«لَيْسَ شَيْءٌ أَكْرَمَ عَلَى اللهِ تَعَالَى مِنَ الدُّعَاءِ».
[حسن] - [رواه الترمذي وابن ماجه وأحمد] - [سنن الترمذي: 3370]
المزيــد ...
అబీ హురైరాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“అల్లాహ్ ఎదుట అత్యంత గౌరవనీయమైనది ‘దుఆ’ తప్ప మరింకేమీ లేదు”.
[ప్రామాణికమైనది] - - [سنن الترمذي - 3370]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – అల్లాహ్ వద్ద, ఆరాధనలలో దుఆ కంటే ఉత్తమమైన విషయం ఏదీ లేదు అని తెలియజేస్తున్నారు. ఎందుకంటే అందులో ప్రతి విషయంలోనూ పరమ పవిత్రుడూ, మహోన్నతుడూ అయిన అల్లాహ్ యొక్క సుసంపన్నత కీర్తించబడుతుంది, అలాగే అందులో ఆయన ఎదుట ప్రతి విషయం లోనూ దాసుని అసహాయత, అతని లేమి ప్రకటితమవుతుంది.