ సలాహ్’ను (ఫజ్ర్ నమాజును) ఆచరిస్తారో, వారు అల్లాహ్ రక్షణలో ఉన్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
96. “అల్లాహ్’ను మరియు అంతిమ దినమును విశ్వసించే వారు ఎవరైనా సరే, (పలికితే) మంచి మాటలే పలకాలి లేదా మౌనంగా ఉండాలి - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
97. “ఎవరైతే జనులపై కరుణ చూపడో మహోన్నతుడూ, సర్వ శక్తిమంతుడూ అయిన అల్లాహ్ అటువంటి వానిపై కరుణ చూపడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
98. “నిశ్చయంగా, అల్లాహ్ ఎక్కువగా అసహ్యించుకునే వాడు ఎవరంటే, ఎవరైతే (ప్రజలతో) విపరీతంగా జగడాలు, కలహాలు పెట్టుకుంటాడో.” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
99. “అల్లాహ్’కు అత్యంత ఇష్టమైన పదాలు నాలుగు; అవి ‘సుబ్’హానల్లాహ్’ (అల్లాహ్ పరమ పవిత్రుడు), ‘అల్’హందులిల్లాహ్’ (స్తోత్రములన్ని కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందినవి), ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు) మరియు ‘అల్లాహు అక్బర్’ (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు). అయితే ఇందులో మీరు దేనితోనైనా ప్రారంభించవచ్చు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
100. “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను 'ఏ కారణంగా ప్రజలు ఎక్కువగా స్వర్గంలోనికి ప్రవేశింప జేయబడతారు?' అని ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, “అల్లాహ్ పట్ల ‘తఖ్వా’ (అల్లాహ్ పట్ల భయభక్తులు) కలిగి ఉండుట కారణంగా మరియు సత్ప్రవర్తన, సత్శీలము కారణంగా
عربي ఇంగ్లీషు ఉర్దూ
101. ‘అల్ హయా’ (వినయము, నమ్రత) కలిగి ఉండుట విశ్వాసములో ఒక భాగము
عربي ఇంగ్లీషు ఉర్దూ
102. “దుఆ (అల్లాహ్ ను వేడుకొనుట) యే అసలు ఇబాదత్ (ఆరాధన)
عربي ఇంగ్లీషు ఉర్దూ
103. “రెండు వచనాలున్నాయి - అవి (పలుకుటలో) నాలుకపై తేలికైనవి, సత్కర్మల త్రాసులో భారమైనవి మరియు అనంత కరుణామయునికి అత్యంత ప్రియమైనవి - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
104. “అల్లాహ్ ఎదుట అత్యంత గౌరవనీయమైనది ‘దుఆ’ తప్ప మరింకేమీ లేదు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
105. “దానము చేయుట సంపదను తగ్గించదు. ఇతరులను క్షమించే గుణం కారణంగా అల్లాహ్ దాసుని గౌరవాన్ని పెంపొందింప జేస్తాడు మరియు ఎవరైతే కేవలం అల్లాహ్ కొరకు అణకువ, వినయం అలవర్చుకుంటాడో, అల్లాహ్ అతడి స్థానాన్ని ఉన్నతం చేస్తాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
106. “ఎవరైతే తన సోదరుని పరోక్షములో అతడి గౌరవాన్ని రక్షిస్తాడో, తీర్పు దినమున అల్లాహ్ అతడి ముఖాన్ని నరకాగ్ని నుండి రక్షిస్తాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
107. “ఎవరైతే ‘సుబ్’హానల్లాహి వ బిహందిహి’ (అల్లాహ్ సకల లోపాలకు, కొరతలకు అతీతుడు, మరియు సకల స్తోత్రములు ఆయన కొరకే) అని వంద సార్లు ఉచ్ఛరిస్తాడో, అతని పాపాలు అతని నుండి దించి వేయబడతాయి (తుడిచి వేయబడతాయి) అవి సముద్రపు నురగ అంత ఎక్కువగా ఉన్నప్పటికీ”
عربي ఇంగ్లీషు ఉర్దూ
108. “ఎవరైతే పది సార్లు ‘లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్’ (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి ఎవరూ లేరు, ఈ సృష్టి సామ్రాజ్యమంతా ఆయనకు చెందినదే, సకల స్త్రోత్రములూ ఆయనకు మాత్రమే చెందినవి, మరియు ఆయన ప్రతి విషయము పై అధికారము కలవాడు)
عربي ఇంగ్లీషు ఉర్దూ
109. “అల్లాహ్ ఒకవేళ ఎవరికైనా మేలు చేయదలుచుకుంటే, ఆయన అతడికి (ఇస్లాం) ధర్మము యొక్క లోతైన అవగాహనను కలుగజేస్తాడు - 6 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
