«الْجَنَّةُ أَقْرَبُ إِلَى أَحَدِكُمْ مِنْ شِرَاكِ نَعْلِهِ، وَالنَّارُ مِثْلُ ذَلِكَ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6488]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“మీలో (ప్రతి) ఒకరికి స్వర్గము అతని కాలి చెప్పు యొక్క తోలుపట్ట కంటే దగ్గరగా ఉన్నది, అలాగే నరకము కూడా దాని మాదిరిగానే (అతనికి దగ్గరగా) ఉన్నది”.
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 6488]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గము మరియు నరకము మనిషికి ఎంత దగ్గరగా ఉన్నాయో తెలియ జేస్తున్నారు. అవి మనిషి కాలి పై (కట్టబడి) ఉండే తోలుపట్ట అంత దగ్గరగా ఉంటాయి. అతడు మహోన్నతుడైన అల్లాహ్ విధేయతలో ఆయనకు ప్రీతికరమైన పనులలో ఏదో ఒకటి చేస్తాడు, తద్వారా అతడు స్వర్గం లోనికి ప్రవేశిస్తాడు; లేదా ఏదైనా పాపపు పనికి పాల్బడతాడు, అది అతడు నరకం లోనికి ప్రవేశించడానికి కారణం అవుతుంది.