«إِذَا أَنْفَقَ الرَّجُلُ عَلَى أَهْلِهِ يَحْتَسِبُهَا فَهُوَ لَهُ صَدَقَةٌ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 55]
المزيــد ...
అబూ మస్’ఊద్ అల్ బద్రీ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని ఉల్లేఖిస్తున్నారు:
“ఎవరైనా అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తూ తన కుటుంబంపై ఖర్చు చేస్తాడో, అది అతని కొరకు (అల్లాహ్ మార్గములో చేసిన) సత్కార్యముగా నమోదు చేయబడుతుంది.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 55]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఒక వ్యక్తి, ఎవరి పోషణకైతే అతను బాధ్యుడో, అంటే ఉదాహరణకు భార్య, తల్లిదండ్రులు, మరియు తన సంతానం మొదలైన వారిపై ఖర్చు చేసి, దాని ద్వారా అతడు అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందుతాడు. మరియు తాను ఖర్చు చేసిన దానికి ప్రతిగా అతడు అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని కోరుకున్నట్లయితే అతడు అల్లాహ్ మార్గములో ఖర్చు చేసిన పుణ్యమును పొందుతాడు – అని తెలియజేస్తున్నారు.