«السِّوَاكُ مَطْهَرَةٌ لِلْفَمِ، مَرْضَاةٌ لِلرَّبِّ».
[صحيح] - [رواه النسائي وأحمد] - [مسند أحمد: 24203]
المزيــد ...
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“సివాక్ (పంటిపుల్ల) నోటిని శుభ్రపరుస్తుంది మరియు ప్రభువు (అయిన అల్లాహ్) ను ప్రసన్నుడిని చేస్తుంది".
[దృఢమైనది] - - [مسند أحمد - 24203]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ‘అరాక్ చెట్టు’ యొక్క పుల్లను లేదా అటువంటి చెట్ల పుల్లను ఉపయోగించి పళ్ళను శుభ్రపరుచుకోవడం నోటిని మాలిన్యము నుండి మరియు దుర్గంధము నుండి శుభ్రపరుస్తుంది’ అని తెలియజేస్తున్నారు. మరియు ఈ విధంగా నోటిని శుభ్రంగా ఉంచుకోవడం తన దాసుని పట్ల అల్లాహ్ ప్రసన్నుడు కావడానికి ఒక కారణం అవుతుంది. ఎందుకంటే, ఇందులో అల్లాహ్ పట్ల దాసుని విధేయత మరియు ఆయన ఆఙ్ఞను శిరసావహించడమూ ఉన్నాయి, అలాగే సర్వ శక్తిమంతుడైన అల్లాహ్ ఇష్టపడే పరిశుభ్రత కూడా ఉన్నది.
أن السواك وسيلة لتطهير الفَم.مافي