«لَا يَدْخُلُ الْجَنَّةَ قَاطِعُ رَحِمٍ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2556]
المزيــد ...
జుబైర్ బిన్ ముత్’ఇం రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా విన్నారు:
“బంధుత్వాలను త్రెంచుకునే వాడు స్వర్గంలో ప్రవేశించలేడు”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 2556]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బంధుత్వాలను త్రెంచుకునే వాని గురించి వివరిస్తున్నారు. ఎవరైతే తన బంధువులతో బంధుత్వాన్ని త్రెంచుకుంటాడో లేక వారి హక్కులను వారికి ఇవ్వకుండా ఉల్లంఘిస్తాడో లేక వారికి హాని కలిగించడం, వారితో అవమానకరంగా ప్రవర్తించడం చేస్తాడో, అటువంటి వాడు స్వర్గం’లో ప్రవేశించడానికి అర్హుడు కాడు.