110. “నిశ్చయంగా దైవభీతిపరుడిని, భయభక్తులు కలవాడిని, (అనవసరమైన) వాంఛలు, కోరికలు లేని వాడిని, మరియు గుంభనముగా ఉండేవాడిని అల్లాహ్ ప్రేమిస్తాడు” - 6 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
111. “నిశ్చయంగా మీరు ఏ విధంగానైతే ఈ పూర్ణ చంద్రుడిని చూస్తున్నారో, ఆ విధంగా మీరు మీ ప్రభువును చూస్తారు; ఆయనను (కనులారా) చూడడంలో మీరు ఎటువంటి ఇబ్బందినీ ఎదుర్కొనరు
عربي ఇంగ్లీషు ఉర్దూ
112. “ఏదైనా పరిమళ ద్రవ్యము (ఉదా: అత్తరు) బహుమతిగా ఇవ్వబడితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎపుడూ నిరాకరించేవారు కాదు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
113. “మీలో, విశ్వాసములో అత్యుత్తముడు ఎవరంటే, ఎవరైతే అత్యుత్తమమైన నడవడిక కలవాడో. అలాగే మీలో అత్యుత్తమములు ఎవరంటే, ఎవరైతే తమ స్త్రీల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
114. “ఈ ప్రపంచము ఒక సంతోషము మరియు ఆనందము మాత్రమే. వాటిలో ఉత్తమమైనది ధర్మపరాయణురాలైన భార్య”
عربي ఇంగ్లీషు ఉర్దూ
115. “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఏ విషయం లోనైనా సౌమ్యత, దయ, కనికరం కలిగి ఉండటమనేది దానిని మరింత అలంకృతం చేస్తుంది. అలాగే ఏ విషయంలో నుండి అయినా వీటిని తొలిగించి వేస్తే అది లోపభూయిష్టం అవుతుంది.” - 14 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
116. “ఆహారం భుజించిన తరువాత, అందుకు అల్లాహ్ ను కొనియాడిన వ్యక్తి పట్ల అల్లాహ్ ఆనందభరితుడు అవుతాడు, అలాగే ఎవరైతే ఏదైనా పానీయాన్ని సేవించిన తరువాత అందుకు అల్లాహ్ ను కొనియాడుతాడో అతని పట్ల అల్లాహ్ ఆనందభరితుడు అవుతాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
117. “విశ్వాసి తన సత్ప్రవర్తన, సభ్యత, ఉత్తమ నడవడికల ద్వారా పుష్కలంగా సలాహ్ (నమాజు) లు మరియు ఉపవాసాలు ఆచరించే వాని స్థాయిని పొందుతాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
118. నిశ్చయంగా మీలో ఎవరైతే ఉత్తమ నడవడిక కలిగి ఉంటారో, వారే ఉత్తములు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
119. “సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రకటన: “ఓ ఆదము కుమారుడా! (అల్లాహ్ మార్గములో) ఖర్చు చేయి, నీపై ఖర్చు చేయబడుతుంది (అంటే అల్లాహ్ నీపై ఖర్చు చేస్తాడు, ప్రసాదిస్తాడు అని అర్థము)
عربي ఇంగ్లీషు ఉర్దూ
120. “నిశ్చయంగా అల్లాహ్ దుష్ఠునికి, దౌర్జన్యపరునికి (వెంటనే శిక్షించక) కొంత గడువునిస్తాడు. అయితే, ఆయన అతడిని పట్టుకున్నపుడు, ఇక అతడిని విడిచిపెట్టడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
121. “స్త్రీల కంటే ఎక్కువగా మగవారికి హాని కలగజేసే ఏ ‘ఫిత్నా’ (ఏ పరీక్షా, ఏ విపత్తూ) నేను నా వెనుక వదిలి వెళ్ళుట లేదు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
122. “(ప్రజల కొరకు) విషయాలను తేలిక చేయండి, కష్టతరం చేయకండి; ప్రజలకు శుభవార్తలు వినిపించండి, వారిని దూరం చేయకండి”
عربي ఇంగ్లీషు ఉర్దూ
123. “ఖుర్’ఆన్ పఠిస్తూ ఉండండి. ఎవరి చేతిలోనైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలున్నాయో ఆయన సాక్షిగా (చెబుతున్నాను), తమ (కాళ్ళ) కు కట్టివేసిన తాళ్ళ బంధనాల నుండి తప్పించుకునే ఒంటెల మాదిరిగా, ఖుర్’ఆన్ మీ జ్ఞాపకం (మెమొరీ) లో నుండి జారిపోతుంది” - 18 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
124. “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఉత్తములు ఎవరంటే, ఎవరైతే ఖుర్ఆన్ ను నేర్చుకుంటారో మరియు ఇతరులకు బోధిస్తారో” - 22 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
