«هَلَكَ الْمُتَنَطِّعُون» قالها ثلاثًا.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2670]
المزيــد ...
అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“(ధర్మం విషయంలో) ‘హద్దుమీరేవారు నాశనమయ్యారు”. అలా మూడు సార్లు అన్నారు.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2670]
ఈ హదీసులో – (ధర్మం విషయంలో గానీ లేదా ప్రాపంచిక విషయంలో గానీ) ఇస్లాం విషయంలో హద్దులను ఉల్లంఘించి వ్యవహరించే వారు భంగపాటుకు, వైఫల్యానికి, ఆశాభంగానికీ గురి అవుతారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపుతున్నారు. అలాంటి వారు ధర్మం విషయంలో గానీ, తమ ప్రాపంచిక విషయాలలో గానీ, తమ సంభాషణల్లో గానీ లేదా తమ ఆచరణలలో గానీ సరియైన మార్గదర్శకత్వం లేక పోవటం వలననో, తగినంత ఙ్ఞానము లేక పోవటం వలననో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధించిన షరియత్ హద్దులను ఉల్లంఘిస్తారు.