«مَنْ لَقِيَ اللهَ لَا يُشْرِكُ بِهِ شَيْئًا دَخَلَ الْجَنَّةَ، وَمَنْ لَقِيَهُ يُشْرِكُ بِهِ دَخَلَ النَّارَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 93]
المزيــد ...
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను:
“ఎవరైతే అల్లాహ్’తో ‘షిర్క్’ నకు పాల్బడకుండా (ఆయనకు ఎవరినీ, దేనినీ సాటి కల్పించకుండా, తౌహీద్ పై ఉండి) అల్లాహ్ ను కలుస్తాడో, అతడు స్వర్గం లో ప్రవేశిస్తాడు. మరియు ఎవరైతే అల్లాహ్‘కు ఇతరులను సాటి కల్పిస్తున్న స్థితిలో అల్లాహ్ ను కలుస్తాడో అతడు నరకంలో ప్రవేశిస్తాడు”.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 93]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపు తున్నారు: ఎవరైతే, అల్లాహ్ కు ఏవిషయంలోనూ, ఎవరినీ మరియు దేనినీ ఆయనకు సాటి కల్పించని స్థితిలో చనిపోతారో, అటువంటి వారు తాము చేసిన తప్పులకు, పాపాలకు కొద్ది కాలం నరక శిక్ష అనుభవించినా, చివరికి వారి శాశ్వత గమ్యస్థానము స్వర్గమే. అదేవిధంగా, ఎవరైతే షిర్క్ నకు పాల్బడుతున్న స్థితిలో (అల్లాహ్ కు సాటి కల్పిస్తున్న స్థితిలో) చనిపోతారో వారు శాశ్వతంగా నరకంలో వేయబడతారు.