«مَنْ قَالَ: لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، عَشْرَ مِرَارٍ كَانَ كَمَنْ أَعْتَقَ أَرْبَعَةَ أَنْفُسٍ مِنْ وَلَدِ إِسْمَاعِيلَ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2693]
المزيــد ...
అబూ అయ్యూబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : "ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఇలా పలికినారు:
“ఎవరైతే పది సార్లు ‘లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్’ (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి ఎవరూ లేరు, ఈ సృష్టి సామ్రాజ్యమంతా ఆయనకు చెందినదే, సకల స్త్రోత్రములూ ఆయనకు మాత్రమే చెందినవి, మరియు ఆయన ప్రతి విషయము పై అధికారము కలవాడు) అని ఉచ్ఛరిస్తాడో, అతడు ఇస్మాయీల్ అలైహిస్సలాం సంతతి నుండి నలుగురు బానిసలను విముక్తి కలిగించిన వానితో సమానము”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 2693]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియ జేస్తున్నారు. ‘ఎవరైతే ‘లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్’ (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి ఎవరూ లేరు, ఈ సృష్టి సామ్రాజ్యము ఆయనకు చెందినదే, సకల స్త్రోత్రములూ ఆయనకు మాత్రమే చెందినవి, మరియు ఆయన ప్రతి విషయము పై అధికారము కలవాడు) అని ఉచ్ఛరిస్తాడో అన్నారు – దాని అర్థం: సకల ఆరాధనలకు అర్హుడైన నిజ అరాధ్యుడు ఎవరూ లేరు కేవలం అల్లాహ్ తప్ప; కీర్తి, యశస్సు కలిగిన ఆయనకే (అల్లాహ్ కే) ఈ సృష్టి సామ్రాజ్యము చెందుతుంది; ప్రేమ మరియు భయభక్తులతో కూడిన సకల స్తోత్రములకు, ప్రశంసలకూ కేవలం ఆయన మాత్రమే అర్హుడు, ఆయనే సమర్థుడు, ఆయనకు సాధ్యము కానిది ఏదీ లేదు’ – అని. సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ గొప్ప స్తుతిని, స్తోత్రాన్ని ఎవరైతే ప్రతిరోజూ పదిసార్లు ఉచ్ఛరిస్తాడో – అతడు ఇస్మాయీల్ ఇబ్న్ ఇబ్రాహీం అలైహిముస్సలాం సంతతిలోని నలుగురు ‘మమ్లూకు’లను (రాజస్థానములలో ఉన్నత స్థాయీ, స్థానములలో నియమించబడిన బానిసలు) బానిసత్వమునుండి విముక్తులను గావించినంత పుణ్యము (ప్రతిఫలం) పొందుతారు. ఇక్కడ ‘ఇస్మాయీలు అలైహిస్సలాం సంతతి నుండి’ అని ప్రత్యేకముగా పేర్కొనుటలో ఉద్దేశ్యము వారు మిగతా వారికంటే ఎక్కువ గౌరవనీయులు కావడమే.