125. “ఎవరైనా ఏదైనా ప్రదేశములో ఆగినపుడు, “అఊజు బి కలిమాతిల్లాహి త్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్” (నేను అల్లాహ్ యొక్క పరిపూర్ణ వాక్కుల ద్వారా ఆయన సృష్టించిన వాటి కీడు నుండి ఆయన శరణు కోరుతున్నాను) అని పలికినట్లయితే, అతడు ఆ ప్రదేశము నుండి వెడలి పోనంత వరకు అతనికి ఏదీ (ఏ విషయమూ) హాని కలిగించజాలదు” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
126. “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఏ ఆదేశాలతో ఇక్కడికి పంపినారో, అవే ఆదేశాలతో నిన్ను కూడా పంపనా! ఏ చిత్రపటాన్నైనా, ప్రతిమ, బొమ్మ, శిల్పము మొదలైన వాటిని చెరిపి వేయకుండా, తొలగించకుండా వదలకు, అలాగే ఎత్తుగా నిర్మించిన లేదా ఏదైనా కట్టడం నిర్మించి ఉన్న ఏ సమాధిని కూడా నేలమట్టం చేయకుండా వదలకు.” - 6 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
127. “మీ సంతానము కంటే, మీ తల్లిదండ్రుల కంటే మరియు ప్రజలందరి కంటే నేను మీకు అత్యంత ప్రియమైన వాడిని కానంతవరకు మీరు పరిపూర్ణ (Perfect) విశ్వాసాన్ని పొందజాలరు.” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
128. “ఎవరైతే శకునాల కొరకు చూస్తాడో లేదా తన కొరకు ఏవైనా శకునాల భావార్థాన్ని (వ్యాఖ్యానాన్ని, తాత్పర్యాన్ని) తెలుసు కోవాలనుకుంటాడో; లేదా ఎవరైతే జోస్యము చెబుతాడో లేదా తన కొరకు జోస్యము చెప్పించుకుంటాడో; లేదా ఎవరైతే చేతబడి చేస్తాడో, లేక చేతబడి చేయిస్తాడో; అలాంటి వాడు మాలోని వాడు కాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
129. “ఏదైనా విషయం గురించి ప్రశ్నించడానికి ఎవరైతే జ్యోతిష్కుని వద్దకు వెళతారో మరియు అతడు చెప్పిన దానిని విశ్వసిస్తారో – నలభై దినముల పాటు అతని నమాజులు స్వీకరించబడవు.” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
130. “ఎవరైతే నక్షత్ర గమనాల ద్వారా (గ్రహాల గమనాల ద్వారా) భవిష్యత్తు గురించి చెప్పే విద్యను నేర్చుకుంటే, అతడు చేతబడి (భూతవైద్యం, మంత్రతంత్రాల విద్య) లో ఒక భాగం (ఒక శాఖను) నేర్చుకున్నట్లే. అతడు ఎంత కాలం ఆ విద్యను గడించితే అంత ఎక్కువగా దానిని పొందినట్లే.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
131. “(వివాహ సమయాన వధూవరులు ఒకరిపైనొకరు) విధించుకునే షరతులలో, (మీ) సంభోగమును ఆమోదయోగ్యం (హలాల్) చేయు షరతులు నెరవేర్చుటకు అర్హమైనవి
عربي ఇంగ్లీషు ఉర్దూ
132. మహాపరాధలలో అతి ఘోరమైనది ‘అల్లాహ్ కు ఇతరులను భాగస్వామ్యులుగా చేయడం‘అల్లాహ్ యొక్క శక్తి నుండి బేఖాతరు చేయకపోవడం,అల్లాహ్ కారుణ్యం నుండి నిరాశ చెందడం,అల్లాహ్ యొక్క ఆత్మ నుండి నమ్మకం కోల్పోవడం. - 18 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
133. “నైతిక విలువలు మరియు నైతికతకు సంబంధించినంత వరకూ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జనులందరిలోనూ అత్యుత్తమములు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
134. సలాహ్ (నమాజు) ముగించిన ప్రతిసారీ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ పదాలతో అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడేవారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
135. “మీ ఇళ్ళను స్మశానాలు గా మార్చకండి. నిశ్చయంగా ఏ ఇంటిలోనైతే సూరతుల్ బఖరహ్ పారాయణం చేయబడుతుందో ఆ ఇంటినుండి షైతాను పారిపోతాడు.” - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
136. “నేను ‘సుబ్’హానల్లాహి, వల్ హందులిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్’ అని పలకడం, సూర్యుడు ఉదయించే వాటన్నింటి కంటే కూడా నాకు అత్యంత ప్రియమైనది. (అంటే వేటివేటిపైనైతే సూర్యోదయం అవుతుందో, ఆ విషయాలన్నింటి కంటే కూడా అత్యంత ప్రియమైనదని భావము).”
