హదీస్: “ఎవరి చేతిలోనైతే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా, ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదుల జాతి గాని, మరియు క్రైస్తవుల జాతి గానీ ఎవరైతే నా గురించి విని కూడా నేను ఏ సందేశముతో అయితే పంపబడినానో దానిని విశ్వసించకుండానే చనిపోతాడో, అతడు తప్పకుండా నరకవాసులలో ఒకడు అవుతాడు.”
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ఎవరి చేతిలోనైతే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా, ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదుల జాతి గాని, మరియు క్రైస్తవుల జాతి గానీ ఎవరైతే నా గురించి విని కూడా నేను ఏ సందేశముతో అయితే పంపబడినానో దానిని విశ్వసించకుండానే చనిపోతాడో, అతడు తప్పకుండా నరకవాసులలో ఒకడు అవుతాడు.”
الملاحظة
احبكم
النص المقترح لا يوجد...
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 153]వివరణ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా అంటున్నారు – ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదులు కానీ, క్రైస్తవులు కానీ లేక వేరే ఇంకెవరైనా కానీ వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశము చేరిన తరువాత దానిని విని కూడా, ఆ సందేశాన్ని విశ్వసించకుండా (ఇస్లాం ను స్వీకరించకుండా) చనిపోతే, నిశ్చయంగా అటువంటి వాడు నరకవాసులలో ఒకడు అవుతాడు. నరకం లో అతడు శాశ్వతంగా పడిఉంటాడు.
الملاحظة
زمانی کوردی دانابەزی
النص المقترح Kurde
من فوائد الحديث
ఇందులో ప్రపంచ ప్రజలందరికీ సాధారణంగా వర్తించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం ఉన్నది. ఆ సందేశాన్ని అనుసంరించడం తప్పనిసరి అని, ఆ సందేశముతో వచ్చిన షరియత్ అంతకు ముందు వచ్చిన అన్ని షరియత్ లను రద్దు చేస్తున్నదని తెలియుచున్నది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను విశ్వసించకుండా, అతడు మిగతా అందరూ ప్రవక్తలను (వారందరిపై అల్లాహ్ యొక్క కరుణ వర్షించుగాక) విశ్వసించినప్పటికీ, ఆ విశ్వాసము అతనికి ఏ విధంగానూ ప్రయోజనం కలిగించదు.
ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను గురించి నిజంగానే ఏమీ వినలేదో, మరియు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశం చేరలేదో వారు క్షమించబడతారు. తీర్పు దినము నాడు వారి వ్యవహారము అల్లాహ్ యొక్క ఆధీనములో ఉంటుంది.
ఒక వ్యక్తి (నరకములో పడకుండా), అతడు మృత్యువుకు సమీపములో ఉన్నా, తీవ్రమైన వ్యాధిగ్రస్తుడై ఉన్నా, అతడి ప్రాణము ఇంకా అతడి గొంతులోనికి చేరే ముందు క్షణము వరకూ – అతడు ఇస్లామును స్వీకరించి, ఆ విధంగా ఇస్లాం ద్వారా ప్రయోజనం పొంది తనను తాను రక్షించుకోగలడు.
అవిశ్వాసుల ధర్మాలను - అది యూదుల ధర్మమైనా, లేక క్రైస్తవుల ధర్మమైనా, లేక ఇతరుల ఏ ధర్మమైనా – సత్యధర్మాలేనని అంగీకరించడం కూడా అవిశ్వాసానికి (కుఫ్ర్ కు) పాల్బడినట్లే.
ఈ హాదీసులో యూదులు మరియు క్రైస్తవులు పేర్కొనబడినప్పటికీ, ఇది ప్రతి ఒక్కరికీ వర్తించే హెచ్చరిక. ఎందుకంటే యూదుల వద్ద మరియు క్రైస్తవుల వద్ద అవతరించ బడిన దివ్యగ్రంథాలున్నాయి. అయినప్పటికీ వారు హెచ్చరించబడుతున్నారు అంటే, మరి అవతరించిన ఏ దివ్య గ్రంథమూ లేని వారికీ ఈ హెచ్చరిక ఇంకా ఎక్కువగా వర్తిస్తుంది. అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను విశ్వసించడం, మరియు ఇస్లాం లోనికి ప్రవేశించడం ప్రతి ఒక్కరిపై విధి గావించబడింది.