«مَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِ فَلْيَقُلْ خَيْرًا أَوْ لِيَصْمُتْ، وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِ فَلْيُكْرِمْ جَارَهُ، وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِ فَلْيُكْرِمْ ضَيْفَهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 47]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“అల్లాహ్’ను మరియు అంతిమ దినమును విశ్వసించే వారు ఎవరైనా సరే, (పలికితే) మంచి మాటలే పలకాలి లేదా మౌనంగా ఉండాలి. అలాగే అల్లాహ్’ను మరియు అంతిమ దినమును విశ్వసించే వారు ఎవరైనా సరే, తన పొరుగు వాని పట్ల ఔదార్యము, ఉదార వైఖరి కలిగి ఉండాలి. అలాగే అల్లాహ్’ను మరియు అంతిమ దినమును విశ్వసించే వారు ఎవరైనా సరే, తన అతిథికి (వీలైనంతలో) ఆదరపూర్వకం గా అతిథి సత్కారాలు చేయాలి”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 47]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వివరిస్తున్నారు: అల్లాహ్ ను మరియు అంతిమ దినమును విశ్వసించుట – దాసుడు చివరికి మరలవలసినది ఈ రెండు విషయాల వైపునకే. అక్కడ అతని విశ్వాసము మరియు ఆచరణల ఆధారంగా అతనికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. కనుక ఎవరైతే అల్లాహ్ ను మరియు అంతిమ దినమును విశ్వసిస్తారో, వారు ఈ లక్షణాలు కలిగి ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్బోధిస్తున్నారు.
మొదటిది: మంచి మాటలు పలుకుట/మాట్లాడుట: ఇందులో అల్లాహ్ నామమును స్మరించుట, ఉదాహరణకు ‘తహ్లీల్’ (లా ఇలాహ ఇల్లాల్లాహ్), ‘తక్బీర్’ (అల్లాహు అక్బర్), ‘తమ్’హీద్’ (అల్-హందులిల్లాహ్) మొదలైనవి, మంచి చేయమని ఉద్బోధించుట, ఆదేశించుట, చెడు నుండి ఆపుట, నిరోధించుట, అలాగే, వ్యక్తుల మధ్య సయోధ్య కుదుర్చుట, వారికి సన్మార్గము వైపునకు మార్గదర్శనం చేయుట మొదలైనవన్నీ ఉన్నాయి. ఒకవేళ అతడు ఇది చేయలేకపోతే, అపుడు అతడు కనీసం మౌనంగానైనా ఉండాలి, ఎవరికీ హాని, నష్టము కలిగించే రీతిలో మాట్లాడకుండా తన నాలుక పట్ల జాగ్రత్త వహించాలి.
రెండవది: పొరుగు వానిని గౌరవించుట: అతనికి నష్టము కలిగించరాదు. అతని పట్ల గౌరవము, ఔదార్యము కలిగి ఉండాలి.
మూడవది: మిమ్మల్ని చూడడానికి మీ ఇంటికి వచ్చిన అతిధిని గౌరవించాలి: అతిథుల పట్ల ఆదరణ, గౌరవము కలిగి ఉండాలి, వారికి వీలైనంతలో తగిన విధంగా అతిథి సత్కారాలు చేయాలి.