హదీస్: “మీ సంతానము కంటే, మీ తల్లిదండ్రుల కంటే మరియు ప్రజలందరి కంటే నేను మీకు అత్యంత ప్రియమైన వాడిని కానంతవరకు మీరు పరిపూర్ణ (Perfect) విశ్వాసాన్ని పొందజాలరు.”
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ సంతానము కంటే, మీ తల్లిదండ్రుల కంటే మరియు ప్రజలందరి కంటే నేను మీకు అత్యంత ప్రియమైన వాడిని కానంతవరకు మీరు పరిపూర్ణ (Perfect) విశ్వాసాన్ని పొందజాలరు.”
الملاحظة
tidak ada harakat
النص المقترح عن أنس وأبي هريرة رضي الله عنهما مرفوعاً: «لا يُؤْمِنُ أحدُكم حتى أَكُونَ أَحَبَّ إليه مِن وَلَدِه، ووالِدِه، والناس أجمعين».
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో – ఒక ముస్లిం – తన తల్లిపై తనకు గల ప్రేమ కంటే, తన తండ్రిపై తనకు గల ప్రేమ కంటే, తన కుమారులపై, తన కుమార్తెలపై తనకు గల ప్రేమ కంటే మరియు ఈ ప్రపంచములోని మనుషులందరిపై తనకు గల ప్రేమకంటే – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై తనకు గల ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడో, అతడు తన ‘ఈమాన్’ (విశ్వాసములో) పరిపూర్ణత కలిగిన వాడు కాడు. పైన పెర్కొన్న అందరిపై ప్రేమ కంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై తనకు గల ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడమంటే, ప్రతి విషయములో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ను అనుసరించడం, ప్రతివిషయములోనూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు అండగా నిలవడం, మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఏ కొద్ది అవిధేయత ఉన్నా దానిని విడనాడడం మొదలైనవన్నీ వస్తాయి.
من فوائد الحديث
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ప్రేమ కలిగి ఉండుట, మరియు ఆ ప్రేమ - ఈ సృష్ఠిలోని మొత్తం సృష్ఠితాలలో దేని పట్లయినా ప్రేమ కలిగి ఉంటే, దాని కంటే కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ప్రేమకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చుట ప్రతి ముస్లిం యొక్క విధి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల పరిపూర్ణమైన ప్రేమకు నిదర్శనం: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ ను అనుసరించడం, దానిని బలపరచడం, దానికి అండగా నిలవడం. దాని కొరకు తన ధనాన్ని మరియు ప్రాణాన్ని సైతం త్యాగం చేయడం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ – ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలను శిరసావహించుట, ఆయన వాక్కులని విశ్వసించుట, ఆయన నిషేధించిన వాటికి, ఖండించిన వాటికి దూరంగా ఉండుట, ఆయనను అనుసరించుట, ధర్మములో ‘బిద్’అత్’ ను విడనాడుట – మొదలైన వాటిని అపేక్షిస్తుంది (బిద్’అత్: ధర్మములో లేని కొత్త విషయాలను ధర్మము పేరిట అనుసరించుట) .
(విశ్వాసులపై) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హక్కు, మిగతా ప్రజల యొక్క హక్కు కంటే మిక్కిలి ఘనమైనది మరియు మిక్కిలి ఖచ్చితమైనది. ఎందుకంటే, అది మార్గ భ్రష్ఠత్వము నుండి సన్మార్గము వైపునకు రావడానికి, నరకము నుండి రక్షించబడి స్వర్గమును సాధించడానికి ఏకైక కారణం, ఏకైక మార్గాంతరం.