«الْكَبَائِرُ: الْإِشْرَاكُ بِاللهِ، وَعُقُوقُ الْوَالِدَيْنِ، وَقَتْلُ النَّفْسِ، وَالْيَمِينُ الْغَمُوسُ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6675]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ ఇబ్న్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం :
“అల్-కబాయిర్ (ఘోరమైన పాపములు, పెద్ద పాపములు) ఏమిటంటే: అల్లాహ్ కు సాటి కల్పించుట (అల్లాహ్ కు సరిసమానులు చేయుట), తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుట, హత్య చేయుట మరియు ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధపు సాక్ష్యము చెప్పుట.”
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 6675]
ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘ఘోరమైన పాపములను’ (అల్ కబాయిర్) గురించి తెలియజేస్తున్నారు. వాటికి పాల్బడిన వానిని ఈ ప్రపంచములో గానీ, పరలోకములో గానీ అతి కఠినమైన శిక్షలు ఉన్నాయని హెచ్చరించడం జరిగింది.
వాటిలో మొదటిది: “అల్లాహ్ కు సాటి కల్పించుట (ఇతరులను అల్లాహ్ కు సరిసమానులుగా చేయుట): అంటే ఆరాధనలలో ఏ ఆరాధననైనా అల్లాహ్ కు గాక ఇతరులకు చేయుట (అల్లాహ్ ను గాక ఇతరులను ఆరాధించుట), అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకమైన ఆయన దైవత్వములో, ఆయన ప్రభుతలో, ఆయన నామములలో, ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన ఆయన అపూర్వ గుణగణాలలో ఇతరులను ఆయనకు సమానులుగా చేయుట, నిలబెట్టుట.
రెండవది “తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుట”: అంటే మాటల ద్వారా గానీ లేక చేతల ద్వారా గానీ, తల్లిదండ్రులకు కష్టము కలిగించే, హాని లేక కీడు కలిగించే ప్రతిదీ దీని క్రిందకు వస్తుంది; అలాగే వారి పట్ల ప్రేమగా ఉండడాన్ని, వారి పట్ల గౌరవంగా, మర్యాదగా, కరుణతో ప్రవర్తించడాన్ని నిర్లక్ష్యం చేయుట, వదిలి వేయుట.
మూడవది “ఎవరి ప్రాణాన్నైనా తీయడం – హత్య చేయడం”: అంటే, షరియత్ పరిధిలోని కారణాలలో ఏ కారణమూ లేకుండా ఎవరి ప్రాణాన్నైనా తీయడం, హత్య చేయడం. దౌర్జన్యానికి పాల్బడి లేదా దాడి చేసి లేదా అక్రమంగా ఎవరి ప్రాణాన్నైనా తీయడం, హత్య చేయడం.
నాలుగవది “ఉద్దేశ్యపూర్వకముగా అబద్ధపు సాక్ష్యము చెప్పుట”: అంటే తాను చెబుతున్నది అబద్ధమని తెలిసీ, అది నిజమని ఒట్టు పెట్టుకొనుట, ప్రమాణము చేయుట వంటివి దీని క్రిందకు వస్తాయి. ఈ ఆచరణ అతడిని మహాపాపంలో పడేలా చేస్తుంది, లేదా నరకాగ్నిలో పడేలా చేస్తుంది.