«كُلُّ أُمَّتِي يَدْخُلُونَ الْجَنَّةَ إِلَّا مَنْ أَبَى»، قَالُوا: يَا رَسُولَ اللهِ، وَمَنْ يَأْبَى؟ قَالَ: «مَنْ أَطَاعَنِي دَخَلَ الْجَنَّةَ، وَمَنْ عَصَانِي فَقَدْ أَبَى».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 7280]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“నా ఉమ్మత్ (ముస్లిం సమాజం) లోని ప్రతి ఒక్కరూ స్వర్గంలోనికి ప్రవేశిస్తారు, ఎవరైతే నిరాకరిస్తారో వారు తప్ప”. (అది విని) వారితో ఇలా అనడం జరిగింది “ఓ రసూలుల్లాహ్, ఎవరు నిరాకరిస్తారు?” దానికి వారు “ఎవరైతే నాకు విధేయత చూపుతారో (నన్ను అనుసరిస్తాడో) అతడు స్వర్గం లోనికి ప్రవేశిస్తాడు. మరియు ఎవరైతే నాకు అవిధేయత చూపుతాడో (నన్ను అనుసరించడో) నిశ్చయంగా అతడు నిరాకరించిన వాడు”.
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ యొక్క ప్రతి వ్యక్తి స్వర్గములోనికి ప్రవేశిస్తాడని, కేవలం ఎవరైతే దూరంగా ఉండిపోతాడో అతడు తప్ప అని తెలియజేసారు.
అక్కడ ఉన్న సహాబాలు రజియల్లాహు అన్హుమ్ “ఎవరు దూరంగా ఉండిపోతారు ఓ రసూలుల్లాహ్?” అని ప్రశ్నించారు.
దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చినారు: ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశహరునికి విధేయత చూపుతాడో, అతడి ఆదేశ పాలన చేస్తాడో మరియు అతడిని అనుసరిస్తాడో, అతడు స్వర్గం లోనికి ప్రవేశిస్తాడు. మరియు ఎవరైతే ఆయనకు అవిధేయత చూపుతాడో, షరియత్ ను అనుసరించడో, అతడి అవిధేయత, దుష్కర్మల కారణంగా స్వర్గం లోనికి ప్రవేశించడానికి నిరాకరించబడతాడు.
خلق الله العباد ليرحمهم، ويدخلهم دار رحمته.تخريج الحديث