«أَحَبُّ الْكَلَامِ إِلَى اللهِ أَرْبَعٌ: سُبْحَانَ اللهِ، وَالْحَمْدُ لِلهِ، وَلَا إِلَهَ إِلَّا اللهُ، وَاللهُ أَكْبَرُ، لَا يَضُرُّكَ بِأَيِّهِنَّ بَدَأْتَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2137]
المزيــد ...
సమురా బిన్ జుందుబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“అల్లాహ్’కు అత్యంత ఇష్టమైన పదాలు నాలుగు; అవి ‘సుబ్’హానల్లాహ్’ (అల్లాహ్ పరమ పవిత్రుడు), ‘అల్’హందులిల్లాహ్’ (స్తోత్రములన్ని కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందినవి), ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు) మరియు ‘అల్లాహు అక్బర్’ (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు). అయితే ఇందులో మీరు దేనితోనైనా ప్రారంభించవచ్చు”.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2137]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ అత్యంత ఎక్కువగా ఇష్టపడే నాలుగు పదాలను గురించి వివరిస్తున్నారు.
సుబ్’హానల్లాహ్’ (పరమ పవిత్రుడు): అల్లాహ్ ఎటువంటి లోపము లేనివాడు, లోపరహితుడు అని అర్థము. లోపములన్నింటికీ అతీతుడు కేవలం అల్లాహ్ మాత్రమే, ఆయన ఎటువంటి లోపములు లేని పరమ పవిత్రుడు అని అర్థము.
‘అల్’హందులిల్లాహ్’ (స్తోత్రములన్ని కేవలం అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి): ఈ పదం ప్రతి విషయంలోను అల్లాహ్ యొక్క సంపూర్ణతను, ఆయన ప్రేమను మహిమ పరుస్తున్నది.
‘లా ఇలాహ ఇల్లల్లాహ్’: అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు అని అర్థము.
అల్లాహు అక్బర్’: (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు): అవును, ఆయన అందరికంటే గొప్పవాడూ, అందరికంటే ప్రియమైన వాడూను.
ఈ పదాలను ఉచ్ఛరించుట యొక్క ఘనత, ఉచ్ఛరించి నందుకు లభించే పుణ్యము వాటిని ఏ వరుసలో ఉచ్ఛరించినాము అనే దానిపై ఆధారపడి ఉండదు.