عربي ఇంగ్లీషు ఉర్దూ
137. “ఈ దినములలో చేసే సత్కార్యాలు (అంటే జిల్ హిజ్జహ్ నెల మొదటి పది దినములలో చేసే సత్కార్యాలు) మిగతా ఏ దినములలో చేసే సత్కార్యాల కన్నా కూడా అల్లాహ్’కు అత్యంత ప్రియమైనవి.” - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
138. ఎవరైతే సలాతుల్ అస్ర్ ను వదిలివేసినాడో (ఆచరించలేదో) అతని ఆచరణలు అన్నీ వృధా చేయబడతాయి.” - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
139. “ఎవరైతే ఉత్తమ రీతిలో ఉదూ చేస్తాడో అతని పాపాలు అతని శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి, చివరికి అతని గోళ్ళ క్రింద నుండి కూడా బయటకు వెళ్ళిపోతాయి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
140. “ఎవరైతే రాత్రి వేళ (పడుకోబోయే ముందు) సూరతుల్ బఖరహ్ యొక్క చివరి రెండు ఆయతులు (వచనాలు) పఠిస్తాడో అది అతనికి సరిపోతుంది.” - 8 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
141. “ఎవరైనా అల్లాహ్ యొక్క గ్రంథము (ఖుర్’ఆన్) నుండి ఒక్క అక్షరం పఠించినా అతనికి ప్రతిఫలంగా ఒక పుణ్యము లభిస్తుంది. ప్రతి పుణ్యము తనను పోలిన పది పుణ్యాలను తీసుకు వస్తుంది - 8 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
142. “ఎవరైనా అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తూ తన కుటుంబంపై ఖర్చు చేస్తాడో, అది అతని కొరకు (అల్లాహ్ మార్గములో చేసిన) సత్కార్యముగా నమోదు చేయబడుతుంది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
143. “విశ్వాసము డెభ్భై శాఖలు కలిగి ఉంటుంది లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుశా 60 శాఖలు కలిగి ఉంటుంది (అన్నారు). వాటిలో అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు); మరియు అన్నింటికన్నా చివరిది (తక్కువ స్థాయి శాఖ) ప్రజలు నడిచే దారి నుండి ప్రమాదకరమైన దానిని తొలగించుట
عربي ఇంగ్లీషు ఉర్దూ
144. ఒంటెల మెడలలో వేలాడదీసిన ఎటువంటి దారాన్ని గానీ, ఎటువంటి పట్టాను గానీ లేక ఎటువంటి గొలుసును గానీ త్రెంచి వేయకుండా వదలకండి” అనే ఆదేశముతో పంపినారు - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
145. ఏదైనా వస్తువు తావీజులా ఎవరైతే ధరిస్తారో దానికే అప్పగించబడతారు’. - 3 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
146. “ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు) అని ఉచ్ఛరిస్తాడో, మరియు అల్లాహ్ తప్ప ఆరాధించబడే ప్రతిదానినీ నిరసిస్తాడో (అవిశ్వసిస్తాడో), అతని సంపద, మరియు అతని రక్తము (మిగతా విశ్వాసుల కొరకు) హరాం (నిషేధము) అవుతాయి. అతని లెక్క, పత్రము అల్లాహ్ వద్ద ఉంటుంది (అల్లాహ్ చూసుకుంటాడు అని అర్థము)
عربي ఇంగ్లీషు ఉర్దూ
147. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వము, శీలసంపద పూర్తిగా ఖుర్’ఆనే” అన్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
148. “కరుణ చూపే వారిపై, అనంత కరుణాప్రదాత (అర్రహ్మాన్) కరుణ చూపుతాడు; కనుక భూమిపై ఉన్నవారిపై కరుణ చూపండి, ఆకాశంలో ఉన్నవాడు మీపై కరుణ చూపుతాడు.” - 18 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
