«مَنْ يُرِدِ اللهُ بِهِ خَيْرًا يُصِبْ مِنْهُ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 5645]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“అల్లాహ్ ఎవరికైతే మంచి చేయాలని తలపోస్తాడో అతడిని బాధలు, కష్టాలు అనుభవించేలా చేస్తాడు”.
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 5645]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు – అల్లాహ్ ఒకవేళ విశ్వాసులైన తన దాసులలో ఎవరికైనా మంచి చేయాలని తలిస్తే (ముందుగా) వారిని కష్టాల పాలు చేయడం ద్వారా అంటే వారి సంపదలలో నష్టాలు లేదా వారి కుటుంబాలలో కష్టాల ద్వారా వారిని పరీక్షిస్తాడు. ఎందుకంటే, కష్టాలలో ఒక నిజమైన విశ్వాసి, దుఆల ద్వారా (అల్లాహ్ ను వేడుకొనడం ద్వారా) అల్లాహ్ వైపునకు మరలుతాడు. తద్వారా అతడి పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది, అతడి స్థానాలు ఉన్నతం అవుతాయి.