«إِنَّ رِجَالًا يَتَخَوَّضُونَ فِي مَالِ اللهِ بِغَيْرِ حَقٍّ، فَلَهُمُ النَّارُ يَوْمَ الْقِيَامَةِ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 3118]
المزيــد ...
ఖౌలహ్ అల్ అన్సారియహ్ రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:
“కొందరు అల్లాహ్ యొక్క సంపత్తిని న్యాయ విరుద్ధంగా (మూర్ఖంగా, లక్ష్యరహితంగా) వినియోగిస్తారు. తీర్పు దినమునాడు అటువంటి వారికి నరకాగ్నియే గతి”.
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - అన్యాయంగా, ధర్మవిరుద్ధంగా ముస్లిముల సంపదను ఖర్చు చేసే వారి గురించి వివరిస్తున్నారు. వారు దానిని (సంపదను) అన్యాయంగా స్వంతం చేసుకుంటారు. ప్రజల్ల వద్ద నుండి ధర్మవిరుద్ధంగా ధనాన్ని సేకరించడం, ప్రజల ధనాన్ని ధర్మ విరుద్ధమైన ప్రదేశాలలో, విషయాలలో, పనులలో ఖర్చు చేయడం, ఇవన్నీ ఇదే అర్థంలోనికి వస్తాయి. అనాథల సంపత్తిని ధర్మ విరుద్ధంగా సొంతం చేసుకోవడం, ఖర్చు చేయడం, ఉమ్మత్ కొరకు దానం చేయబడిన సంపద నుండి ఈ విధంగా కాజేయడం, ధర్మ విరుద్ధంగా ఖర్చు చేయడం, అమానతుగా ఉంచబడిన సంపదలను కాజేయడం, పౌరుల అభ్యున్నతి కొరకు కేటాయించబడిన నిధి (పౌరనిధి) నుండి, తాను అర్హుడు కాకపోయినా, దాని నుండి లాభం, ప్రయోజనం పొండడం – ఇవన్నీ ఇదే అర్థం క్రిందకు వస్తాయి.
తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – అటువంటి వారికి తీర్పు దినమున నరకాగ్నియే ప్రతిఫలమని తెలిపినారు.