149. “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నివేళలా అల్లాహ్’ను స్మరించేవారు.” - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
150. “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ‘ఖజా’ (అల్ ఖజా – الْقَزَعِ) చేయుటను నిషేధించినారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
151. అది ఏదో ఒక నిజానికి సంబంధించిన మాట అయి ఉంటుంది. దానిని ఆ జిన్ను దొంగతనంగా (దైవదూతల నుండి) పొంది, తన మిత్రుడైన ఆ జ్యోతిష్యుని చెవిలో వేస్తాడు. అతడు దానికి (ఆ నిజమైన ఒక్క మాటకు) మరో వంద అబద్ధాలు కల్పించి చెపుతాడు.” (సహీ బుఖారీలో ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించిన మరొక హదీసులో తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా విన్నాను అని తెలిపారు “స్వర్గములో అల్లాహ్ నిర్ణయించిన విషయాలను గురించి ప్రస్తావించుకుంటూ దైవదూతలు క్రింది ఆకాశాలలోనికి వస్తారు. వారి మాటలను జిన్ను దొంగతనంగా, చాటుమాటుగా విని తమ మిత్రులైన జ్యోతిష్యులకు చేరవేస్తాడు. అలా ఆ జ్యోతిష్యులు దానికి వంద అబద్దాలు జోడించి చెబుతూ ఉంటారు.”)
عربي ఇంగ్లీషు ఉర్దూ
152. “(ఒకసారి) మేము ఉమర్ రజియల్లాహు అన్హు వద్ద ఉన్నాము. అపుడు ఆయన ఇలా అన్నారు “అత్-తకల్లఫి చేయుట నుండి మనలను నిషేధించుట జరిగింది” (అత్-తకల్లుఫ్ التَّكَلُّفِ అంటే ‘ఎవరైనా, తాను నిజంగా అనుభూతి చెందని విషయాన్ని, అనుభూతి చెందినట్లు ఉద్దేశ్యపూర్వకంగా ప్రదర్శించుట)
عربي ఇంగ్లీషు ఉర్దూ
153. మూత్రబిందువుల నుండి పరిశుభ్రత వహించండి,ఎందుకంటే సమాధిలో జరిగే శిక్షలకు ప్రధానంగా ఇదే కారణమవుతుంది. - 11 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
154. ఎవరైతే “సత్యపూర్వకముగా తన సంపూర్ణ హృదయముతో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మద ర్రసూలుల్లాహ్’ (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు) సాక్ష్యమిస్తాడో, అల్లాహ్ నరకాగ్నిని అతనిపై నిషేధిస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
155. “మన ప్రభువు పరమ పవిత్రుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ప్రతి రాత్రి మూడవ భాగమున అన్నింటి కంటే క్రింది ఆకాశానికి దిగి వచ్చి
عربي ఇంగ్లీషు ఉర్దూ
156. “సమాధులపై కూర్చోకండి మరియు సమాధులకు అభిముఖముగా (సమాధి తన ఎదురుగా ఉండేలా) నమాజు ఆచరించకండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
157. అది ఎటువంటి జాతి అంటే – తమలో ధర్మపరాయణుడైన ఒక దాసుడు చనిపోయినా, లేక ఒక ధర్మపరాయణుడైన వ్యక్తి చనిపోయినా వారు అతని సమాధిపై ఒక ఆరాధనా గృహాన్ని (దేవాలయాన్ని) నిర్మించి
عربي ఇంగ్లీషు ఉర్దూ
158. “ఏడు ఎముకలపై (ఏడు ఎముకలు భూమికి ఆనేలా) సజ్దాహ్ చేయమని నేను ఆదేశించబడ్డాను
عربي ఇంగ్లీషు ఉర్దూ
159. “(నమాజులో) రెండు సజ్దాల నడుమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహుమ్మఘ్’ఫిర్లీ, వర్హమ్’నీ, వఆఫినీ, వహ్’దినీ, వర్జుఖ్’నీ” (ఓ అల్లాహ్ నాకు క్షమాభిక్ష ప్రసాదించు, నాపై కరుణ చూపు, నాకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, శ్రేయస్సును ప్రసాదించు, నాకు మార్గదర్శకాన్ని ప్రసాదించు మరియు నాకు ఉపాధిని ప్రసాదించు) అని పలికేవారు.” - 6 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
