«يَسِّرُوا وَلَا تُعَسِّرُوا، وَبَشِّرُوا وَلَا تُنَفِّرُوا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 69]
المزيــد ...
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“(ప్రజల కొరకు) విషయాలను తేలిక చేయండి, కష్టతరం చేయకండి; ప్రజలకు శుభవార్తలు వినిపించండి, వారిని దూరం చేయకండి”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 69]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు – షరియత్ అనుమతించిన పరిధులకు అనుగుణంగా ధర్మానికి సంబంధించిన విషయాలైనా లేక ప్రాపంచిక జీవితానికి సంబంధించిన విషయాలైనా ఆచరించుటకు, అనుసరించుటకు సులభతరం చేయాలి.
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు సత్సందేశాలను, మంచి విషయాలను, శుభవార్తలను తెలియజేయాలని, వాటినుండి ప్రజలను దూరం చేయరాదని ఆదేశిస్తున్నారు.