కూర్పు: . .
+ -
عن أنس رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:

«إِنَّ عِظَمَ الْجَزَاءِ مَعَ عِظَمِ الْبَلَاءِ، وَإِنَّ اللهَ إِذَا أَحَبَّ قَوْمًا ابْتَلَاهُمْ، فَمَنْ رَضِيَ فَلَهُ الرِّضَا، وَمَنْ سَخطَ فَلَهُ السخطُ»
[ضعيف] - [رواه الترمذي وابن ماجه] - [سنن الترمذي: 2396]
المزيــد ...

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు దైవ ప్రవక్త ద్వారా ఉల్లేఖిస్తూ చెబుతున్నారు : నిశ్చయంగా దైవప్రవక్త తెలియజేశారు"నిశ్చయంగా ఎంత పెద్ద ఆపద వస్తే దానికి అంతటి పుణ్యం ఉంటుంది,నిస్సందేహంగా అల్లాహ్ తఆలా ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని పరీక్షకు గురిచేస్తాడు,ఎవరైతే దీంట్లో సహనంగా ఓర్పుతో ఉంటాడో అల్లాహ్ అతనిపట్ల సంతోష పడుతాడు మరెవరైతే విముఖత చూపుతాడో అల్లాహ్ కూడా అతనిపట్ల క్రోధాన్ని చూపుతాడు

الملاحظة
لم يوضع رقم الحديث
النص المقترح لا يوجد...
الملاحظة
I think it's better to translate it as: "so whoever is content (with Allah's decree) then for him is (Allah's) pleasure..."
النص المقترح لا يوجد...

[దృఢమైనది] - [దాన్ని ఇబ్నె మాజ ఉల్లేఖించారు - దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు]

వివరణ

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఈ హదీసు ద్వారా తెలియజేసారు - ముస్లిముకు తన ధన ప్రాణాల విషయంలో ఆపదలకు పరీక్షలకు గురి అవ్వాల్సి వస్తుంది,ఈ అపదల్లో సహనం ఓర్పువహించిన వాడికి అల్లాహ్ పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు,ఆపద తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే అంతే ఎక్కువగా అల్లాహ్ తరుపున పుణ్యం ప్రాప్తిస్తుంది,ఆపై దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలిపారు – మోమిన్ కు వచ్చే ఆపదలు అల్లాహ్ కు అతని పట్ల గల ప్రేమ కు సంకేతాలు,అల్లాహ్ వ్రాసిన విధి వ్రాతలో ఏ విషయాలైతే నిక్షిప్త మయ్యాయో అవి జరిగి తీరుతాయి,అలాంటి సందర్భంలో ఎవరైతే ప్రసన్నుడిగా వాటిపై ఓర్పు వహిస్తారో నిశ్చయంగా అల్లాహ్ దానిపై ప్రసన్నత పొంది పుణ్యాన్ని నొసగుతాడు మరెవరైతే విధివ్రాత పట్ల అసహ్యంగా,ఆక్రోశానికి గురవుతాడో,అతనిపట్ల అల్లాహ్ క్రోధానికి గురి అయి తగిన విధంగా అతన్ని శిక్షిస్తాడు.

الملاحظة
تصحيح
النص المقترح رواية الترمذي ضعيفه و ابن ماجه حسنة.

من فوائد الحديث

  1. నిశ్చయంగా ఆపదలు కష్టాలు పాపాలను ప్రక్షాలిస్తాయి,వాటి కారణంగా విధులు కోల్పో కూడదు,ఉదాహరణకి ఓర్పుని వీడటం లేదా హరామ్ పని చేయడం అంటే‘దుస్తులను చింపుకోవడం,లేదా ముఖాన్ని బాదుకోవడం వంటివి.
  2. ‘ముహబ్బత్’-ప్రేమ అనే గుణాన్ని అల్లాహ్ కొరకు ఆయన మహోన్నతకు తగిన విధంగా రుజువు చేయబడినది.
  3. ముమిన్ కు వచ్చే ఆపదలు ఈమాన్ కు సూచికలు,సంకేతాలు.
  4. (ప్రసన్నత)‘అర్రిజా’ మరియు(ఆగ్రహం)‘అస్సఖ్త్’ గుణాలు అల్లాహ్ కొరకు ఆయన మహోన్నతకు తగిన విధంగా దృవీకరించబడ్డాయి.
  5. అల్లాహ్ యొక్క విధివ్రాతను,ఆయన తీర్పుల పట్ల ప్రసన్నత భావాన్ని కలిగియుండడం ముస్తహబ్’చర్య,
  6. అల్లాహ్ విధి వ్రాత పట్ల దానికి తగిన తీర్పుల పట్ల ఆగ్రహ భావాన్ని వ్యక్తపర్చడం నిషేదము.
  7. ఆపద సమయాల్లో సహనస్థైర్యలను కలిగియుండాలని ఈ హదీసు ద్వారా ప్రోత్సహించడం జరిగింది.
  8. వాస్తవానికి మనిషి ఒక వస్తువు పట్ల అసహ్యతను కలిగియుంటాడు కానీ అదే అతనికి మేలైనదై ఉంటుంది.
  9. పరిశుద్దుడైన అల్లాహ్ కొరకు అల్ హిక్మహ్ అనే గుణాన్ని ఆయన కార్యాల్లో రుజువు చేయబడింది.
  10. చేసిన కార్యానికి ప్రతి ఫలితం తగిన విధంగా లభిస్తుంది
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్
అనువాదాలను వీక్షించండి
కూర్పులు
  • .
ఇంకా