160. అల్లాహుమ్మ అంతస్సలామ్, వ మిన్కస్సలామ్, తబారక్త జల్’జలాలి వల్ ఇక్రామ్
عربي ఇంగ్లీషు ఉర్దూ
161. “నిలబడి ఆచరించు, అలా చేయలేకపోతే కూర్చుని ఆచరించు, అలా కూడా చేయలేకపోతే ఒకవైపునకు తిరిగి పడుకుని ఆచరించు” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
162. నీకు అదాన్ వినబడుతుందా?” అని ప్రశ్నించారు. దానికి అతడు “అవును” అని జవాబిచ్చాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అయితే దానికి (అనుగుణంగా) స్పందించు” అన్నారు (మస్జిదుకు వచ్చి నమాజు ఆచరించు)”
عربي ఇంగ్లీషు ఉర్దూ
163. మీలో ఒకరు నమాజు కు వచ్చినప్పుడు ఇమామ్ ను ఏ స్థితిలో పొందుతారో అదే స్థితిలో ఇమాము ను అతను అనుసరించవలసి ఉంటుంది. - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
164. “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు “ఖుత్బతుల్ హాజహ్” నేర్పించినారు - 4 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
165. “వలీ (వధువు తరఫున ఆమె సంరక్షకుడు) లేకుండా వివాహము పూర్తి కాదు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
166. ఓ బాలుడా! (తినుటకు ముందు) అల్లాహ్ పేరును స్మరించు, కుడి చేతితో తిను, మరియు నీకు దగ్గరగా (ఎదురుగా) ఉన్నదాని నుండి తిను
عربي ఇంగ్లీషు ఉర్దూ
167. “మీలో ఎవరైనా ఒకవేళ తింటే కుడి చేతితోనే తినండి, త్రాగితే కుడి చేతితోనే త్రాగండి, ఎందుకంటే నిశ్చయంగా షైతాను ఎడమ చేతితో తింటాడు మరియు ఎడమ చేతితో త్రాగుతాడు.” - 2 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
168. “ఎవరైతే విధేయత నుండి తొలగిపోయి, జమాఅత్ నుండి వేరై వెళ్ళిపోయినట్లయితే, తరువాత అతడు అదే స్థితిలో చనిపోతే, అతని చావు ‘జాహిలియ్యహ్’ కాలము (ఇస్లాంకు పూర్వపు అఙ్ఞాన కాలము) నాటి చావుతో సమానము
عربي ఇంగ్లీషు ఉర్దూ
169. “మీరు మీ విషయాల కొరకు ఒక వ్యక్తిని (మీ నాయకునిగా/పాలకునిగా) అంగీకరించినపుడు, (మీ నాయకునికి ప్రకటించిన) మీ సంఘీభావాన్ని ముక్కలు చేయాలనే, లేక మీ జమాఅత్ ను విడదీయాలనే తలంపుతో ఎవరైనా మీ వద్దకు వచ్చినట్లయితే – అతడిని చంపివేయండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
170. ఒప్పందం కుదుర్చుకున్నవ్యక్తిని హతమార్చినవాడు (హంతకుడు) స్వర్గము యొక్క సుగంధాన్ని కూడా వాసన చూడలేడు; నిశ్చయంగా స్వర్గపు సుగంధము నలభై సంవత్సరాల (ప్రయాణపు) దూరము నుండి కూడా చూడగలిగినప్పటికీ. (ముఆహద్: ముస్లిముల రాజ్యములోనికి - తన ప్రాణానికి రక్షణ ఉంటుంది అనే ఒప్పందముపై - ప్రవేశించిన వ్యక్తి) - 6 ملاحظة
عربي ఇంగ్లీషు ఉర్దూ
171. “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం – ఒక తీర్పును ప్రభావితం చేసేందుకు లంచం ఇచ్చే వానిని మరియు లంచం పుచ్చుకునే వానిని – ఇద్దరినీ శపించినారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
172. “ఎవరైతే మనకు (విశ్వాసులకు) వ్యతిరేకంగా ఆయుధాలు ఎత్తుతాడో, వాడు మనలోని వాడు కాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