«مَا مِنْ عَبْدٍ يَسْتَرْعِيهِ اللهُ رَعِيَّةً، يَمُوتُ يَوْمَ يَمُوتُ وَهُوَ غَاشٌّ لِرَعِيَّتِهِ، إِلَّا حَرَّمَ اللهُ عَلَيْهِ الْجَنَّةَ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 142]
المزيــد ...
మాఖిల్ ఇబ్న్ యసార్ అల్ ముజనియ్యి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను –
“అల్లాహ్ అధికార పదవిలో నియమించిన ఎవరైనా సరే, తాను చనిపోయే దినమున, తన అధికారము క్రింద ఉన్న వారిని మోసం చేస్తున్న స్థితిలో చనిపోతే, అటువంటి వానికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించినాడు”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 142]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ఎవరికైతే ప్రజలపై అధికారం చేయు ఏదైనా పదవినిస్తాడో మరియు దానికి బాధ్యులను చేస్తాడో, అటువంటి వారందరి గురించి వివరిస్తున్నారు. ఆ అధికారి ఒక రాజ్యానికి రాజు కావచ్చు, అలాగే ఒక పురుషుడు తన ఇంటికి మరియు ఒక స్త్రీ తన ఇంటికి బాధ్యులు కావచ్చు. తమ అధికార పరిధి క్రింద ఉన్న వారి హక్కులను వారికి ఇచ్చుటలో, వాటిని పరిరక్షించుటలో, వారు ఏమైనా కొరతకు పాల్బడినా లేక మోసానికి పాల్బడినా లేక వారికి సరియైన మార్గదర్శకత్వం చేయక పోయినా, ఆ ప్రజల ధార్మిక మరియు ప్రాపంచిక హక్కుల విషయంలో విఫలమైన వారిగా పరిగణించబడతారు. అటువంటి వారు నిశ్చయంగా అత్యంత కఠిన శిక్షకు పాత్రులవుతారు.