«إذا قُلْتَ لِصَاحِبِكَ: أَنْصِتْ، يومَ الجمعةِ، والْإِمامُ يَخْطُبُ، فَقَدْ لَغَوْتَ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 851]
المزيــد ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“శుక్రవారము నాడు ఇమాం ఖుత్బా ప్రసంగము ఇస్తూ ఉండగా, నీవు నీ ప్రక్కన కూర్చుని ఉన్న తోటివాడిని “మౌనంగా ఉండు” అని అంటే నీవు పెద్ద పొరపాటు చేసినవాడవు అవుతావు.”
ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "శుక్రవారనాడు ‘ఖుత్బతుల్ జుమ్’అహ్’ (జుమా ప్రసంగము) వినుట కొరకు హాజరైన వారు విధిగా ఆచరించవలసిన మర్యాద ఏమిటంటే వారు జుమా ప్రసంగాన్ని శ్రద్ధగా వినడం" అని వివరిస్తున్నారు. అంటే ఇమాం ప్రసంగాన్ని శ్రద్ధగా వినడం, అందులో చేయబడే సూచనలపై, హెచ్చరికలపై లోతుగా ఆలోచించడం, అవగాహన చేసుకోవడం, అలాగే ఇమాం ప్రసంగిస్తూ ఉండగా ఒక చిన్న మాటైనా సరే మాట్లాడకుండా ఉండటం ఉత్తమం. మీ ప్రక్కవాడిని “మౌనంగా ఉండు” అని, లేక “విను” అని అన్నా కూడా అతడు జుమా నమాజు యొక్క ఘనతను కోల్పోయిన వాడవుతాడు.