«إِذَا الْتَقَى الْمُسْلِمَانِ بِسَيْفَيْهِمَا فَالْقَاتِلُ وَالْمَقْتُولُ فِي النَّارِ»، فَقُلْتُ: يَا رَسُولَ اللهِ هَذَا الْقَاتِلُ، فَمَا بَالُ الْمَقْتُولِ؟ قَالَ: «إِنَّهُ كَانَ حَرِيصًا عَلَى قَتْلِ صَاحِبِهِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 31]
المزيــد ...
అబీ బక్రత రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రస్తావిస్తుండగా నేను విన్నాను:
“ఇద్దరు ముస్లిములు, కత్తులు దూసి ఒకరిపై నొకరు దాడికి దిగితే, వారిలో చంపిన వాడూ మరియు చనిపోయిన వాడూ ఇద్దరూ నరకాగ్నిలో వేయబడతారు”. అది విని నేను “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ! చంపిన వాడి కొరకు అది సరియైనదే, మరి చనిపోయినవాడి గురించి ఎలా?” అని ప్రశ్నించాను. దానికి వారు “అవకాశం దొరికితే తన తోటి వాడిని చంపాలనే అతడు ఆశించినాడు”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 31]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు, ‘ఎదుటి వాడిని నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో ఇద్దరు ముస్లిములు కత్తులతో ఒకరిపై నొకరు దాడికి దిగితే, చంపినవాడు నరకంలో వేయబడతాడు. ఎందుకంటే, నేరుగా ఇతడు, అతడిని చంపినాడు కనుక’ సహచరులు ప్రశ్నించారు “మరి చనిపోయిన వాడు నరకంలో ఎలా వేయబడతాడు?” అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “(అవకాశం దొరికితే) ఎదుటి వాడిని చంపాలనే అతడి ఉద్దేశ్యం కారణంగా అతడు కూడా నరకంలో వేయబడతాడు. చంపిన వాని చురుకుదనం, అతడి ముందంజ మరియు సఫల యత్నం తప్ప, చనిపోయిన వాడిని మరింకేదీ నిరోధించలేదు” అని తెలియ జేసినారు.