«لَيْسَ مِنَّا مَنْ تَطَيَّرَ أَوْ تُطُيِّرَ لَهُ، أَوْ تَكَهَّنَ أَوْ تُكُهِّنَ لَهُ، أَوْ سَحَرَ أَوْ سُحِرَ لَهُ، وَمَنْ عَقَدَ عُقْدَةً، وَمَنْ أَتَى كَاهِنًا فَصَدَّقَهُ بِمَا يَقُولُ فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ».
[حسن] - [رواه البزار] - [مسند البزار: 3578]
المزيــد ...
ఇమ్రాన్ ఇబ్న్ హుసేన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైతే శకునాల కొరకు చూస్తాడో లేదా తన కొరకు ఏవైనా శకునాల భావార్థాన్ని (వ్యాఖ్యానాన్ని, తాత్పర్యాన్ని) తెలుసు కోవాలనుకుంటాడో; లేదా ఎవరైతే జోస్యము చెబుతాడో లేదా తన కొరకు జోస్యము చెప్పించుకుంటాడో; లేదా ఎవరైతే చేతబడి చేస్తాడో, లేక చేతబడి చేయిస్తాడో; అలాంటి వాడు మాలోని వాడు కాడు (అతడు ముస్లిం కాడు అని అర్థము). మరియు ఎవరైతే జోస్యుని దగ్గరకు వెళతాడో మరియు అతడు చెప్పిన దానిని విశ్వసిస్తాడో – అలాంటి వాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన దానిని విశ్వసించ లేదు.”
[ప్రామాణికమైనది] - [దాన్ని అల్ బజ్జార్ ఉల్లేఖించారు] - [مسند البزار - 3578]
ఈ హదీసులో తన ఉమ్మత్’లో కొన్ని పనులు చేసే వాడిని “అతడు మాలోని వాడు కాడు” అని హెచ్చరించినారు.
మొదటిది: “ఎవరైతే (పక్షిని) ఎగురవేసినాడో లేదా తన కొరకు (పక్షిని) ఎగురవేయమని నియమించినాడో”. ఈ ఆచారానికి మూలము – ఆ కాలములో ఎవరైనా ఏదైనా పని చేయాలని తలపెడితే, ఉదాహరణకు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని, లేక ఏదైనా దూర ప్రయాణము చేయాలని నిర్ణయించుకుంటే, లేదా ఇంకేదైనా పని చేయాలని నిర్ణయించుకుంటే – ముందుగా అతడు ఒక పక్షిని ఎగురవేసేవాడు (లేదా తన కొరకు పక్షిని ఎగురవేయమని ఎవరినైనా కోరేవాడు). ఆ పక్షి ఒకవేళ కుడివైపునకు ఎగిరిపోతే, శుభం జరుగుతుందని భావించి ఆ పని మొదలుపెట్టేవాడు. ఒకవేళ ఆ పక్షి ఎడమ వైపునకు ఎగిరిపోతే, అశుభం జరుగుతుందని భావించి ఆ పని చేయడం నుండి వెనుకడుగు వేసేవాడు. ఈ విధంగా తాను ఏదైనా పని చేయడానికి ముందు తాను స్వయంగా శకునం చూడడం లేదా ఎవరి చేతనైనా చేయించడం ఈ రెండూ నిషేధించబడినవే. ఎవరి ద్వారానైనా విని లేదా ఏదైనా చూసి అపశకునమని విశ్వసించడం (లేదా మంచి శకునమని విశ్వసించడం), అలాగే జంతువులను చూసి లేదా ఏదైనా అంగవైకల్యం గల వారిని చూసి ఆ విధంగా విశ్వసించడం లేదా ఫలానా అంకెలు లేదా ఫలానా రోజులు అపశకునమైనవి విశ్వసించడం, ఈ విధంగా మరింక దేనినైనా మంచి శకునానికి, అపశకునానికి, శుభానికి, అశుభానికి కారణాలుగా, ప్రతీకలుగా చూడడం, విశ్వసించడం – ఇవన్నీ కూడా ఇందులోనికే వస్తాయి.
రెండవది: “ఎవరైనా జోస్యము చెప్పడం లేదా తన కొరకు జోస్యం చెప్పించుకోవడం”: నక్షత్రాలను లేదా అలాంటి ఇతరములను ఆధారం చేసుకుని ఎవరైనా తనకు అగోచర విషయాల ఙ్ఞానము ఉందని దావా చేసినట్లయితే లేదా అలా దావా చేసే వాని వద్దకు అంటే జోతిష్కుని వద్దకు వెళ్ళినా లేదా అతడు చెప్పిన దానిని విశ్వసించినా – అలాంటి వాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన దానిని (ఖుర్’ఆన్ ను) విశ్వసించలేదు.
మూడవది: “చేతబడి”: అంటే చేతబడి చేసినా లేదా చేతబడి చేయమని ఎవరినైనా నియమించినా. సాధారణంగా ఇది ఎవరికైనా లాభం గానీ లేక నష్టం గానీ కలిగించడానికి – నిషేధిత మంత్రాలను ఉచ్ఛరిస్తూ దారాలపై ముడులు వేసి వాటిపై ఊదుతూ చేయబడుతుంది.