«مَنْ أَتَى عَرَّافًا فَسَأَلَهُ عَنْ شَيْءٍ لَمْ تُقْبَلْ لَهُ صَلَاةٌ أَرْبَعِينَ لَيْلَةً».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2230]
المزيــد ...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలలో కొందరు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: (సహీహ్ ముస్లింలోని ఇదే హదీసులో హఫ్సహ్ బింత్ ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హా ఉల్లేఖించినట్లుగా పేర్కొనబడింది):
“ఏదైనా విషయం గురించి ప్రశ్నించడానికి ఎవరైతే జ్యోతిష్కుని వద్దకు వెళతారో మరియు అతడు చెప్పిన దానిని విశ్వసిస్తారో – నలభై దినముల పాటు అతని నమాజులు స్వీకరించబడవు.”
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – భవిష్యత్తు గురించి చెప్పే వాని దగ్గరకు వెళ్ళరాదని హెచ్చరిస్తున్నారు. ‘జ్యోస్యుడు’, ‘కాలజ్ఞాని’, ‘దైవజ్ఞుడు’, ‘జ్యోతిష్కుడు’ మొదలైన పేర్లన్నీ అటువంటి వారిని సూచించడానికే వాడబడతాయి. ఈ రోజులలో వీళ్ళు ‘బాబాలు’ గా కూడా చెలామణి అవుతున్నారు. వీళ్ళు తాము ముందుగానే ఏర్పాటు చేసుకున్న కొన్ని విధానాల ద్వారా తమకు అగోచర విషయాల (భవిష్యత్తు) ఙ్ఞానము ఉన్నదని చెప్పుకుంటూ, తమకు తోచిన, ఊహించిన విషయాలను చెబుతూ ఉంటారు. అగోచర విషయాల ఙ్ఞానాన్ని గురించి అటువంటి వాడిని ప్రశించడం – ఎంత ఘోరమైన పాపము అంటే, అతడు నలభై దినముల పాటు ఆచరించిన నమాజుల పుణ్యఫలము నుండి అల్లాహ్ అతడిని దూరం చేస్తాడు. అది అతడి శిక్ష.